S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు

మానకొండూర్, డిసెంబర్ 6: మానకొండూర్ కేంద్రంలోని కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారి అయిన చెరువు కట్ట సమిపంలో మంగళవారం తెల్లవారు జామున కొబ్బరి కాయాలతో వెల్లుతున్న లారీ ప్రమాదవశత్తు బోల్తా పడిన సంఘనటలో డ్రైవర్ తెనాలి అంనతరావు, క్లినర్‌క గాయాలు అయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎస్‌ఐ ఇంద్రసేన రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గొదావరి జిల్లా పాలకోల్లు నుండి కోబ్బరి కాయాల లోడుతో లారీలో కరీంనగర్‌కు వెల్లుతుండగా తెల్లవారుజామున మానకొండూర్ కేంద్రంలోని ప్రధాన రహదారి చెరువుకట్ట సమిపంలో ములములువద్ద ప్రమాదవశత్తు లారీ బొల్తాపడిం ది.

పోలీసులంటే నేరస్థులు భయపడాలి

తొగుట, డిసెంబర్ 6: రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం పోలీసులు ప్రజలతో మమేకమై అహర్నిషలు కృషి చేస్తున్నారని ఐజి నాగిరెడ్డి అన్నారు. మంగళవారం తొగుట సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టామన్నారు. సాధారణ ప్రజలు భయాందోళన చెందొద్దని, నేరస్తులు, నేరం చేయాలనుకునేవారు భయపడక తప్పదన్నారు. నేరస్తుల మీద చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

‘మహా’ జోరుగా మూడుముక్కలాట

నిజామాబాద్, డిసెంబర్ 6: నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ధర్మాబాద్ శివారులో పెద్దఎత్తున పేకాట జూదం కొనసాగుతోంది. ఆడిటోరియం వంటి భవనాన్ని అధునాతన హంగులతో అనధికార పేకాట క్లబ్‌గా తీర్చిదిద్దడంతో జూదరులతో కళకళలాడుతోంది. పేకాట వ్యసనానికి అలవాటుపడిన అనేక మంది జూదరులు నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి తదితర జిల్లాల నుండి అనునిత్యం తరలివెళ్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది.

మెరీనా... కన్నీటి కడలి

చెన్నై, డిసెంబర్ 6: ఓ పక్క బంగాళాఖాతం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. మరోపక్క జనసముద్రం కన్నీటి ధార ఆ బంగాళాఖాతానికి సమాంతరంగా ఆకాశమంత ఎత్తుకు ఎగిరిపడుతోంది. చెన్నై మహానగరానికి మంగళవారం యావత్ తమిళనాడు తరలివచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితను కడసారి చూసేందుకు బస్సులు, రైళ్లు, లారీలు ఏది దొరికితే అది అందిపుచ్చుకుని జనవాహిని పరుగులు పెట్టింది. ఆమె భౌతిక కాయాన్ని ఉంచిన రాజాజీ హాలుకు రైల్వేస్టేషన్, బస్సు స్టేషన్లు దూరమైనా లెక్కచేయలేదు. కిలోమీటర్ల కొద్దీ నడవటం ఎవరికీ భారం కాలేదు. రాజాజీ హాలు నుంచి మద్రాసు యూనివర్సిటీ మీదుగా మెరీనా బీచ్ వరకూ ఎక్కడ చూసినా సూది మొన మోపినంత స్థలం కూడా కనిపించలేదు.

ఎంజిఆర్ విగ్రహ శిల్పికే జయ విగ్రహం

కొత్తపేట, డిసెంబర్ 6: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వడయార్ తయారుచేస్తున్నారు. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలోని ఎమ్‌జిఆర్ రీసెర్చ్ యూనివర్సిటీలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఎంజిఆర్ విగ్రహాలను తయారుచేసి తమిళనాడులో ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక యూనివర్సిటీ తనకు ప్రత్యేక ఆర్డరు ఇచ్చినట్లు వడయార్ తెలిపారు. గతంలో తాను తయారు చేసిన ఎంజిఆర్ విగ్రహాన్ని చూసి జయలలిత అభినందించినట్టు చెప్పారు.

ప్రముఖుల సంతాపం

హైదరాబాద్, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇఎల్‌ఎన్ నరసింహన్, జయలలిత మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. జయలలిత మృతికి సంతాప సూచకంగా తెలంగాణ సచివాలయంపై అధికారులు జాతీయ జెండాను అవనతం చేశారు. అనంతరం రెండు నిముషాలపాటు వౌనం పాటించారు. జయ ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ జయ మృతికి సంతాపం తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల హృదయాలను గెలిచిన గొప్ప నేత జయలలిత అని కొనియాడారు.

‘అన్నయ్యా’ అని పిలిచేవారు

హైదరాబాద్, డిసెంబర్ 6: ‘అన్నయ్యా’ అని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనను అప్యాయంగా పిలిస్తే కడుపు, మనసు సంతోషంతో నిండిపోయేవని దర్శకరత్న దాసరి నారాయణ రావు గద్గద స్వరంతో అన్నారు. అలనాటి ప్రముఖ సినీ నటి, తమిళనాట రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేకతను నిలుపుకున్న జయలలిత అస్తమించడం పట్ల సినీ నటులు, దర్శకులు దిగ్భ్రాంతి చెందారు. తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణ రావు ఈ సందర్భంగా జయలలితతో తన కుటుంబానికి ఉన్న అప్యాయత గురించి నెమరువేసుకున్నారు.

ఇక ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్

హైదరాబాద్, డిసెంబర్ 6: నూతన విద్యా విధానం అమలులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో దేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మాదిరి ఇండియన్ ఎడ్యుకేషన్ సెంట్రల్ సర్వీసును ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్పష్టమైన విధానాన్ని రూపొందించిన ప్రభుత్వం దానిపై నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయాలను సైతం స్వీకరించి, వాటిని క్రోడీకరించిన తర్వాత తదుపరి ప్రకటన చేయాలని చూస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసు (ఐఇఎస్)గా వ్యవహరిస్తారు.

ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణం

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ ప్రాంతంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో సమైక్య రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడ్డదని, ఈ అంశంపై విచారణ జరిపించాలని సుపరిపాలన వేదిక (్ఫరం ఫర్ గుడ్ గవర్నెన్స్) డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని (లక్డీకాపూల్) సుపరిపాలనావేదిక కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వేదిక అధ్యక్షుడు జస్టిస్ రెడ్డపరెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ రావు చెలికాని, కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి మాట్లాడారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల పేరుతో ఖజానానుండి విడుదల చేసిన 14,483 కోట్ల రూపాయలు వృథా అయ్యాయన్నారు.

అంబేద్కర్‌కు మోదీ నివాళి

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఎనలేని సేవలు అందించిన అంబేద్కర్‌కు భరత జాతి ఎప్పుడూ రుణపడి ఉంటుందని మోదీ అన్నారు. ‘బాబాసాహెబ్ అంబేద్కర్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మహోన్నతమైన సేవలు అందించిన ఆయనకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది’ అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో జరిగిన కార్యక్రమంలో కూడా అంబేద్కర్‌కు మోదీ ఘనంగా నివాళులర్పించారు.

Pages