S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్‌సిటీపై కబ్జాదారుల పడగ!

విశాఖపట్నం, ఆగస్టు 30: ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం ఇపుడు స్మార్‌సిటీగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్మార్ట్‌సిటీలో విశాఖపట్నం ఒకటి. ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ, విశాఖ నగరాలకే ఈ అవకాశం దక్కింది. అయితే చెప్పుకునేందుకు ఇది గర్వంగానే ఉన్నా, ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి ఇపుడు భూ కబ్జాలు శాపంగా మారుతున్నాయి. స్థలాల ఆక్రమణు, ల్యాండ్ మాఫియా చేతుల్లోకి రెవెన్యూ భూములు వెళ్ళిపోతున్న సంఘటనలు, పెరిగిపోతున్న కబ్జాల గోలతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.

ముసాయదా రెడీ!

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రం ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి మంగళవారం ఇక్కడ సమావేశమయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన సమావేశంలో ఏపికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోవలం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక రైల్వే జోన్ తదితర అంశాపై దాదాపు గంటనర పాటు చర్చించారు. సమావేశానంతరం మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు.

అల్పాదాయవర్గాలకూ సొంతిల్లు

విశాఖపట్నం, ఆగస్టు 30: మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం కీలక పథకం అమలు చేయనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ టక్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులు, బిల్డర్లు, ఐటి కంపెనీల ప్రతినిధులతో మంగళవారం ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యతరగతి కోసం ప్రభుత్వం కొత్తగా సరసమైన గృహనిర్మాణ పాలసీకి రూపకల్పన చేస్తోందన్నారు. రెండు రోజుల్లో కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే ఈ పథకం అమలుకు సూచనలివ్వాల్సిందిగా ప్రతినిధులను ఆయన కోరారు. మూడు తరగతులుగా ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో నిర్మించే ఈ గృహాల కోసం ఇప్పటికే పలువురు బిల్డర్లు పోటీపడుతున్నారని తెలిపారు.

తెలుగుభాష శ్వాస కావాలి

విశాఖపట్నం, (కల్చరల్) ఆగస్టు 30: తెలుగుభాషా ప్రజలశ్వాస కావాలని పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఫణిశయన సూరి అన్నారు. తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన తెలుగు భాషాదీక్ష మంగళవారంతో రెండోరోజుకు చేరుకుంది. తెలుగుభాషా పండితులు, అభిమానులు, ఏయు తెలుగు విభాగం విద్యార్ధులు తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.

పూర్తి వివరాలతో బోర్డులు

సింహాచలం, ఆగస్టు 30 :శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో బోర్డుల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. దళారులను నమ్మి ప్రజలు మోసపోకుండా దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇప్పటికే చాలా స్థలాల్లో బోర్డులను దేవస్థానం ఏర్పాటు చేసింది.1996 రెవిన్యూశాఖ దేవస్థానానికి పట్టాలిచ్చిన 9వేల 69 ఎకరాలకు చెందిన పంచగ్రామాల్లోని భూములలో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అడివివరం, వేపగుంట, చీమలాపల్లి, వెంకటాపురం, పురుషోత్తపురం గ్రామాల్లో ఏ ఏ సర్వే నెంబర్లలో ఎంతెంత భూమి ఉంది అన్న సమాచారాన్ని కచ్చితంగా బోర్డుల్లో రాసిపెట్టారు.

కరవుపై యుద్ధం

విజయవాడ, ఆగస్టు 30: కరవుపై యుద్ధం ప్రకటించాం. రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన అసాధారణ కరవు నివారించేందుకు అధికార యంత్రాంగాన్ని, సాంకేతిక వ్యవస్థను సమాయత్తం చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. స్థానిక కమాండ్ కంట్రోల్ రూంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టి, పంటలను కాపాడేందుకు తీసుకున్న చర్యలు ఫలప్రదమయ్యాయని ఆయన చెప్పారు. ‘రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కరవు ఏర్పడింది. అయితే, కర్నూలు జిల్లాలో రాత్రి కురిసిన వర్షం అక్కడి పంటకు ఉపకరించింది. ఇది నా సంకల్పసిద్ధికి నిదర్శనం’అని చంద్రబాబు చెప్పారు.

ప్రతి విభాగంలో ఇ-క్లాస్ రూమ్

విశాఖపట్నం, ఆగస్టు 30: అన్ని విభాగాల్లోనూ ఇ-క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య జి.నాగేశ్వరరావు వెల్లడించారు. దివ్యాంగులకు అదనపు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం మంగళవారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో ఉన్నత విద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా, సాంకేతిక విద్య కమిషనర్ ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేఖరుల సమావేశంలో వీసీ వివరించారు. ప్రతి విభాగంలో ఒక ఇ-క్లాస్ రూమ్ ఉండాలన్న లక్ష్యంతో 35 క్లాస్ రూమ్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

దాడికి గురైన రౌడీషీటర్ మృతి

విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 30: రౌడీల మధ్య జరిగిన ఆధిపత్యం పోరే రౌడీషీటర్ విజయకుమార్‌ను అంతమొందించింది. ఆదివారం రాత్రి లీలామహాల్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు కలిసి పసుపులేటి విజయకుమార్‌పై ఇనపరాడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడికి గురైన విజయకుమార్ కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. తెలుగు అనిల్ హత్య కేసులో తొమ్మిదో నిందితుడుగా ఉన్న విజయకుమార్ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం సృష్టించింది. పాత కక్షల నేపధ్యంలో హత్య జరిగిందా లేక మరే కారణమైన ఉందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
* విజయకుమార్‌పై హత్య చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు?

ప్రాజెక్టుల అక్రమ నిర్మాణంతో రాష్ట్రానికి అన్యాయం

విజయనగరం, ఆగస్టు 30: కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర, కర్ణాటకలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తుంటే, అభ్యంతరం తెలపవల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి చేష్టలుడిగినట్లు వ్యవహరిస్తున్నారని, జరుగుతున్న అన్యాయంపై నోరు మెదిపే ధైర్యం లేకుండా పోయిందని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు.

రోజుకు రూ.350

న్యూఢిల్లీ, ఆగస్టు 30: జాతీయ కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన అన్ని ప్రధాన డిమాండ్లు ఆమోదిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఇందన మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. సెప్టెంబర్ 2న ప్రతిపాదించిన ఒకరోజు జాతీయ సమ్మెను విరమించాలని సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. 2014-15 ఏడాది బోనస్ ఇచ్చేందుకూ కేంద్రం అంగీకరించింది. కార్మికుల దినసరి వేతనాన్ని రూ.350గా కేంద్రం నిర్ణయించింది. అరుణ్‌జైట్లీ, బండారు దత్తాత్రేయ, పియూష్ గోయల్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

Pages