S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల్లోకి వెళ్లకపోతే మీకు నష్టం,పార్టీకి నష్టం

ఒంగోలు,డిసెంబర్ 6:జిల్లాలోని శాసనసభ్యులు, ఇన్‌చార్జులు ప్రజల్లోకి వెళ్ళాలని, ఆ విధంగా చేయకుండా షో చేస్తే మీకు నష్టం,పార్టీకి నష్టమని జిల్లాలోని పార్టీముఖ్యశ్రేణులకు హితబోధచేస్తూనే మరోకపక్క చురకలంటించారు. గడపగడపకు వైకాపా కార్యక్రమం జిల్లాలో ఏవిధంగా జరిగిందన్న అంశంపై వైకాపా రాష్ట్రఅధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ముఖ్యనేతలతో హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

నగదు రహిత లావాదేవీలపై అవగాహన అవసరం:కలెక్టర్

ఒంగోలు అర్బన్, డిసెంబర్ 6: దేశ భవిష్యత్తు నేటి యువతపై ఆధారపడి ఉందని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ పేర్కొన్నారు. మంగళవారం వివిధ కాలేజిలకు చెందిన విద్యార్ధులు, ఎన్‌సిసి యూనిట్లు , కళాకారులతో నగరంలోని నెల్లూరు బస్టాండు సెంటరులో నగదురహిత లావాదేవీలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ విద్యార్ధులు, యువతలో ఎవరికీ లేనంత ఎంతో వ్యత్యాసాలు ఉందన్నారు. గతనెల 8వతేదీ కేంద్రప్రభుత్వం ఐదువందలు, వెయ్యిరూపాయల కరెన్సీనోట్లను ఉపసంహరించిందన్నారు. దీంతో ఎంతో క్లిష్టమైన పరిస్ధితి వచ్చిందన్నారు.

భూముల ఆన్‌లైన్ కోసం రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు

త్రిపురాంతకం, డిసెంబర్ 6: దేశానికి వెనె్నముక అయిన రైతులను భూముల ఆన్‌లైన్ కోసం కార్యాలయాల చుట్టు తిప్పుకోవద్దని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఆదేశించారు. మంగళవారం మార్కాపురం ఆర్డీఓ కె చంద్రశేఖరరావు అధ్యక్షతన తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే జన చైతన్యయాత్రలు :పోతుల

కందుకూరు, డిసెంబర్ 6: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన చైతన్యయాత్రలను చేపట్టారని ఎమ్మెల్యే పోతుల రామారావు వెల్లడించారు. మంగళవారం మండల పరిధిలోని జి.మేకపాడు, కోవూరు తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పోతుల, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఆధ్వర్యంలో జన చైతన్యయాత్రలు జరిగాయి. తొలుత జి.మేకపాడులో జన చైతన్యయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా టిడిపిలో చేరిన 20 మందికి ఎమ్మెల్యే పోతుల రామారావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

యోధురాలు

జయలలిత అకాలమరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె జీవితం పోరాటాలమయం. మేమిద్దరం జాతీయ స్థాయి రాజకీయాల్లో పనిచేశాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా.
- చంద్రబాబు, ముఖ్యమంత్రి

ప్రజల మనిషి

జయలలిత ప్రజల మనిషి. ఆమె రాజకీయ జీవితం సాహసోపేతం. తమిళనాడువంటి రాజకీయ చైతన్యం కలిగిన సమాజంలో సిఎంగా, పార్టీ అధ్యక్షురాలిగా అత్యంత ప్రజాదరణ పొంది చరిత్ర సృష్టించారు.
-సిఎం కె చంద్రశేఖర్‌రావు

పింఛను తీసుకునే దారేది

విశాఖపట్నం, డిసెంబర్ 6: నిరుపేద వృద్ధులకు, భర్తలను పోగొట్టుకున్న వితంతువులకు, పని చేసుకోలేని దివ్యాంగులకు ప్రభుత్వం తరపున సామాజిక పింఛన్లు అందజేస్తోంది. వృద్ధాప్య, వితంతు పింఛన్లుగా రూ.1000, దివ్యా ంగులకు రూ.1,500 చొప్పున ప్రతి నెలా వారి చేతికందే మొత్తం ఇప్పుడు బ్యాంకుల్లో భద్రంగా ఉంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆర్థికావసరాలను తీర్చాల్సిన సొమ్ము బ్యాంకు ల్లో భద్రంగా ఉండటమేటని అనుమానిస్తున్నారా! నిజమే కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో సామాజిక పింఛన్ల పంపిణీ అంశంలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది.

నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించండి

విశాఖపట్నం, డిసెంబర్ 6: జిల్లాలో నగదు రహిత లావాదేవీలను ఉద్యమ స్థాయిలో ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాం కర్లు, ఆంధ్రా విశ్వవిద్యాలయం అధ్యాపకులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోట్ల రద్దు అనంతరం చిన్ననోట్ల కొరత వల్ల సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే ఇది తాత్కాలికమేనన్నారు. నోట్ల రద్దు అనంతరం జిల్లాలో ఇప్పటి వరకూ 1,019 పిఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్లు సమకూర్చినట్టు తెలిపారు.

స్వచ్ఛ విశాఖ లక్ష్యానికి అందరి సహకారం అవసరం

విశాఖపట్నం, డిసెంబర్ 6: స్వచ్ఛ విశాఖ లక్ష్యం నెరవేర్చడం కోసం ప్రజలు సహకరించాలని జీవిఎంసి కమిషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు. 35వ వార్డుకు చెందిని కైలాసపురం, శాంతినగర్, కస్తూరినగర్, మధుసూదన్‌నగర్, రాజీవ్‌నగర్, రాంజీఎస్టేట్స్, కప్పరాడల్లో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 35వ వార్డులో పారిశుద్ధ్యం పనులు సక్రమంగా నిర్వహించడంలేదన్నారు. అన్ని కూడళ్ళలో డంపర్ బిన్లు లేకుండా చెత్తను రోడ్లపై పోగులు పెడుతుండటంపట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. కాలువల పూడిక తీతలు కూడా సక్రమంగా లేవన్నారు. అన్ని దుకాణాల వద్ద డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసుకోవాలని దుకాణ యజమానులను ఆదేశించారు.

మహిళా రెజ్లర్‌లకు ఎమ్మెల్సీ మూర్తి అభినందన

జగదాంబ, డిసెంబర్ 6: ఇటీవల నెల్లూరులో ముగిసిన రాష్ట్ర స్థాయి మహిళా రెజ్లింగ్ పోటీల్లో విజయం సాధించిన విశాఖ జిల్లా మహిళా రెజ్లర్‌లను మంగళవారం స్థానిక పాత నగరంలో గల రీడింగ్ రూమ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డాక్టర్ ఎమ్‌వివిఎస్ మూర్తి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వి క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందని, క్రీడాకారుల కోసం స్టేడియంల నిర్మాణంతోపాటు అంతర్జాతీయ స్థాయి పోటీలను విశాఖలో నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. నిరంతర సాధనతోపాటు స్వయంకృషితో ఎదుగుతున్న మహిళా రెజ్లర్‌లకు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు తేగల సామర్ధ్యం ఉందని ప్రశంసించారు.

Pages