S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తగ్గిన ఉల్లి ధర..

ఆదోని, ఆగస్టు 30: ఉల్లిధర ఒకేసారి తగ్గిపోవడంతో పంట పండించిన రైతుకు కన్నీరు ధారగా మిగిలింది. ఉల్లి ధర తగ్గడం వల్ల నష్టాలు వచ్చాయని పలు గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది రైతులకు లారీ బాడుగులు కూడా రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో కొన్ని గ్రామల్లో ఉల్లి రైతులు ఉల్లిని పొలంలో తీయకుండా అలాగే ఉంచి వేశారు. గిట్టుబాటు ధర రానప్పుడు ఎందుకు ఉల్లిని అమ్మకానికి తీసుకెళ్లాలని రైతులు పొలాల్లోకి పశువులను వదిలి పెడుతున్నారు. ఇంత భారీ స్థాయిలో ఉల్లిగడ్డ ధర తగ్గడంపై రైతుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది.

రిజిస్ట్రేషన్ కష్టాల్లో రైతులు

తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజులుగా పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ప్రక్రియను నిలిపివేసింది. పాత పాస్ పుస్తకాల స్థానంలో కొత్తగా ఈ-పాస్ పుస్తకాలను జారీచేయాలనే ఆలోచన చేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, నెలరోజులకు పైగానే ప్రభుత్వంనుంచి నూతన పాస్ పుస్తకాలను సరఫరాచేయకుండా నిలిపివేశారు. దీనితో రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు ఉంటేనే భూముల రిజిస్ట్రేషన్ చేయాలనేది ప్రభుత్వ నిబంధనగా ఉంది. కొద్ది రోజులుగా రెవెన్యూ యంత్రాంగం పట్టాదారు పాసు పుస్తకాలను జారీచేయడం లేదు.

- గుండు రమణయ్య

పోతిరెడ్డిపాడును సందర్శించిన కేంద్ర జలవనరుల శాఖ ప్రతినిధులు

జూపాడుబంగ్లా, ఆగస్టు 30: మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం కేంద్ర జలవనరుల శాఖ ప్రతినిధులు సమీర్‌చటర్జీ, సిహెచ్ ఇంతి నాగపూరి, పవన్‌బాలన్, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో నీటి వాడకం విషయంలో వివాదాలు నెలకొని వున్నాయని, రాష్ట్రాల నీటి వాడకం అంశంపై ఢిల్లీలో జూన్ 21, 22తేదీల్లో సమావేశం జరిగిందని తెలిపారు.

హంద్రీనీవా ద్వారా కెసికి నీటి విడుదల పనులు ప్రారంభం

నందికొట్కూరు, ఆగస్టు 30:కెసి కాలువ 0-120 కి.మీ రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టు వద్ద మంగళవారం పనులు ప్రారంభించింది. పాలకుల నిర్లక్ష్యంతో ప్రతి ఏటా నష్టపోతున్న రైతాంగాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల పేరుతో సర్ధిచెబుతూ వస్తున్న పాలకులు రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు హంద్రీనీవా ప్రాజెక్టుకు అమర్చిన 12 పంపుల్లో 1,12వ పంపుల ద్వారా కెసి కాలువకు నీరు విడుదల చేసేందుకు పనులు ప్రారంభించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 4.5కోట్లు మంజూరు చేసిందని, పనులు త్వరితగతిన పూర్తి చేసి కెసి రైతాంగాన్ని ఆదుకునేందుకు ఈ పనులు చేపట్టారు.

పనులు వేగవంతం చేయండి

ఖమ్మం, ఆగస్టు 30: శ్రీరాం సాగర్ రెండో దశ ప్రధాన కాల్వ, బ్రాంచ్ కెనాల్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో ఎస్‌ఆర్‌ఎస్‌పి, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌కు సంబంధించి ధ్రాన కల్వ, బ్రాంచ్ కెనాల్స్‌లను నిర్ధేశించిన అలైన్‌మెంట్ ప్రకారం పనులు చేపట్టాలన్నారు. రోడ్లు, మిషన్ కాకతీయ, ఇతరత్రా పనులు వర్షాకాలం వల్ల జరగటం లేదని, వాటికి సంబంధించిన యంత్రాలను వినియోగించుకొని కాల్వ పనులను వేగవంతం చేయాలన్నారు.

ఇరిగేషన్ కార్యాలయం ఖాళీ

చర్ల, ఆగస్టు 30: చర్ల మండల పరిధిలోని సత్యనారాయణపురంలో ఉన్న ఇరిగేషన్ కార్యాలయం ఖాళీగా దర్శనమిస్తోంది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం, పై అధికారుల అలసత్వం కారణంగా కార్యాలయం ఖాళీగా దర్శనమిస్తోంది. సమయానికి కార్యాలయానికి రావాల్సిన అధికారులు రాకపోవడం, ఇంటర్నెట్ సాకు చూపుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ చేయడం సత్యనారాయణపురం ఇరిగేషన్ కార్యాలయంలో నిత్యకృత్యంగా మారాయి. కార్యాలయానికి తమ సమస్యలు చెప్పుకుందామని వస్తున్న రైతులకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుండంతో అధికారులను దుమ్మెత్తి పోస్తూ నిరాశతో రైతులు వెనుదిరుగుతున్నారు. చర్ల మండల పరిధిలోని సత్యనారాయణపురంలో ఉన్న ఇరిగేషన్ కార్యాలయం ఉంది.

పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలి

ఖానాపురం హవేలి, ఆగస్టు 30: పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా హాస్టల్స్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్స్ చార్జీలు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు నాగరాజు, బాలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం మెస్, కాస్మోటిక్స్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు తెరిచి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ హాస్టల్స్, హైస్కూల్స్ విద్యార్థులకు యూనిఫారాలు ఇవ్వలేదని ఆరోపించారు. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న విద్యార్థులకు మెస్, కాస్మోటిక్స్ చార్జీలు పెంచకపోవటం దారుణమన్నారు.

విద్యార్థిని చితక బాదిన ఉపాధ్యాయుడు

ఏన్కూరు, ఆగస్టు 30: మండల పరిధిలోని గార్లఒడ్డు గ్రామంలోని పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ధారావత్ బాలాజి అనే విద్యార్థిని ఆ పాఠశాలలోని ప్రభాకర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థికి చదువు రావటం లేదని సోమవారం చితక బాదాడు. అనంతరం విద్యార్థి సాయంత్రం ఇంటికి వెళ్లాక విషయం తెలుసుకున్న తల్లితండ్రులు విద్యార్థి ఒంటిపై గాయలు చూసి ఆగ్రహం చెంది మంగళవారం పాఠశాల వద్దకు చేరుకొని ఉపాధ్యాయులపై గొడవకు దిగారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోవటంతో ఆగ్రహం చెందిన తల్లితండ్రులు జరిగిన విషయంపై నేరుగా ఫోన్ ద్యారా డిఇఓ కి తెలియజేయటంతో స్పందించిన డిఇఓ రాజేష్ వెంటనే మండల ఎంఇఓ జయరాజ్‌కి తెలిపారు.

జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో చేర్చాలి

జూలూరుపాడు, ఆగస్టు 30: ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఏర్పాటు కానున్న కొత్తగూడెం నూతన జిల్లాలో జూలూరుపాడు మండలాన్ని చేర్చాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా నాయకులు మంగళవారం జూలూరుపాడులో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ముందుగా పొలిటికల్ జెఎసి కన్వీనర్‌గా మాచినేనిపేటతండా సర్పంచ్ లకావతు గిరిబాబును ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్న జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో చేర్చటం వలన ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందన్నారు.

చింతకాని మండలంలోభారీవర్షం

చింతకాని, ఆగస్టు 30: చింతకాని మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం కుండపోతగా వర్షం కురియడంతో ఎండుతున్న పంటలు ఉపిరిపీల్చుకున్నాయి. గత నెల రోజులుగా వర్షం కురవకపోవడంతో ఎండుతున్న పైర్లు జీవంపోసుకున్నాయని రైతులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వరిసాగు చేసిన రైతులు ఉరటచెందారు. సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం రాత్రి వరకు మూడుధపాలుగా వర్షం కురిసింది. ముఖ్యంగా పందిళ్ళపల్లి, బొప్పారం, నామవరం, నాగులవంచ, చింతకాని, నేరడ, చిన్నమండవ, సీతంపేట, పాతర్లపాడు, వందనం, కొదుమూరు, రామకృష్ణాపురం, బస్వాపురం, లచ్చగూడెం గ్రామాలలో భారీ వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా వర్షం కురిసింది.

Pages