S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు అనుమతి ఇచ్చిందెవరు?

కొత్తపేట, డిసెంబర్ 8: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో సత్యాగ్రహ పాదయాత్ర చేయాలని భావిస్తున్న తనను అనుమతి తీసుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి గతంలో ఆయన విపక్ష నేతగా జరిపిన పాదయాత్రకు ఎవరి నుండి అనుమతి తీసుకున్నారో చెప్పాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోరారు. ఆ అనుమతి పత్రాలు తనకు చూపితే, తాను అదేరీతిలో అనుమతి కోరతానన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. నాడు చంద్రబాబు రోడ్డు మార్జిన్లపై మళ్లీ రోడ్డు వేసుకుని పాదయాత్ర సాగించారని, ఇలా వేసుకోవడానికి ఎవరి అనుమతి కోరారో తెలపాలన్నారు.

చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలవాలి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 8: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని గరాలదిబ్బ గ్రామంలో రూ.70లక్షలతో నిర్మించిన అంతర్గత రహదారులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బందరు నియోజకవర్గంలో తీర ప్రాంత గ్రామాలను కలుపుతూ రహదారి నిర్మించనున్నట్లు తెలిపారు.

స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి

తోట్లవల్లూరు, డిసెంబర్ 8: ప్రైవేట్ స్కూల్ బస్ వేగానికి ఓ చిన్నారి బలైన ఘటన గురువారం ఉదయం తోట్లవల్లూరు జెడ్‌పి రోడ్డులో జమ్మిచెట్టు వద్ద చోటు చేసుకుంది. మరో చిన్నారికి కాలు గాయంతో ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. వివరాల్లోకి వెళితే కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన వీరంకి శివనాగప్రసాద్, రమాదేవికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శివనాగప్రసాద్ తాపీ పని చేస్తుంటాడు. ఇటీవల అయ్యప్పమాల ధరించాడు. భార్య రమాదేవి ఐదు రోజులు ఇంటిలో ఉండని పరిస్థతి వచ్చింది. దీంతో రమాదేవి బుధవారం తమ కుమార్తె వీరంకి మోక్ష లక్ష్మి ప్రణతి (6)ని తీసుకుని తోట్లవల్లూరులో తన తల్లి పడమట మంగమ్మ ఇంటికి వచ్చింది.

బడి రుణం తీర్చుకుందాం

అవనిగడ్డ, డిసెంబర్ 8: ‘బడి రుణం’ తీర్చుకుందాం అంటూ పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గురువారం అవనిగడ్డ ప్రధాన వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. మనం చదువుకోవాలి, బడి అమ్మ ఒడిలాంటిది. ముందు మనం స్పందిద్దాం, ఇతరులకు స్ఫూర్తినిద్దాం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ముఖ్యంగా పూర్వ విద్యార్థులు బడి రుణం తీర్చుకునేందుకు తమవంతు సహకారాన్ని అందించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విద్యాలయాల ప్రతినిధులు తెలిపారు. ఈ ర్యాలీలో ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతిభా పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానం

ప్రశాంతంగా నామినేషన్ల ఘట్టం

విజయవాడ, డిసెంబర్ 8: ఎపిఎస్ ఆర్టీసీలో కార్మిక వర్గానికి ఎంతో కీలకమైన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సిసిఎస్) ఎన్నికలకు సంబంధించి గురువారం సాయంత్రం నామినేషన్ల ఘట్టం ముగిసింది. 9మంది డైరెక్టర్లతో కూడిన పాలకవర్గం ఏర్పాటుకు రాష్టవ్య్రాప్తంగా 236 మంది ప్రతినిధులను ఎన్నుకోటం కోసం ఈ నెల 16న ఎన్నికలు జరుగబోతున్నాయి. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 13న పోటీదారుల తుది జాబితా వెలువరిస్తారు. 16న ఎన్నికలు జరుగుతాయి. ఐదేళ్లకోసారి ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. మొత్తం 56వేల మంది కార్మికులు, ఉద్యోగులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు 155 యూనిట్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.

అమరావతి నిర్మాణానికి రాజవౌళి సలహా

అమరావతి, డిసెంబర్ 8:ప్రఖ్యాత సినీ దర్శకుడు రాజవౌళికి అరుదైన ఆహ్వానం దక్కింది. ప్రపంచస్థాయి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దనున్న అమరావతి నిర్మాణానికి సలహాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను అభ్యర్థించారు. రాజవౌళి నిర్మించిన బాహుబలి, అంతకుముందు మగధీర భారీ సినిమాల్లో అత్యంత ఆకర్షణీయమైన నగరాలను చూపించిన వైనం బాబును ఆకట్టుకుంది. అలాంటి తరహాలో నగర నిర్మాణానికి సూచన, సలహాలివ్వాలని బాబు ఆయనను కోరడమే కాకుండా, రాజవౌళి వద్దకు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరు శ్రీ్ధర్‌ను పంపారు. వారిద్దరూ బాహుబలి, మగధీరలో చూపించిన నగర నిర్మాణాల డిజైన్లపై చర్చించారు.

సెంట్ పీటర్స్ కథెడ్రల్ చర్చి కూల్చివేత అనుచితం

పటమట, డిసెంబర్ 8: నగరంలో 120 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సెంట్ పీటర్స్ కథెడ్రల్‌ను కూల్చివేయాలన్న ప్రభుత్వ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఉదయం చర్చి వద్ద క్రైస్తవులు ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా విజయవాడ కతోలిక పీఠం వికర్ జనరల్, సెంట్ పీటర్స్ కథెడ్రల్ విచారణకర్తలు ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ పురాతనమైన హిందూ దేవాలయాలను పరిరక్షిస్తున్న ప్రభుత్వం ప్రసిద్ధి చెందిన చర్చిలను కూడా కాపాడాల్సి వుందన్నారు.

జయలలిత అంత్యక్రియలు శాస్త్ర విరుద్ధం

విజయవాడ, డిసెంబర్ 8: తమిళనా డు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అంత్యక్రియలు శాస్త్ర విరుద్ధంగా జరి గాయని, శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ జ్యోతిష్య నిపుణు లు, ములుగు రామలింగేశ్వర వరప్రసా ద్ అభిప్రాయపడ్డారు. అంతిమ సం స్కారాన్ని సహచరురాలు శశికళ చేప ట్టడం సరైనది కాదన్నారు. శాస్ర్తియం గా స్ర్తిలు అంత్యక్రియలు చేసే అవకా శం లేదని, తర్పణం ఇవ్వడానికి, మట్టి చేయడానికి, అగ్ని సంస్కారం చేయ డానికి, పిండాలు పెట్టడానికి, యజ్ఞ యాగాది క్రతువులు చేయడానికి, గా యత్రి మంత్రం జపించడానికి అధికా రం లేదని తెలిపారు. స్ర్తిల కోసం నిర్దేశించబడిన వ్రతాలు, నోములు, పూజలు ఎన్నో వున్నాయి.

మెట్రోరైలు డిపో భూమికి న్యాయబద్ధంగా నష్టపరిహారం

విజయవాడ, డిసెంబర్ 8: నిడమానూరులో మెట్రోరైలు డిపో నిర్మాణానికి గుర్తించిన భూములకు నష్టపరిహారం న్యాయబద్ధంగా చెల్లించేలా జిల్లా యంత్రాంగం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఇన్‌చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు రైతులకు హామీ ఇచ్చారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మెట్రోరైలు డిపో నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న నిడమానూరు వాసులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ భూములు కోల్పోతున్నవారిని నష్టపరిచే ఉద్దేశ్యం లేదన్నారు. అభివృద్ధిపరంగా మెట్రోరైలు నిర్మాణం అవసరం వున్నందున భూయజమానులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

ఆర్టీసీకి నిధులిచ్చేది లేదు

హైదరాబాద్, డిసెంబర్ 8: ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న జిహెచ్‌ఎంసి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏటా ఆర్టీసికి రూ. 273.38 కోట్లు చెల్లించలేని పరిస్థితులున్నాయని, ఆర్టీసికి జిహెచ్‌ఎంసి నిధులు కేటాయించేది లేదని జిహెచ్‌ఎంసి స్థారుూ సంఘం తీర్మానించింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం స్థారుూ సంఘం సమావేశం జరిగింది. అజెండాలోని అన్ని అంశాలపై కూలంకుశంగా చర్చించిన సభ్యులు ఆర్టీసికి జిహెచ్‌ఎంసి ఏటా చెల్లిస్తున్న నిధులను ఇకపై చెల్లించలేమని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపే ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు.

Pages