S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వే స్టేషన్లు, బస్సుల్లో పాత 500నోటు చెల్లదు

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశంలోని రైల్వే స్టేషన్లు, బస్సులు, మెట్రో స్టేషన్లలో పాత 500నోట్లు ఇక చెల్లవు. 10వ తేదీ తరువాత పాత 500 రూపాయల నోట్లను తీసుకోరని ప్రభుత్వం వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇంతకు ముందు రైల్వే కౌంటర్లు, ప్రభుత్వం రంగ బస్సు టికెట్లకు డిసెంబర్ 15 వరకూ అనుమతిస్తారని తెలిపారు. ఇప్పుడు దాన్ని డిసెంబర్ 10వరకు కుదించారు. అయతే ఈ నెల 3 నుంచే పాత 500 రూపాయల నోట్లను కొన్నిచోట్ల స్వీకరించడం మానేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొనుగోలుకు పాత నోట్లను తీసుకోవడం మానేశారు.

రిసోర్స్ శాట్‌లో కెమెరాలు

చెన్నై, డిసెంబర్ 8: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఉపగ్రహాల ప్రయాణానికి సంబంధించి మరింత కచ్చితంగా సమాచారం సేకరించేందుకు కొత్త ప్రయోగం చేసింది. బుధవారం ప్రయోగించిన రిసోర్స్ శాట్ 2ఏ ఉపగ్రహంపై రెండు కెమెరాలు ఉంచారు. శాటిలైట్ ప్రయోగ సమయంలో మోటార్లు, ఉపగ్రహాలు, వేడి శకలాలు విడిపోవటంపై మరింత కచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇస్రో చరిత్రలో ఇలాంటి ఏర్పాటు ఇదే మొదటిసారి.

అర్బన్ పరిధిలో సబ్ డివిజన్‌ల విస్తరణ

గుంటూరు, డిసెంబర్ 8: గుంటూరు అర్బన్ పరిధిలోని సబ్ డివిజన్ల అధికారిక ప్రాంతపు హద్దుల్లో మార్పులు చేర్పులు అంశంపై అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ఠ త్రిపాఠి దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి త్రిపాఠి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతమున్న సబ్ డివిజన్లలోని పోలీసుస్టేషన్ల సంఖ్య, గ్రామాలు, ప్రజల సంఖ్య, విస్తీర్ణం, సిబ్బంది పనిభారం తదితర విషయాలపై ఆరా తీశారు. ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే సర్దుబాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుశాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.

ఈ కల్తీకారం..హానికరమే

గుంటూరు, డిసెంబర్ 8: గుంటూరు కేంద్రంగా ఇటీవల వెలుగుచూసిన కల్తీ కారం నిల్వలు ప్రజారోగ్యానికి ప్రమాదకరమైనవిగా రసాయన పరీక్షలలో తేలింది. రాష్టవ్య్రాప్తంగా విజిలెన్స్, మార్కెటింగ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి 39 రకాల శాంపుల్స్ సేకరించారు. నగరంలోని పలు కోల్డు స్టోరేజీలతో పాటు మిల్లులతో పాటు రోడ్ల వెంట విసిరేసిన 65వేల బస్తాల కల్తీ కారం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పది శాంపుల్స్‌ను పరీక్షలకు పంపారు. ప్రజారోగ్యానికి భంగకరంగా కారంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న పౌడర్‌ను కలిపారని పరీక్షలలో తేలింది.

నేడు అనుపుకు సియం చంద్రబాబు రాక

విజయపురిసౌత్, డిసెంబర్ 8: ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ సమీపంలో శుక్రవారం ఏర్పాటు చేస్తున్న అనుపు ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో అనుపుకు మధ్యాహ్నం 3.10గంటలకు ముఖ్యమంత్రి రానున్నారు. అనంతరం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఉత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవ వేడుకలకు ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ డాక్టర్ సుధామూర్తి, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బినోద్ పాల్గొంటారు.

కాలచక్ర భూముల భూ సేకరణ : జెసి క్రితికాశుక్లా

అమరావతి, డిసెంబర్ 8: మండల కేంద్రమైన అమరావతిలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా గల 16 ఎకరాల కాలచక్ర భూములను భూ సేకరణ ద్వారా త్వరలో సేకరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ క్రితికాశుక్లా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం జెసి శుక్లా సిఆర్‌డిఎ, రెవెన్యూ అధికారులతో కలిసి ధ్యానబుద్ధ ప్రాజెక్టు, కాలచక్ర పొలాలను పరిశీలించారు. గతంలో ఉన్న రైతుల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, సరైన రైతుల జాబితాను తక్షణమే సేకరించాలని ఆదేశించారు. వీలైనంత త్వరలో ఆయా రైతులకు పరిహారం చెల్లించి భూములను ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు.

వేడెక్కుతున్న పేట రాజకీయాలు

నరసరావుపేట, డిసెంబర్ 8: పెద్దనోట్ల రద్దుతో ప్రజలందరూ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నరసరావుపేట నియోజకవర్గంలో రాజకీయ పార్టీల నాయకులు అతి వేగంగా పార్టీలు మారుతూ రాజకీయాలను వేడేక్కిస్తున్నారు. రాజకీయాల ఉద్ధండుల కోట, పల్నాడు ముఖద్వారం నరసరావుపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణల నేపధ్యంలో రోజు రోజుకూ రాజకీయాలు మారుతున్నాయి. కనుచూపు మేరలో ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ కాంగ్రెస్, వైయస్సార్‌సీపీ నాయకులు రాత్రికి రాత్రి పార్టీలు మారుతూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

సింగరేణి కార్మికులకు వేతనాల వెతలు

కొత్తగూడెం, డిసెంబర్ 8: కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్ధుతో సింగరేణి కార్మికులకు వేతన కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ధ పారిశ్రామిక సంస్థగా సింగరేణి విరాజిల్లుతున్న విషయం విదితమే. మొత్తంగా సింగరేణిలో 54,858 ఎన్‌సిడబ్ల్యు ఎ కార్మికులు, 2,435 ఎగ్జిక్యూటివ్‌లు కలిపి 57,293మంది ఉన్నారు. సింగరేణిలో డిసెంబర్ 1నుండి 7వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తంగా వేతనాలను వారి వారి బ్యాంకు ఖాతాలలో యాజమాన్యం జమ చేసింది.

కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుపాలు

పినపాక, డిసెంబర్ 8: మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తూ కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని, ఇది రోజురోజుకు తుగ్లక్ పాలనగా మారుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి కాసాని ఐలయ్య ఆరోపించారు. గురువారం పినపాక మండల స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ పాలన సామాన్యుడికి గుదిబండగా మారుతుందన్నారు. దీనిపై పేదలే తిరుగుబాటు చేయాలన్నారు. పేదల పాలిట పెన్నిధిగా చెప్పుకుంటున్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల నిజస్వరూపం కొద్ది రోజుల్లో బయటపడుతుందన్నారు.

విద్యాలయాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ

జూలూరుపాడు, డిసెంబర్ 8: మండల కేంద్రంలోని జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూలూరుపాడు న్యూకాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం, కస్తూరీబా గాంధీ బాలికా విద్యాలయాలను జిల్లా పరిషత్ ఛైర్మన్ గడిపల్లి కవిత గురువారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఉన్నత పాఠశాలలో విద్యార్ధులతో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయుల సమయపాలన, పనితీరు వంటి విషయాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెట్టి రాంబాబును అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు మధ్యాహ్న భోజనం బియ్యం సరఫరా జరుగలేదని తెలియటంతో ఎంఈవో వెంకట్‌తో మాట్లాడారు.

Pages