S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో 50 వేల మందికి రూ. 5 భోజనం

హైదరాబాద్, డిసెంబర్ 8: మహానగరంలో అర్దాకలితో అలమటించే వారికి మధ్యాహ్నం పూట పెట్టడన్నం పెట్టాలన్న మహాసంకల్పంతో జిహెచ్‌ఎంసి ప్రస్తుతం అమలు చేస్తున్న రూ. 5 భోజన పథకాన్ని మున్ముందు మరింత విస్తరించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బోరబండలో కొత్తగా ఏర్పాటు చేసిన రూ. 5 భోజనం పంపిణీ కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ. 30 కోట్లతో మరో 50వేల మందికి ఈ భోజనాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. అంతేగాక, ప్రస్తుతం నగరంలో ఉన్న ఈ భోజన పంపిణీ కేంద్రాల సంఖ్యను 150కు పెంచనున్నట్లు మేయర్ తెలిపారు. రూ.

స్నాచర్లపై తిరగబడ్డ వృద్ధురాలు

ఘట్‌కేసర్, డిసెంబర్ 8: వృద్ధురాలి కంట్లో కారం చల్లి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి దత్తాత్రేయనగర్‌లో గురువారం జరిగింది. చైన్‌స్నాచర్లను ప్రతిఘటించి మూడు తులాల బంగారు గొలుసులో రెండు తులాలను కాపాడుకున్న వృద్ధురాలి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌సినగర్ పంచాయతీ దత్తాత్రేయనగర్‌కు చెందిన చందుపట్ల హంసమ్మ అదే కాలనీలో ఉంటున్న వాలెటీ సూపర్ మార్కెట్‌లో సరుకులు కొనేందుకు వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా షూటింగ్ బిల్డింగ్ సమీపంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు గుర్తు తెలియని యువకులు వెనుక నుండి వచ్చి వృద్ధురాలి కంట్లో కారం చల్లారు.

కుప్ప కూలిన ఏడంతస్తుల మేడ

హైదరాబాద్, గచ్చిబౌలి, డిసెంబర్ 8: నానక్‌రామ్‌గూడ ఘటనలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతులంతా దినసరి కూలీలే. మొన్న జూబ్లీహిల్స్‌లోని ఫిలిం క్లబ్, నిన్న కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఆర్చి, నేడు నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలి వలస కూలీల ప్రాణాలను బలిగొంది. విషాదకరమైన ఈ సంఘటన గురువారం రాత్రి తొమ్మిది గంటలకు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో మహానగరంలో నిర్మాణంలో ఉన్న భవనాలు కుప్పకూలి కూలీలు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి.

30 రోజులు.. ముప్పుతిప్పలు

హైదరాబాద్, డిసెంబర్ 8: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుని నెలరోజులు గడుస్తున్నా, సామాన్యుల కష్టాలు తొలగనేలేదు. గడిచిన ముప్పై రోజుల్లో నగరంలో ఇద్దరు వృద్దులు మృతి చెందగా, నగదు కొరత కారణంగా ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి. గత నెల 8వ తేదీన వెయ్యి, 500 నోటును రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల పాటు ప్రజలకు నగదు విత్‌డ్రా, చిల్లర కోసం కష్టాలు తప్పవని ప్రకటించినా, నెలరోజులు గడుస్తున్నా, వినియోగదారులు, ఖాతాదారులకు కష్టాలు రెట్టింపయ్యాయే తప్ప ఏ మాత్రం తగ్గటం లేదపు. ముఖ్యంగా ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో జీతాలు జమ అవుతున్న వేతన జీవుల అవస్థలు వర్ణణాతీతం.

సెటప్ బాక్స్ పెట్టుకోకపోతే జనవరి 1 నుండి ప్రసారాల నిలిపివేత

వికారాబాద్, డిసెంబర్ 8: కేబుల్ టివికి సెటప్ బాక్స్‌లు పెట్టుకోకపోతే జనవరి ఒకటో తేదీ నుండి ప్రసారాలు నిలిపివేస్తామని తెలంగాణ ఎంఎస్‌వో రాష్ట్రం అధ్యక్షుడు, బ్రైట్‌వే కమ్యూనికేషన్స్ ఎండి ఎం.సుభాష్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌జెం కంఫర్ట్‌లో ఏర్పాటు చేసిన వికారాబాద్ పట్టణ, పరిసర గ్రామాల్లో కేబుల్ ఆపరేటర్లకు కేబుల్ రంగ డిజిటలైజేషన్, సెటప్‌బాక్స్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 2011లో ప్రతి కేబుల్ టివికి సెటప్‌బాక్స్ అమర్చుకొని ప్రసారాలను అందివ్వాలని భారతప్రభుత్వం చట్టం చేసిందని చెప్పారు.

ఆర్థిక అక్షరాస్యత పెంపొందించాలి

హైదరాబాద్, డిసెంబర్ 8: జిల్లా పరిధిలో ఆర్థికపరమైన అక్షరాస్యతను పెంపొందించేందుకు తగిన ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్డును సిద్దం చేయాలని లీడ్ డిస్ట్రిక్ మేనేజర్‌ను కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. జిల్లాలోని 16 మండలాలకు బ్యాంకులను గుర్తించి మండలాల వారీగా మ్యాపింగ్ చేపట్టాలని ఆదేశించారు. పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో జిల్లాలోని ప్రజల్లో నగదు రహిత సేవలకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించటంపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన గురువారం జెసి, సిఆర్వో మాయాదేవీలతో కలిసి వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నెల గడిచినా అదే సీన్

ఖైరతాబాద్, డిసెంబర్ 8: పెద్ద నోట్ల రద్దు చేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయం సగటు జీవిని కుదిపేస్తున్నది. నిర్ణయం వెలువడి నెలరోజులు గడిచినా సాధారణ స్థితి నెలకొనక పోగా రోజు రోజుకు చిన, చితక పనులు చేసుకొని జీవనం కొనసాగించే వారి పరిస్థితి అతి దయనీయంగా మారిపోయింది. చేసుకునేందుకు పనులు లేకపోవడం, పనిచేసినా డబ్బు చేతికందకగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో మొదలైన కష్టాలు ఇప్పట్లో వదిలేటట్టు కనిపించడం లేదు. ఆ నాటి నుంచి రూ.500, 1000 నోటు చూస్తేనే భయపడే పరిస్థితి నెలకొంది.

అక్రమ కట్టడాలను కూల్చివేసిన హెచ్‌ఎండిఎ

మేడ్చల్, డిసెంబర్ 8: మేడ్చల్ మండలంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (హెచ్‌ఎండిఎ) అధికారులు పోలీసు బందోబస్తు మధ్య గురువారం అక్రమ కట్టడాలను, అక్రమ లేఅవుట్లను కూల్చివేశారు. గురువారం ఉదయమే ఎన్‌ఫోర్స్‌మెంటు సిబ్బందితో నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న హెచ్‌ఎండిఎ అధికారులు కమిషనర్ రామిరెడ్డి టౌన్‌ప్లానింగ్ అధికారి నర్సింహ్మరెడ్డి చర్చించి అక్కడి నుండి నేరుగా మేడ్చల్ పట్టణం నుండి గౌడవెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో సర్వే 1025, 1026లో వెలిసిన జ్యోతినగర్‌లో హెచ్‌ఎండిఎ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 14ఇళ్లను జెసిబి సహాయంతో కూల్చివేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల గోడలను నేలమట్టం చేశారు.

కూలిపోయన ఏడంతస్తుల భవనం

చిత్రాలు..గురువారం రాత్రి హైదరాబాద్ నానక్‌రాంగూడలో ఏడంతస్తుల భవనం కూలిపోయన ప్రాంతంలో గుమిగూడిన జనం. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి పద్మారావు. పేకమేడలా కూలిన భవంతి శిథిలాలు

జయ బుగ్గలపై ఏమిటీ రంధ్రాలు!?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బుగ్గలపై కనిపించిన రంధ్రాలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. రాజాజీ హాలులో జయ పార్ధివ శరీరాన్ని లోతుగా గమనించిన వారికి ఇవి కనిపించాయి. చికిత్సలో భాగంగానే ఈ రంధ్రాలు చేశారా లేక ఇందుకు మరొ కారణమేమైనా ఉంటుందా అన్నది మిస్టరీగా మారింది. అసలు 75రోజుల పాటు చికిత్స చేయాల్సిన మిస్టరీ జబ్బు జయకు ఏమి వచ్చిందని కూడా తమిళనాట చర్చ జరుగుతోంది.

Pages