S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటల్‌కు మారదాం

న్యూఢిల్లీ, డిసెంబర్ 8:దేశ ప్రజలు డిజిటల్ విధానంలో ఆర్థిక లావాదేవీలు సాగించేందుకు అవసరమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నగదు రహిత లావాదేవీలపై ఏర్పాటైన కమిటీ సమావేశానికి ఆయన గురువారం అధ్యక్షత వహించారు. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియా, వివిధ బ్యాంకుల సిఎండీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగిశాక ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశ ప్రజల ఆర్థిక లావాదేవీలు చాలావరకు డిజిటల్ పద్ధతిలో జరిగేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

గుట్టలుగా నోట్ల కట్టలు

చెన్నై/తిరుపతి, డిసెంబర్ 8: ఆదాయం పన్ను శాఖ అధికారులు గురువారం చెన్నైలో టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి, ఆయన అనుచరుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేసి సుమారు 120 కోట్ల రూపాయల విలువైన పాత, కొత్త నోట్లు, బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక స్టార్ హోటల్ రూమ్ సహా ఈ ముఠాకు చెందిన ఎనిమిది ప్రాంతాలపై అధికారులు దాడులు జరిపారు. పారిశ్రామికవేత్తలు శేఖర్‌రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీనివాసరెడ్డి, వారి ఏజంట్ ప్రేమ్‌రెడ్డిలకు చెందిన ఆస్తులపై దాడులు నిర్వహించినట్లు ఐటి అధికారి ఒకరు చెప్పారు.

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు

విజయవాడ, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా గురువారం విడుదల చేశారు. మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 17 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ వివరాలను గురువారం ఇక్కడ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మార్చి 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, 2 నుంచి రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి.

కుప్పకూలిన భవనం

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 8: హైదరాబాద్ నానక్‌రాం గూడలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనం కుప్పకూలటంతో కనీసం పదిమంది మరణించినట్లు సమాచారం. పలువురు క్షతగాత్రులయ్యారు. బాధితుల్లో చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం ఉండగా మిగతావారంతా విశాఖపట్నం జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన జంటనగరాల్లో అనుమతి లేని నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

జెన్నింగ్స్ సూపర్ ఇన్నింగ్స్

ఇంగ్లాండ్ తరఫున 19 మంది తమతమ కెరీర్ మొదటి టెస్టులోనే శతకాలను నమోదు చేయగా, వారిలో ఓపెనర్లు ఎనిమిది మంది. ఎడమచేతి వాటం ఆటగాడైన జెన్నింగ్స్ గత 50 సంవత్సరాల కాలంలో, తమ మొదటి టెస్టులో సెంచరీ చేసిన మూడో ఓపెనర్ కావడం విశేషం. ఇతని కంటే ముందు ఆండ్రూ స్ట్రాస్, అలస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. జెన్నింగ్స్ కంటే ముందు, 2009లో జొనాథన్ ట్రాట్ ఆస్ట్రేలియాపై ది ఓవల్ మైదానంలో సెంచరీ చేశాడు. అది కెరీర్‌లో ట్రాట్‌కు తొలి టెస్టు.
**

జెన్నింగ్స్‌ను అవుట్ చేసిన అశ్విన్ ఆనందం

సెంచరీ హీరో జెన్నింగ్స్‌ను అవుట్ చేసిన అశ్విన్ ఆనందం. అతనికి కెరీర్‌లో అతనికి ఇది 238వ టెస్టు వికెట్. మొదటి ఆటలోనే అతను నాలుగు వికెట్లు పడగొట్టాడు

ముంబయికర్ లేకుండా మొదటి టెస్టు!

ముంబయి, డిసెంబర్ 8: భారత క్రికెట్‌లో ముంబయి ఆధిపత్యం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే సమయంలో భారత జట్టులో కనీసం ఇద్దరు ముగ్గురు ముంబయి ఆటగాళ్లు ఉండేవాళ్లు. ఒక్కోసారి ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆరు నుంచి ఏడుగురు ముంబకర్‌లు ఉండేవారంటే, అక్కడి ఆధిపత్యాన్ని ఊహించుకోవచ్చు. అయితే, 83 సంవత్సరాల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక్క ముంబయి ఆటగాడు కూడా లేకుండానే టెస్టు మొదలైంది. 1933లో భారత్ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి మొదలుపెడితే, ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు ఆరంభానికి ముందు వరకూ 505 టెస్టులు ఆడింది.

గారాను ఢీకొన్న ఒలింపియన్ శివ థాపా

గౌహతిలో గురువారం మొదలైన జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ తొలి ఫైట్‌లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన గొమిన్ గారాను ఢీకొన్న ఒలింపియన్ శివ థాపా (కుడి). ఈ ఫైట్‌లో థాపా 5-0 తేడాతో గెలిచాడు. కాగా, ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మూడు జట్లు బరిలోకి దిగడంతో, మొదటి రోజు మిగతా ఫైట్స్‌ను అధికారులు రద్దు చేసి, డ్రాలో మార్పులుచేర్పులు చేశారు. అంతకు ఉందు అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ఈ చాంపియన్‌షిప్స్‌ను ప్రారంభించారు

భారత్ శుభారంభం

లక్నో, డిసెంబర్ 8: జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. కెనడాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకూ భారత్ ఆధిపత్యం కొనసాగితే, కెనడా క్రీడాకారులు ప్రేక్షక పాత్ర పోషించారు. మ్యాచ్ 35వ నిమిషంలో భారత్‌కు తొలి గోల్ మన్దీప్ సింగ్ ద్వారా లభించింది. మరో 11 నిమిషాల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. 60వ నిమిషంలో వరుణ్ కుమార్, 66వ నిమిషంలో అజిత్ పాండే చేసిన గోల్స్‌తో భారత్ తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థికి గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా, నాలుగు గోల్స్ తేడాతో గెలిచింది.

అంపైర్ రీఫెల్ తలకు గాయం

ముంబయి: ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ పాల్ రీఫెల్ బ్యాటింగ్ చేయలేదు. కానీ, భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన బంతి తలకు తగలడంతో కిందపడిపోయాడు. అనంతరం వైద్య చికిత్స కోసం అతను మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌తో గురువారం మొదలైన నాలుగో టెస్టు మ్యాచ్ రెండో సెషన్ ఆట ప్రారంభంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భువీ బంతిని ఫీల్డ్ చేసి, వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్‌కు అందించే ప్రయత్నం చేశాడు. అయితే, అతను విసిరిన బంతి లెగ్ అంపైరింగ్ చేస్తున్న రీఫెల్ తల వెనుక భాగంలో తగిలింది.

Pages