S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓడిఎఫ్‌పై టాస్క్ఫోర్స్

విశాఖపట్నం, డిసెంబర్ 6: బహిరంగ మల విసర్జన రహితం (ఓడిఎఫ్)గా తీర్చిదిద్దే క్రమంలో ఎక్కడైనా అతిక్రమణ జరిగితే కఠిన జరిమానాలకు వెనుకాడ వద్దని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జిల్ల స్థాయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన నియంత్రించేందుకు టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. టాస్క్ఫోర్స్ నిరంతరం రహదార్లను సందర్శించి బహిరంగ మల విసర్జన జరిగితే, అందుకు బాధ్యులపై భారీ జరిమానాలు విధించాలని సూచించారు.

భావ ప్రకటన నైపుణ్యాలు కలిగి ఉండాలి

జగదాంబ, డిసెంబర్ 6: విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంతో సమానంగా భావ ప్రకటన నైపుణ్యాలను కలిగి ఉండాలని ఏయూ వీసి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఏయూ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపధ్యంలో ఆంగ్లభాష నైపుణ్యాలు ఎంతో ప్రభావం చూపుతాయన్నారు. ఉపాధి కల్పనకు అవసరమైన సామర్ధ్యాలను ప్రతీ విద్యార్ధి అందిపుచ్చుకోవాలన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సివి రామన్ మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతికి వర్సిటీ విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.

పెరిగిన అప్పన్న హుండీ ఆదాయం!

సింహాచలం, డిసెంబర్ 6 : శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి హుండీ ఆదాయం పెరిగింది. నాలుగు విడతలుగా తెరిచిన హుండీల (29 రోజులు) ద్వారా సుమారు ఒక కోటి 19 లక్షల రూపాయల ఆదాయం నగదు రూపంలో వచ్చింది. గత నెలలో కేంద్రప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేస్తూ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం నేపథ్యంలో చిల్లర సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలరోజుల వ్యవదిలోనే నాలుగు పర్యాయాలు హుండీలను తెరిచి దేవస్థానం ఆదాయం లెక్కించించింది. తొలి పదిరోజుల్లో సుమారు రూ.41.61 లక్షలు, అనంతరం నాలుగు రోజులకు సుమారు రూ.19 లక్షలు, తరువాత నాలుగు రోజులకు సుమారు రూ.

అంబేద్కర్ చిరస్మరణీయుడు:కలెక్టర్

ఒంగోలు,డిసెంబర్ 6:ప్రపంచంలోనే గొప్పదైన భారతరాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ కొనియాడారు. మంగళవారం అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా నగరంలోని హెచ్‌సిఎం జూనియర్ కాలేజి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ సుజాతశర్మ, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్,జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ విలేఖర్లతో మాట్లాడుతూ దేశంలో ప్రతిపౌరుడికి గౌరవప్రదమైన జీవనం, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా నవభారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ తయారుచేశారన్నారు.

రాష్ట్ర ప్రగతిలో ఒఎన్జీసీ భాగస్వామి

భీమవరం, డిసెంబర్ 6: విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రగతిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నది కేవలం ఒఎన్జీసీ మాత్రమేనని కెజి బేసిన్ జనరల్ మేనేజర్ ఎవివిఎస్ కామరాజు (జియోలజీ,రాజమండ్రి) అన్నారు. భవిష్యత్తులో కూడా ఒఎన్జీసీ తెలుగు ప్రజల అభివృద్ధికి అండగా నిలుస్తుందన్నారు. భీమవరంలో ఒఎన్జీసీ కేజి-పిజి బేసిన్‌లో షేల్‌గ్యాస్, ఆయిల్ అనే్వషణను ఒఎన్జీసీ ప్రతిపాదించింది. వీరవాసరం మండలం అండలూరు గ్రామం, కాళ్ల మండలంలోని కోలనపల్లి గ్రామాల్లో బావుల తవ్వకానికి పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణకు సమావేశం మంగళవారం స్థానిక మున్సిపల్ ఎఎస్‌ఆర్ భవనంలో ఏర్పాటుచేసింది.

ప్రారంభమైన వేనాడు దర్గా గంధోత్సవ వేడుకలు

తడ (సూళ్లూరుపేట), డిసెంబర్ 6: తడ మండలం వేనాడు దర్గా గంధోత్సవ వేడుకలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఉరుసు నిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి దర్గా లోపల ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆసియా ఖండంలో అతిపెద్ద దర్గాగా పేరుగాంచిన షేక్ దావూద్ షావలీ అల్లా దర్గాకు ప్రత్యేక పేరు ఉంది. ఇక్కడే జరిగే గంధోత్సవ వేడుకలకు మన రాష్ట్రం నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. గ్రామం నుండి దర్గా పొలిమేర్లంతా జనసందోహంతో నిండిపోయింది.

కూపీ లాగుతున్నారు

కాకినాడ, డిసెంబర్ 6: జన్‌ధన్ ఖాతాల పూర్వాపరాల కూపీలాగే పనిలో ఆదాయ పన్ను (ఐటి) శాఖ అధికారులున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం బ్యాంకర్లవద్ద గల జన్‌ధన్ ఖాతాదారుల డేటాను సేకరించే పనిలో వారున్నట్టు తెలిసింది. దీంతో బినామీల్లో సునామీ సుడులు తిరుగుతోంది. గత నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్‌ధన్ ఖాతాల్లోకి బడా బాబుల సొమ్మొచ్చి పడినట్టు రూఢీ అయ్యింది. అందుకే ప్రధాని నరేంద్రమోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జన్‌ధన్ ఖాతాల్లో బడాబాబులు వేసిన సొమ్మంతా మీకే చెందుతుంది2 అంటూ మోదీ పేదలనుద్దేశించి అన్న మాటలు కలకలం సృష్టిస్తున్నాయి.

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

పూతలపట్టు, డిసెంబర్ 6: పలుప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పూతలపట్టు పోలీసులు పట్టుకున్నారు. వారివద్ద నుంచి 5.25 లక్షల విలువ చేసే 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ లక్ష్మీనాయుడు కథనం మేరకు తమిళనాడుకు చెందిన సత్యానంద్ (44), జవహార్ (24) మరో బాల నేరస్తుడు కలిసి తిరుపతి, తిరుచానూరు, తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను అపహరించి వాటిని తమిళనాడు రాష్ట్రం కాడ్పాడిలో విక్రయించి సొమ్ము చేసుకోనే వారని తెలిపారు.

నీళ్ల కిరికిరి!

ధర్మవరం రూరల్, డిసెంబర్ 6: పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) కుడి కాలువ నుంచి విడుదలయ్యే నీటి పంపకాల వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారి అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. పీఏబీఆర్ నుంచి విడుదలయ్యే నీటిలో ధర్మవరం ప్రాంతానికి పూర్తి అన్యాయం జరుగుతోందని, తమ ప్రాంత రైతాంగం సైతం ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తోందంటూ రాజధానిలోని పెద్దల చెంతకు నీటి పంపకాల విషయాన్ని ఎమ్మెల్యే గోనుగుంట్ల తీసుకెళ్లినట్లు సమాచారం.

కొత్త జిల్లాలకు పెద్దనోట్ల ఎఫెక్ట్

మహబూబాబాద్, డిసెంబర్ 6: తెలంగాణలో కొత్తజిల్లాల ఏర్పాటు మురిపెం పట్టుమని నెలరోజులు కుడా నిలువలేదు. కొత్తజిల్లాల ఏర్పాటు సంతోషంతో ఒకవైపు ప్రజలు సంబురాల్లో ఉండగా కేంద్రప్రభుత్వం ఒక్కసారిగా పెద్దనోట్ల బ్యాన్‌తో పెద్ద బాంబు పేల్చింది. దీంతో ఒక్కసారిగా అటు రియల్ ఎస్టేట్ రంగంతోపాటు అన్నిరంగాలపై పెద్దనోట్ల బ్యాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. భూం ఉంటేనే రిజిస్ట్రేషన్ కార్యాకలాపాలు జరిగి ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున రాబడి వచ్చేది. భూముల క్రయ విక్రయాలతో మార్కెట్ కళకళలాడేది. రియల్ ఎస్టేట్ దందాతో నెలలో కోట్లాది రూపాయలు చెతులు మారాయి.

Pages