S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధం

అలహాబాద్, డిసెంబర్ 8: ముస్లిం సంప్రదాయంలో విడాకులు ఇవ్వడానికి పాటించే ట్రిపుల్ తలాఖ్ విధానం అత్యంత క్రూరమైందని, రాజ్యాంగ విరుద్ధమైనదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ముస్లిం మహిళల కష్టాలను పోగొట్టడానికి వీలుగా ముస్లిం వివాహ చట్టాన్ని సవరించకూడదా? అని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. మూడు సార్లు తలాఖ్ చెప్పడం ద్వారా తక్షణం విడాకులిచ్చే ఈ పద్ధతిఏమాత్రం అర్థం లేనిదని, అంతేకాకుండా భారత దేశం ఒక దేశమని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తోందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. ‘ముస్లిం భార్యలు ఈ క్రూరత్వాన్ని ఎప్పటికీ భరిస్తూనే ఉండాలా?

అధికారపక్షం ట్రాప్‌లో పడిపోవద్దు

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రజలు పడుతున్న సమస్యలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష పార్టీలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం వేసిన ట్రాప్‌లో ప్రతిపక్ష పార్టీలు చిక్కుకున్నాయని, అందుకే నోట్ల రద్దు నిర్ణయంపై చర్చ జరగకుండా పార్లమెంట్‌ను అడ్డుకొంటున్నాయని అన్నారు. మిగిలిన రోజుల్లోనైన నోట్ల రద్దుపై చర్చ జరిగేలా చూడాలని ఉండవల్లి సూచించారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీడియాద్యారా, చట్ట సభలద్యారా ప్రభుత్వానికి విన్నవించాలని ఎంపీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

లొంగిపోయిన తపాలా అధికారి

హైదరాబాద్, డిసెంబర్ 8: తపాలా కార్యాలయాల ద్వారా నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తపాలా అధికారి సుధీర్‌బాబు గురువారం సిబిఐ ఎదుట లొంగిపోయారు. సుధీర్‌బాబుపై సిబిఐ మూడు కేసులు నమోదు చేసింది. హిమయత్‌నగర్, గోల్కొండ, కార్వాన్ తపాలా కార్యాలయాల్లో రూ.2.95 కోట్లు అక్రమాలు జరిగినట్లు సిబిఐ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. దీంతో సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబును తపాలా శాఖ ఉన్నాతాధికారులు ఉద్యోగం నుండి తొలగించారు. ప్రస్తుతం సుధీర్‌బాబును సిబిఐ అధికారులు విచారిస్తున్నారు.

కాలుష్య పరీక్షల ఫీజు హెచ్చింపు

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల కాలుష్యం పరీక్షల ఫీజులను పెంచారు. ఇరవై సంవత్సరాల క్రితం నిర్ణయించిన ధరలపై 100 శాతం ఫీజు పెంచారు. పెంచిన ఫీజు శుక్రవారం నుండి అమల్లోకి వస్తుంది. ద్విచక్ర వాహనాలకు కాలుష్య పరీక్షకు ప్రస్తుతం 15 రూపాయలు ఫీజు వసూలు చేస్తుండగా దీన్ని 30 రూపాయలకు పెంచారు. మూడుచక్రాలు, నాలుగు చక్రాల వాహనాలకు (పెట్రోల్) ప్రస్తుతం పరీక్షల ఫీజు 25 రూపాయలు ఉండగా, దీన్ని 50 రూపాయలకు పెంచారు. అలాగే అన్ని తరగతుల డీజల్ వాహనాలకు కాలుష్య పరీక్షలకు ప్రస్తుతం 30 రూపాయలు వసూలు చేస్తుండగా దీన్ని 60 రూపాయలకు పెంచారు.

ఈ కష్టాలు ఎంతోకాలం ఉండవు

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: అవినీతికి వ్యతిరేకంగా తాను చేస్తున్న యజ్ఞానికి దేశమంతా అండగా నిలిచినందుకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి సరిగ్గా నెలరోజులైన సందర్భంగా గురువారం తన అభిప్రాయాలను ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ‘అవినీతికి, ఉగ్రవాదానికి, నల్లధనానికి వ్యతిరేకంగా నేను ప్రారంభించిన యజ్ఞానికి దేశప్రజలంతా వెన్నుదన్నుగా ఉన్నారు. వారందరికీ శాల్యూట్ చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

తేలని 1998 డిఎస్సీ అభ్యర్థుల భవితవ్యం

హైదరాబాద్, డిసెంబర్ 8: దాదాపు 18 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 1998 డిఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇదిగో అదుగో అంటూ చుక్కలు చూపిస్తోంది. 1998లో అర్హుల జాబితాను ప్రకటించి ఖాళీలు లేవనే సాకుతో ఉద్యోగాలు ఇవ్వకుండా తర్వాత ఇస్తామని అప్పటి ప్రభుత్వం వారిని పక్కన పెట్టింది. అప్పటి నుండి ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వాలకూ, అధికారులకు పట్టడం లేదు. అనేక మార్లు దీక్షలు చేసినపుడు తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడమే తప్ప నియామకాలకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ఆనందవనంలో సద్గురు శివానందమూర్తి జయంత్యుత్సవాలు

భీమునిపట్నం, డిసెంబర్ 8 : భక్తుల పాలిట భగవత్ స్వరూపంగా భాసిల్లిన సద్గురు శివానందమూర్తి 89వ జయంతి వేడుకలు భీమిలిలోని ఆనందవనంలో గురువారం ఘనంగా జరిగాయి. మార్గశిర శుద్ధ నవమినాడు జరుపుకునే గురూజీ జయంతి వేడుకలు ఆయన కుమారుడు బసవరాజు-రాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా ఆనందవనంలో గల ఉపన్యాస మందిరంలో గురూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వేదికపై గురూజీ పాదుకలను ఉంచి అర్చకులు గరిమెళ్ల రామావధాని ప్రత్యక్ష పూజలు నిర్వహించారు.

నిధులు ఇవ్వండి

న్యూఢిల్లీ, డిసెంబర్ 8:తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి పెద్దనోట్ల రద్దుతో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె పెళ్లి రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన కెసిఆర్ జైట్లీని కలిశారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల గురించి ప్రత్యేకంగా గుర్తుచేసినట్లు తెలిసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం పెద్దఎత్తున సహాయం చేయాలని, విభజన చట్టంలో ఈ మేరకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇక కార్డే లార్డు

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: నగదు రహిత లావాదేవీల దిశగా కేంద్రం బలమైన అడుగు వేసింది. ప్రతి రంగంలోనూ కార్డు, ఆన్‌లైన్ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు అనేక రాయితీలు, తాయిలాలు ప్రకటించింది. కార్డు ద్వారా చెల్లింపులు జరిపే వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం కీలక నిర్ణయాలు ప్రకటించారు. పెట్రోలు, డీజిల్, రైల్వే టికెట్ల కొనుగోలు నుంచి సాధారణ, జీవిత బీమా వరకూ మొత్తం 11 అంశాలపై డిస్కౌంట్ల వర్షం కురిపించారు. రెండు వేల రూపాయల వరకూ కార్డులపై జరిపే చెల్లింపులపై ఎలాంటి సేవా పన్ను ఉండదని కూడా జైట్లీ ప్రకటించారు.

డిజైన్ మార్చం

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణంతోపాటు అన్ని అనుమతులు లభించాయని కేంద్ర నీటిపారుదల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బాలయన్ తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సభ్యుడు సీతారాం నాయక్ అడిగిన అనుబంధ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలంలోని రామాలయం ముంపునకు గురవుతుందనే విషయం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతున్నందున ఇప్పుడు ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు చేయలేమని సంజీవ్ స్పష్టం చేశారు.

Pages