S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం

తిరుమల, జూన్ 10: తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. గురువారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో రింగ్ రోడ్డులోని హంపి మఠం అవరణలో ఓ చిరుతపులి సంచరించింది. చిరుతపులి సంచరించిన దృశ్యాలు శుక్రవారం ఉదయం రోజువారి విధుల్లో భాగంగా సిసి టివి పుటేజీని పరిశీలిస్తున్న హంపి మఠం సిబ్బంది కొనుగొన్నారు. భయాందోళనకు గురైన మఠం సిబ్బంది టిటిడి అధికారులకు ఫిర్యాదు చేయగా వారు మఠానికి చేరుకొని సిసి టీవి పుటేజిని పరిశీలించారు. అందులో మఠం సమీపంలోని అటవీప్రాంతం నుంచి మఠం ఆవరణలోకి వస్తున్న చిరుతపులి దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అక్కడే కాసేపు తచ్చాడిన చిరుత కొద్ది సేపు అనంతరం తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.

భారత్, జపాన్, అమెరికా నావికా విన్యాసాలు

న్యూఢిల్లీ, జూన్ 10: దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి కేంద్రీకరించిన భారత్, జపాన్, అమెరికా శుక్రవారం దక్షిణ చైనా సముద్ర సమీపంలో సంయుక్తంగా నావికాదళ విన్యాసాలను ప్రారంభించాయి. మన దేశం అవలంబిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి అనుగుణంగా జరుగుతున్న ఈ 20వ ఎడిషన్ విన్యాసాల్లో సాత్పుర, సహ్యాద్రి, శక్తి, కిర్చి యుద్ధనౌకలు పాల్గొంటున్నాయని, ఈ విన్యాసాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నౌకాయాన భద్రతకు తోడ్పాటును అందించడంతో పాటు అంతర్జాతీయ నావికా వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని భారత నావికాదళం పేర్కొంది.

అరెస్టయ్యారా? అదుపులో ఉన్నారా?

కాకినాడ, జూన్ 10: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అరెస్టు అయ్యారా? లేక పోలీసుల అదుపులో ఉన్నారా? అనే విషయం అర్ధం కాని అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఆయన సిఐడి కేసుల్లో అరెస్టు అయ్యారని, సిఐడి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు ముందుగా ప్రచారం జరిగింది.

నోరుజారి.. ఇరుకునపడి...

హైదరాబాద్, జూన్ 10: సమస్యలను కూడా అవకాశంగా తీసుకుని ముందుకు వెళ్లే అధినేత ఆలోచనా శక్తి రానురాను మందగిస్తోందా? సమస్యలను పరిష్కరించుకోవలసిన కాలంలో అధినాయకత్వం కొత్త సమస్యలు సృష్టించుకుంటోందా? సాక్షి చానెల్ ప్రసారాలను తామే నిలిపివేయించామన్న మంత్రుల ప్రకటనపై తెలుగుదేశం నేతల అభిప్రాయమిది.

పేదరికం పోవాలంటే కోళ్లు పెంచుకోండి!

వాషింగ్టన్, జూన్ 10: అన్ని విధాలుగా సులువైన కోళ్లను పెంచడం, వాటి ఉత్పత్తుల్ని విక్రయించడం ద్వారానే పేదరికం పోతుంది తప్ప కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌తో కాదని మైక్రోసాఫ్ట్ అధినేత. ప్రపంచ శ్రీమంతుల్లో ఒకరైన బిల్ గేట్స్ అన్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు కోళ్ల పెంపకం వల్ల ఆర్థిక సాధికారికత లభిస్తుందని, తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం ఉంటుందని చెప్పారు. రోజుకు రెండు డాలర్ల ఆదాయం కూడా లేని సబ్ సహారాలోని పేద కుటుంబాలకు లక్ష కోళ్లను పంపిణీ చేసేందుకు హీఫర్ ఇంటర్నేషనల్‌తో గేట్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

రుణాత్మకంలోకి పారిశ్రామికోత్పత్తి

న్యూఢిల్లీ, జూన్ 10: తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ ప్రదర్శనతో ప్రారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) ఈ ఏప్రిల్ నెలలో మైనస్‌లోకి పడిపోయింది. -0.8 శాతంగా నమోదైందని కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. నిరుడు ఏప్రిల్‌లో 3 శాతం వృద్ధిని కనబరిచిన ఐఐపి.. ఈసారి మాత్రం నిరాశపరిచింది. కాగా, ఈ మూడు నెలల్లో ఇది తొలి క్షీణతవగా, ఫిబ్రవరిలో దాదాపు 2 శాతం వృద్ధిని కనబరిచింది. మార్చిలో వృద్ధిరేటు బాగా పతనమైనప్పటికీ 0.3 శాతం పెరుగుదలనే కనబరిచింది. అయితే ఏప్రిల్‌లో మాత్రం మైనస్‌లోకి జారుకుంది.

పేమెంట్స్ బ్యాంక్ లోగో కోసం..

న్యూఢిల్లీ, జూన్ 10: త్వరలో ప్రారంభించబోయే పేమెంట్స్ బ్యాంక్ లోగో కోసం తపాలా శాఖ అనే్వషణాత్మక పోటీని ప్రారంభించింది. శుక్రవారం మొదలైన ఈ పోటీలో తపాలా శాఖ మెచ్చిన లోగోను అందించినవారికి 50,000 రూపాయల నగదు బహుమతి కూడా లభించనుంది.

టమోటా ధరలు పైపైకి

మదనపల్లె, జూన్ 10: చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు పరుగులు పెడుతున్నాయ. శుక్రవారం టమోటా కిలో ధర 68 రూపాయల నుంచి 73 రూపాయల వరకు పలికింది. బహిరంగ మార్కెట్‌లోనైతే కిలో ధర 80 రూపాయలకు చేరింది. మరోవైపు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, ఢిల్లీ, పుదుచ్చేరి, పాండిచ్చేరి రాష్ట్రాలకు మదనపల్లె మార్కెట్ నుంచి టమోటాలు ఎగుమతి అవుతున్నాయి. ఎక్కువగా తమిళనాడులోని కుంభకోణం మార్కెట్‌కు తరలుతోంది. నిరుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కురిసిన వర్షాలకు ప్రస్తుత వేసవికాలంలో సైతం రైతులకు లాభిస్తోంది.

కేంద్ర నిర్ణయం సరైనదే

హైదరాబాద్, జూన్ 10: దేశంలోని లక్షలాది మంది పొగాకు రైతులకు ఊరట కలిగించే విధంగా ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను కేంద్రం నిషేధిస్తూ తీసుకున్న చర్యలను అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య స్వాగతించింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మురళి బాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. విదేశీ పెట్టుబడుల విధానాల్లో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మలుచుకుని బహుళ జాతి పొగాకు కంపెనీలు దేశీయ పొగాకు రంగాన్ని దెబ్బతీస్తున్నాయని, ఈ విషయాన్ని తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా దేశంలోకి నకిలీ సిగరెట్ల ప్రవేశం వల్ల పొగాకు రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు.

దూసుకెళుతున్న భారత్

వియన్నా, జూన్ 10: అణు సరఫరాదేశాల గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వానికి ఓ వైపు మద్దతు పెరుగుతుంటే మరోవైపు ఇప్పటివరకు నారత్ ఈ గ్రూపులో చేరడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న చాలా దేశాలు సైతం తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన అణు సాంకేతిక పరిజ్ఞానం పొందడంపై ఆంక్షలు విధించే ఎన్‌ఎస్‌జిలో భారత్ చేరడానికి మార్గం సుగమం చేయడానికి భారత్‌తో పాటుగా అమెరికా సైతం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

Pages