S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లా వ్యాప్తంగా వర్షాలు..

కర్నూలు సిటీ, ఆగస్టు 30:జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి దాదాపు 48 మండలాల్లో వర్షం కురిసింది. గత నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో కళ్ల ముందే సాగు చేసిన పంటలు ఎండిపోతుంటే రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో వర్షం కురవటంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 54 మండలాలకు గానూ నంద్యాలలో 162.4 మి.మీ, గోస్పాడు 162.4, మహానంది 110.6, చాగలమర్రి 92, కొలిమిగుండ్ల 80.2, పాణ్యం 77.2, పగిడ్యాల 67.4 మి.మీ వర్షపాతం నమోదయ్యాయి. అలాగే మరో 16 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా, 15 మండలాల్లో సాధారణ వర్షపాతం, 10మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యాయి.

దేశీయ పంటలను ప్రోత్సహించాలి

హైబ్రీడ్ కూరగాయల సాగుకు రైతులిక స్వస్తిపలికి దేశవాళీ విత్తనాలనే ఎన్నుకొని సేంద్రియ ఎరువులతో కూరగాయ పంటలు పండించినట్లే రైతుకు లాభం. తినేవారికి ఆరోగ్యం చేకూరుతుంది. ఇటీవలి కాలంలో విరగకాసి మార్కెట్‌లోకి వస్తున్న బెంగుళూరు హైబ్రీడ్ టమాటా కండపుట్టి వుందే తప్ప తినడానికి కాస్తనైనా పులుపు రుచి లేదు. అవి ఉడకడం కూడా లేదు. అలాంటివి దయచేసి విత్తుకోవడం మానివేసి, మన దేశవాళీ చిన్న టమాటా సాగుని రైతులు చేసుకుంటే అటు రైతన్నలకు ఇటు వినియోగదారులకు ఇరువర్గాలవారికి అన్నింటా లాభమేకదా! అన్నది ప్రతివారు గుర్తించి గ్రహించవలసిందిగా కోరుతున్నాము. ఎప్పుడైనా దేశీయ పంటలే ఆరోగ్యకరం.

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

జూపాడుబంగ్లా : మండలంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. ఉదయం నందికొట్కూరు నుంచి పారుమంచాలకు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్‌టిసి బస్సు ఇసుక వాగు దాటుతుండగా నీటి ప్రవాహం ఉద్ధృతం కావడంతో బస్సు రోడ్డుపై నుంచి నీటిలోకి జారింది. గమణించిన ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బస్సు దిగారు. దీంతో ప్రమాదం తప్పింది.

టమోటా కిలో రూపాయి!

పత్తికొండ, ఆగస్టు 31: టమోటా పంట దిగుబడి అధికంగా కావడంతో మార్కెట్‌కు విపరీతంగా టమోటాలను రైతులు తీసుకురావడంతో కిలో రూ. 1కి పడిపోయింది. మంగళవారం హోల్ సేల్ వ్యాపారులు రైతుల నుండి 25 కిలోల టమోటా గంపను రూ. 20లకు కొనుగోలు చేయడంతో రైతులు లబోదిబో అన్నారు. మంగళవాం హోల్‌సేల్ వ్యాపారుల వద్దకు టమోటాలు లారీ సరుకు వచ్చింది. దీంతో వ్యాపారులు వేలం పాట నిర్వహించి 25కిలోల గంప రూ.20 చొప్పున రెండు గంపలు రూ. 40లతో కొనుగోలు చేశారు. ధర లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు పై మార్కెట్లలో టమోటా ధర లేనందున అధిక ధరలకు కొనుగోలు చేయలేమని స్పష్టం చేస్తున్నారు.

రెయిన్‌గన్లు చిత్తూరుకు తరలింపు

కర్నూలు, ఆగస్టు 30:వర్షాభావంతో ఎండిపోతున్న పంటలను కాపాడటానికి కర్నూలు నుంచి రెయిన్‌గన్లను చిత్తూరుకు తరలిస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లాలో పంటల పరిస్థితిపై మంగళవారం రాత్రి మంత్రి నగరంలో కలెక్టర్ విజయమోహన్, జడ్పీ చైర్మన్ ఎం.రాజశేఖర్, ఎమ్మెల్యేలు బిసి జనార్ధనరెడ్డి, ఎస్వీ మోహనరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో మంగళవారం కురిసిన వర్షంతో 40 మండలాల్లో అధిక వర్షపాతం, 7 మండలాల్లో సా ధారణ, మరో 7 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు.

నిస్వార్థ దేశభక్తుడు ‘గరిమెళ్ల’

‘మాకొద్దీ తెల్లదొరతనము దేవ, మాకొద్దీ తెల్లదొర తనము’ అం టూ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాకవి గరిమెళ్ళ సత్యనారాయణ కంచుకంఠం నుం చి వెలువడిన ఈ పాట ఆనాడు తెలుగునాడును చైతన్యవంతం చేసింది. 1920-22 మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో గరిమెళ్ళ పా ల్గొని ఈ పాటతో ప్రభజంనాన్ని సృష్టించా రు. ఈ పాట పెద్దల్ని, పిన్నల్ని, స్ర్తిలను, పురుషులను మంత్రముగ్ధుల్ని చేసింది. నాటి కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీ టోపీ పెట్టుకొని, బారులు తీరి మువ్వనె్నల జెండా ఎగురవేసుకొంటూ ఈ పాటను ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ కవాతు చేసేవారు. ఆ దృశ్యం తలచుకుంటేనే మేను జలదరిస్తుంది.

- వాండ్రంగి కొండలరావు

ఎకరా పంట కూడా ఎండకూడదు..

కర్నూలు సిటీ : జిల్లాలో పంటలు ఎండిపోకుండా రెయిన్‌గన్ల ద్వారా నీరందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా రెయిన్‌గన్ల ద్వారా నీరందించేటప్పుడు నీరు, విద్యుత్ ససమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క ఎకరాలో కూడా పంట ఎండిపోకూడదన్న సిఎం చంద్రబాబు ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి అన్ని ప్రాంతాల్లోని సమస్యలను తెలసుకుని పరిష్కరించేందుకు చర్యలు కుంటున్నామన్నారు.

టెలిమీటర్ల ఏర్పాటుతో జల వివాదాలకు చెక్

నందికొట్కూరు, ఆగస్టు 30:రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ పెట్టాలంటే ప్రాజెక్టుల వద్ద టెలిమీటర్ల ఏర్పాటే సరైన మార్గమని కృష్ణా యాజమాన్య బోర్డు పేర్కొంది. మండల పరిధిలోని మల్యాల గ్రామ సమీపంలో వున్న హంద్రీనీవా సుజల స్రవంతి మొదటి ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం కృష్ణా యాజమాన్య బోర్డు కార్యదర్శి సమీర్‌చటర్జీ, సభ్యులు పవన్‌బాలన్, చీఫ్ ఇంజినీర్ నాగ్‌పూరి, నాగార్జునసాగర్ చీఫ్ ఇంజినీర్ సునీల్, ఎస్‌ఇలు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, రామచంద్రయ్య, రవీంద్రారెడ్డి పరిశీలించారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ హంద్రీనీవా ప్రాజెక్టు వద్దకు ఏవిధంగా చేరుకుంటుందనే విషయంపై వారు చర్చించారు.

హోదాతోనే స్వర్ణాంధ్ర

కర్నూలు సిటీ, ఆగస్టు 30:వ్యవసాయానికి సాగునీరు, ప్రజలకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం ఖచ్చితంగా 854 అడుగుల వరకూ స్థిరీకరించాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం డిసిసి అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించగా కోట్లతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.

బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

కర్నూలు, ఆగస్టు 30 : జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలను సెప్టెంబర్ 30వ తేదీ లోపు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణం, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే’ అంశాలపై మంగళవారం నగరంలోని సునయన ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Pages