S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్‌తో మొదటి టెస్టుకు మార్పులేని ఆసీస్ జట్టు

సిడ్నీ, డిసెంబర్ 8: పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు బ్రిస్బేన్‌లో జరిగే మొదటి, డే/నైట్ టెస్టు మ్యాచ్‌కి ఎలాంటి మార్పులు లేకుండా 12 మందితో కూడిన జట్టునే కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో మొదటి రెండు టెస్టులుసహా వరుసగా ఐదు టెస్టుల్లో పరాజయాలను చవిచూసింది. దీనితో కంగుతిన్న ఆస్ట్రేలియా సెలక్టర్లు దక్షిణాఫ్రికాతో చివరి టెస్టుకు ఏకంగా ఆరు మార్పులతో బరిలోకి దిగింది. ఎడెలైడ్‌లో జరిగిన ఆ టెస్టును ఏడు వికెట్ల ఆధిక్యంతో కైవసం చేసుకుంది.

బెంగళూరు బ్లాస్టర్స్ బాడ్మింటన్ జట్టు ఆవిష్కరణ

బెంగళూరులో గురువారం జరిగిన బెంగళూరు బ్లాస్టర్స్ బాడ్మింటన్ జట్టు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జట్టు సహ భాగస్వామి సచిన్ తెండూల్కర్. చిత్రంలో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, హీరో అల్లు అర్జున్, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. ఫుట్‌బాల్‌లో కేరళ ఫ్రాంచైజీలో భాగస్వామ్యం ఉన్న సచిన్ ఇప్పుడు బాడ్మింటన్ ఫ్రాంచైజీలోనూ సహ భాగస్వామిగా అవతరించాడు

ఆస్ట్రేలియా ఓపెన్‌కు టాప్ స్టార్లు

మెల్బోర్న్, డిసెంబర్ 8: వచ్చేనెల జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాప్ స్టార్లు ధ్రువీకరించారు. గర్భవతి కావడంతో వికోట్టరియా అజరెన్కా ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌కు రావడం లేదు. ఆమెను మినహాయిస్తే, సెరెనా విలియమ్స్, ఏంజెలిక్ కెర్బర్, రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే, ఏంజెలిక్ కెర్బర్ వంటి సూపర్ స్టార్లు ఈ టోర్నీలో ఆడతారు. ఈసారి టోర్నీలో అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో టాప్ సీడింగ్స్ మారిపోవడం గమనార్హం.

‘హరిత’ విలాపం..

అటవీ పరిరక్షణకు సంబంధించిన నూతన విధానాన్ని రూపొందించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేయడం విచిత్రమైన వ్యవహారం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిజంగా వాయిదా వేసిందా? లేక ఉత్కంఠను సృష్టించడానికి మాధ్యమాలలో ఇలాంటి ప్రచారం జరుపుతోందా? అన్న మీమాంసకు తావులేదు. గతంలో ప్రభుత్వ విధానం ముసాయిదా పత్రం ఒకటి సామాజిక మాధ్యమాలలో ప్రచారమైంది. కానీ అది విధాన పత్రం కాదని వెంటనే ప్రభుత్వం స్పష్టీకరించింది. కానీ ఇప్పుడు ఈ అటవీ పరిరక్షణ నూతన విధాన కార్యక్రమం వాయిదా పడినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

బాలనేరస్థుల సంస్కరణకు భరోసా ఏదీ?

నేరం అనేది పెద్దవారు చేసినా, చిన్నవారు చేసినా, ధనికులు చేసినా, పేదలు చేసినా, స్ర్తిలు చేసినా, పురుషులు చేసినా అది నేరమే అవుతుంది. ఆ నేరానికి ఆయా దేశాల్లోని శిక్ష్మాస్మృతిని అనుసరించి శిక్ష ఉంటుంది. న్యాయదేవత దృష్టిలో అందరూ సమానమే. అయితే, గత 150 ఏళ్లలో మేధావులు, మానవతా వాదుల దృష్టిలో, న్యాయ కోవిదులు, మానసిక శాస్తవ్రేత్తల దృష్టిలో గణనీయమైన మార్పు వచ్చింది. మిగతా నేరస్థుల కన్నా- బాల నేరస్థులకు వర్తించే న్యాయంలో తేడా వుండాలనే వాదన బలంగా వినిపిస్తూ వచ్చింది.

-కోడూరి శ్రీరామమూర్తి 93469 68969

తెలుగు విద్యార్థుల ముందంజ

జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం, జాతీయ ఎంపిక పరీక్షల్లో టాపర్లుగా నిలవడం కొద్ది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల ఆధిపత్యాన్ని రుజువు చేస్తోంది. ఏదో ఒక సంవత్సరానికి అది పరిమితం కాకుండా ఏకంగా గత పదేళ్లుగా అన్ని ఎంపిక పరీక్షల్లోనూ, ప్రవేశపరీక్షల్లోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సత్తా చూపుతున్నారు. సివిల్ సర్వీస్ పరీక్షలు, జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లోనూ, ‘నీట్’లోనూ, ప్రైవేటు యూనివర్శిటీలు నిర్వహించే అడ్మిషన్ల టెస్టుల్లో కూడా తెలంగాణ, ఆంధ్ర విద్యార్ధులు ముందంజలో ఉంటున్నారు.

- బివి ప్రసాద్

ఒకే ఒక్క మొనగాడు..!

‘‘అంతగా నవ్వొచ్చిన విషయం ఏంటో..? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. మాకు చెబితే మేమూ నవ్వుతాం..’’
‘‘అవినీతి తాట తీస్తా- ఇక అంతా ఆన్‌లైన్‌లోనే.. అని ప్రధానమంత్రి చెబుతున్నారు’’
‘‘దీనిలో నవ్వడానికేముంది..? 70 ఏళ్ల తరువాత దేశాన్ని ఒక మొనగాడు పాలిస్తున్నాడు. దానికి సంతోషపడాలి’’
‘‘అదేంటి వాజపేయిని, మోదీ రెండున్నరేళ్ల పాలనా కాలం కూడా కాంగ్రెస్‌లోనే కలిపేశావా? 70 ఏళ్ల లెక్క ఏంటి? ’’
‘‘ఏదో ఎమోషన్‌లో అలా అనేస్తాం. ప్రతి ఏడాదికి లెక్క చెప్పాలా? ’’
‘‘నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా మోదీ మొనగాడే.’’
‘‘ఇప్పటికైనా ఒప్పుకున్నావ్.. థ్యాంక్స్’’

- బుద్దా మురళి

నల్లధనం నివారణ అసాధ్యం

నల్లధనాన్ని నియంత్రించేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ దేశంలో నల్లధనాన్ని అంతం చేయడం అసాధ్యమని ఇదివరకే రుజువైంది. గతంలోనూ రెండు సందర్భాల్లో పెద్దనోట్లను రద్దు చేసినా నల్లధనం సమస్య సజీవంగానే ఉంది. అప్పట్లో పెద్దనోట్లను అత్యధిక శాతం ధనికులు వాడుకొనేవారు, దాచుకునేవారు. పెద్దనోట్లను గతంలో రద్దు చేసినపుడు సామాన్య జనం ఎలాంటి కష్టాలు పడలేదు. పెద్దనోట్లను రద్దు చేసిన ప్రభుత్వం మిగతా కరెన్సీని సిద్ధంగా ఉంచకపోవడంతో ఇపుడు బ్యాంకులు, ఎటిఎంల వద్ద నగదు కోసం జనం నరకయాతన అనుభవిస్తున్నారు. చిల్లర సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మార్కెట్లకు కళ

ముంబయి, డిసెంబర్ 8: గురువారం జరిగే ఐరోపా సెట్రల్ బ్యాంక్ ద్రవ్య సమీక్షలో ఉద్దీపక చర్యలను కొనసాగించవచ్చన్న అంచనాలకు తోడు, పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటామని ఆర్‌బిఐ హామీలు ఇచ్చిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలు ఆర్జించాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ ఏకంగా 457 పాయింట్లు లాభపడి 26,694 పాయింట్లకు చేరుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 8,200 పాయింట్ల స్థాయిని దాటిపోయింది. ఐరోపా మార్కెట్లు ప్రారంభంనుంచే లాభాల్లో సాగడాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఇనె్వస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో సూచీలు ప్రారంభంనుంచే భారీ లాభాల్లో సాగాయి.

జిఎస్‌టిపై రాష్ట్రాల డిమాండ్లతో కేంద్ర అధికారాలకే ఎసరు

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఏడాదికి కోటిన్నరకన్నా తక్కువ టర్నోవర్ ఉంటే పన్ను చెల్లింపుదారులపై అధికారం పూర్తిగా తమకే ఉండాలని రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్ వల్ల కేంద్రం అధికారాలు తగ్గిపోతాయని కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల బోర్డు (సిబిఇసి) చైర్మన్ నజీబ్ షా గురువారం అన్నారు. కేంద్ర, రాష్ట్రాల అంశాలున్న కొత్త వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని ఎలా అమలు చేయాలనే దానిపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జిఎస్‌టికి సంబంధించిన అనుబంధ చట్టాలు ఆగిపోయిన విషయం తెలిసిందే.

Pages