S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ

శ్రీకాకుళం, ఆగస్టు 30: విద్యార్థుల ఆరోగ్యపరిరక్షణకు డీవార్మింగ్ తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వవిప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు ఆల్బెండోజోన్ మాత్రలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీ వార్మింగ్ చేయడం వలన ఏనిమియా వ్యాధి నిరోధించవచ్చునన్నారు. పిల్లలు అనారోగ్యంతో బాధపడితే చదువు ముందుకు సాగదన్నారు. ఒకసంవత్సరం నుండి 16 ఏళ్ళలోపు వయస్సుగల విద్యార్థులకు డీ వార్మింగ్ మాత్రలకు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.

ఆటల ‘పండగ’

బలగ, ఆగస్టు 30: స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపికలకు రికార్డుస్థాయిలో విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి ఏటా పెరుగుకొంటూ వస్తున్నప్పటికీ ఈ ఏడాది ఎంపికల్లో సుమారు 3,500 మంది బాలబాలికలు కొద్ది క్రీడంశాల ఎంపికలకు పాల్గొని సత్తాను ప్రదర్శించారు. తొలి రోజు అండర్-14, 17 బాలురు, బాలికల ఎంపికల్లో పాల్గొనగా, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాడ్మింటన్, క్రికెట్‌కు సంబంధించి ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేశారు. అలాగే హాకీ, అర్చరీ, ఫుట్‌బాల్‌కు సంబంధించి ఫైనల్ సెలక్షన్స్ నిర్వహించారు.

మరుగుదొడ్లు లేని గ్రామాలను గుర్తించండి: కలెక్టర్

శ్రీకాకుళం, ఆగస్టు 30: జిల్లాలో అక్టోబర్ 2 నాటికి ఎంపిక చేసిన 178 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్వచ్ఛ్భారత్ మిషన్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. 38 మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని ఎండివోలను ఆదేశించారు. అదే విధంగా అక్టోబర్ 2 నాటికి గతంలో ఎంపిక చేసిన 178 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తయారు చేయాలని ఆదేశించారు.

స్వచ్ఛ్భారత్‌ను విజయవంతం చేయాలి

శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 30: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని అంబేద్కర్ వర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ సంజీవయ్య పిలుపునిచ్చారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ 1,2 యూనిట్లు మంగళవారం కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సంజీవయ్య మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్-ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల పాత్రఅనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మనస్సులు స్వచ్ఛంగా ఉండాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించుకోవచ్చునన్నారు. ఇందుకు ప్రతీ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీరు సామాజిక స్పృహతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబర్చాలి

ఎచ్చెర్ల, ఆగస్టు 30: పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు మరింత శ్రద్ధకనబరచాలని పొన్నాడ పిహెచ్‌సి వైద్యాధికారిణి సహజ సూచించారు. మంగళవారం కొయ్యాం ఉన్నత పాఠశాలలో డీ వార్మింగ్‌డేను పురస్కరించుకొని మాత్రలు పంపిణీ చేశారు. చిన్నారులు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఈ మాత్రలు ఎంతో దోహదపడయన్నారు. నులిపురుగులు నివారించేందుకు ఈ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. ప్రభుత్వంపిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాలకు పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తుందన్నారు. సీజనల్ వ్యాధులపట్ల కూడా చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.

పరారీలో నిందితుడు

శ్రీకాకుళం, ఆగస్టు 30: నగరంలో సంచలనం సృష్టించిన వ్యాపారి హత్యకేసులో నిందితుడు పరారీలో ఉన్నాడు. సోమవారం అర్ధరాత్రి ఇక్కడి పాత బస్టాండ్ దరి నూతన్ స్వీటు షాపు యజమాని గుడ్ల వెంకటరమణను ఓ వ్యక్తి కత్తితో పొడిచి పరారైన విషయం తెలిసిందే. చికిత్స కోసం వెంకటరమణను రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందగా, పోలీసులు దీనిని చాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో ఎన్నడూ లేనిది ఓ వ్యాపారి హత్య అదీ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిసరాల్లో సంభవించడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన రేకిత్తించింది.

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

ఇచ్ఛాపురం, ఆగస్టు 30: జిల్లాలో సంచలనం సృష్టించిన తల్లి, కుమారుల హత్య కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. పట్టణ ఇన్‌ఛార్జి ఎస్‌ఐ చిన్నంనాయుడు మంగళవారం విలేఖరులకు వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం పట్టణానికి చెంది బంగారం వ్యాపారి బి.కేశవరావు భార్య వెంకటగోపాలలక్ష్మి, కుమారుడు కిరణ్‌కుమార్ 2008, ఆగస్టు 28వ తేదీన వారి నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో డి.బలరాంరెడ్డి, గోపిలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి ఎస్‌ఐ మురళీకృష్ణ కేసు నమోదు చేయగా, సిఐలు జనార్దన్‌సింగ్, దేవానందసాంతోలు దర్యాప్తు జరిపారు.

ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

నరసన్నపేట, ఆగస్టు 30: సమాజంలో ప్రతీ ఒక్క విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్థేశించుకోవాలని టెక్కలి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ తిరుపతిరావు తెలిపారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుపట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని తద్వారా ఒక లక్ష్యాన్ని నిర్థేశించుకోవాల్సిన అవసరం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యావిధానంలో పెనుమార్పులు వస్తున్నాయని దానికి అనుగుణంగానే విద్యార్థుల సరళిని కూడా మార్చుకోవాలని సూచించారు.

మట్టిబొమ్మలనే వినియోగించండి

సారవకోట, ఆగస్టు 30: వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి వినాయక చవితి సందర్భంగా మట్టిబొమ్మలను మాత్రమే వినియోగించాలని మండలంలోని అవలంగి గ్రామానికి చెందిన జెబిటి కానె్వంట్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుడితి, చీడిపుడి, అవలంగి గ్రామాలలో మంగళవారం చైతన్యర్యాలీ నిర్వహించి మట్టి వినాయకుడి బొమ్మలను ప్రదర్శించారు. కొంతమందికి మట్టిబొమ్మలను వీరు అందజేసి ఆదర్శవంతంగా నిలిచారు. కానె్వంట్ కరస్పాంటెండెంట్ మోహన్‌గాంధీ, విద్యార్థులు పాల్గొన్నారు.

నంద్యాలను ముంచిన వర్షం..!

నంద్యాల, ఆగస్టు 30: నంద్యాల డివిజన్‌లో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెల్లవారేసరికి పట్టణ వీధులన్నీ పంట కాల్వలను తలపించే విధంగా వర్షం నీరు పారింది. ముఖ్యంగా మహానంది ప్రాంతంలో నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షానికి మద్దిలేరు, చామకాలువలు ఉప్పొంగి నంద్యాల పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలను జలమయం చేశాయి. మంగళవారం తెల్లవారు జామున 2గంటలకు ప్రారంభమైన భారీ వర్షం ఉదయం 8గంటల వరకు 19సెం.మీ వర్షపాతం నమోదైందంటే వర్షం ఎంత భారీగా కురిసిందో అర్థమవుతుంది.

Pages