S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబేద్కర్‌కి ఘన నివాళి

హైదరాబాద్, డిసెంబర్ 6: బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ 60వ వర్థంతి కార్యక్రమం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. జలమండలి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంఘం అధ్యక్షుడు జి.లక్ష్మినారాయణ విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.శంకర్‌ప్రకాష్, ప్రధాన కార్యదర్శి డి.అశోక్, అదనపు ప్రధాన కార్యదర్శులు కె.సురేందర్, బి.సత్యనందన్, మొగులయ్య, హిరిశంకర్, బి.అశోక్, సత్యవర్ధన్, గోవర్ధన్, కె.నర్సింగ్‌రావు, జోసఫ్‌తో పాటు బోర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.

వేర్వేరు చేయాల్సిందే!

హైదరాబాద్, డిసెంబర్ 6: భాగ్యనగరాన్ని చెత్త రహిత నగరంగా, స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి చేపట్టిన చర్యలు మరింత ముమ్మరం కానున్నాయి. ఇందుకు గాను ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 12వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నగరంలోని 30 సర్కిళ్లలోని సుమారు 20లక్షల ఇళ్ల నుంచి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ఒక్కో ఇంటికి రెండు డస్ట్‌బిన్లను పంపిణీ చేయటంతో పాటు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నేరుగా డంపింగా యార్డుకు చేరేందుకు 1700 పై చిలుకు ఆటో టిప్పర్లను క్షేత్ర స్థాయిలో వినియోగిస్తోంది.

‘ఆన్‌లైనే’ ఆధారం

హైదరాబాద్, డిసెంబర్ 6: నల్లధనం, నకిలీ కరెన్సీకి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దును గ్రేటర్‌లో మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు జిహెచ్‌ఎంసి నగదు రహిత సేవలను ప్రోత్సహించనుంది. గత నెల 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత రద్దయి నోట్లతో ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సు, భవన నిర్మాణ అనుతుల ఛార్జీలను స్వీకరించిన జిహెచ్‌ఎంసికి రూ. 247 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. దీంతో మున్ముందు కూడా జిహెచ్‌ఎంసి నగదు రహిత సేవలను ప్రోత్సహించనుంది.

త్వరలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు

వనస్థలిపురం, డిసెంబర్ 6: ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోలు డివిజన్ ఆదర్శనగర్ గుడిసెలను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ ఆబ్‌నర్ మంగళవారం సందర్శించారు. గుడెసెవాసుల సమస్యలను అడిగి తెలుకున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను తెలుసుకున్నారు. సర్వెనెంబర్ 5లోని ప్రభుత్వ స్థలంలో గత కొంతకాలంగా గుడెసెలు వేసుకొని నివాసం ఉంటున్న 146 మంది పేదలకు జీఓ 58ప్రకారం అర్హులైన పేదవారు 113 మందిని గుర్తించి ఆన్‌లైన్ ద్వారా పట్టాలు మంజూరు చేసింది. మరో 27మందికి పూర్తిస్థాయిలో విచారణ జరిపి పట్టాలు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.

డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలకు స్థలాలు

వికారాబాద్, డిసెంబర్ 6: గ్రామాల్లో డంపింగ్ యార్డు, శ్మశానవాటికల నిమిత్తం స్థలాలను గుర్తించి కేటాయించాలని జిల్లా కలెక్టర్ డి.దివ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవిన్యూ, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై రెవిన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ సురేష్‌పొద్దార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తను ఎక్కడంటే అక్కడ వేస్తున్నారని దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని డంపింగ్‌యార్డులకు స్థలాలను గుర్తించి కేటాయించాలని చెప్పారు.

జిల్లా స్థాయి ప్రణాళిక తప్పనిసరి

హైదరాబాద్, డిసెంబర్ 6: ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనలను అనుసరించి ప్రతి జిల్లాలకు జిల్లా స్థాయి ప్రణాళిక తయారు చేయటం తప్పనిసరి అని, అందులోనూ సూక్ష్మ స్థాయి డేటా తప్పకుండా ఉండేలా చూసుకోవాలని చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర హైదరాబాద్ జిల్లా అధికారులకు సూచించారు. ఈ నెల 14న జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయా జిల్లాల సమగ్రాభివృద్దికే తీసుకోవల్సిన చర్యలపై కలెక్టర్లతో మంగళవారం ఆయన సచివాలయం నుంచి ఉన్నతాధికారులు అజయ్‌మిశ్రా, సోమేశ్‌కుమార్, బిఆర్ మీనాలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మున్సిపాలిటీ స్థలం కబ్జాకు దురాక్రమణదారుల దౌర్జన్యాలు

తాండూరు, డిసెంబర్ 6: తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల దురాక్రమణల పర్వం జోరుగా సాగుతుంది. స్థానిక సంబంధిత రెవెన్యూ అధికారుల అలసత్వం, అవినీతి తతంగాల పుణ్యమా అంటూ తాండూరులోని కొందరు భూ మాఫీయా మూఠాలు, మరికొందరు అధికార, విపక్ష పార్టీలకు చెందిన రాజకీయులు, వారికి తోడు మరికొందరు రాజకీయ బ్రోకర్లుగా వ్వవహారిస్తున్న దగా కోరులు పార్టీలకు అతీతంగా ఏకమై తాండూరు పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ ఖాళీ భూములను, శిఖం భూములను టార్గెట్ చేస్తూ తమ అధికార మదంతో స్థానిక అధికారులను నయానో, భయానో ఒప్పించి అన్యక్రాంతం చేసుకునేందుకు పకడ్బందీ వ్యూహారచనలు సాగిస్తున్నారు.

సంతకం ఫోర్జరీ కేసులో రాచకొండ పోలీసు కమిషనరేట్ సీనియర్ అసిస్టెంట్ అరెస్టు

ఉప్పల్, డిసెంబర్ 6: పోలీసు ఉన్నతాధికారుల ఫోర్జరీ సిగ్నచర్ కేసులో ఇద్దరు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో నివసిస్తూ రాచకొండ కమిషనరేట్‌లోని జిపిఎఫ్ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆలె అశోక్ సహకారంతో రామంతాపూర్ బాలాజీనగర్‌లో నివసిస్తున్న ఎం.వేణుగోపాల్ పోలీసు ఉన్నతాధికారుల సిగ్నచర్స్‌ను ఫోర్జరీ చేసి ప్రైవేటు సెక్యూరిటీ సర్వీస్ లైసన్స్‌ను ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందని అడిషనల్ డిసిపి క్రైం డి.జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.

మహతి క్రియేషన్స్ ‘నియతి’ నాటకం ప్రదర్శన

హైదరాబాద్, డిసెంబర్ 6: మనిషి ప్రాప్తం లేనిదాని కోసం ఆరాటపడుతూ, తాయత్తులు కట్టుకొని మూఢ నమ్మకాల ముసుగులో తేలియాడుతున్నాడని, మాయలో పడి నియతిని మర్చిపోయి నిజాన్ని వదిలేస్తున్నాడని తెలిపే నాటకం ‘నియతి’. నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని చెబుతూ అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి వుంది అనే సారాంశంతో నాటకం సాగింది. ఆరాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో చిట్టా శంకర్ రచించిన ‘నియతి’నాటకాన్ని మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రదర్శించారు. యు.సుబ్బరాయశర్మ దర్శకత్వంలో వైజాగ్ విజయలక్ష్మి, మంజునాథ్, శివరామకృష్ణ, సుబ్బారావు, చిట్టా శంకర్ తదితరులు నటించారు.

ఉద్యమంలా మరుగుదొడ్ల నిర్మాణం

వికారాబాద్, డిసెంబర్ 6: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఒక ఉద్యమంలో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.దివ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై ఎంపిడివోలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణాలను హడావిడిగా కాకుండా నాణ్యతతో నిర్మించాలని సూచించారు. ముందుగా మండల కేంద్రాల్లో మోడల్ మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. నిర్మాణాలకు సంబంధించి తక్కువ ఖర్చుతో స్థానికంగా లభ్యమయ్యే వాటితో నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు.

Pages