S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొండ వాగుల్లోన..

బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్, షేరింగ్ టాలెంట్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సాయికిరణ్, ఆనంద్, కళ్యాణ్ ప్రధాన తారాగణంగా ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి రఘు రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చిందని, ఊటీ, గోవా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని తెలిపారు. లవ్ సెంటిమెంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు.

రాష్ట్రపతి వద్దకు చేరిన 'లోకల్' ఫైల్

ఢిల్లీ: 2017 జూన్ 2 లోపు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి స్థానికత వర్తించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయనున్నారు. లోకల్ ఫైల్‌ను పీఎంవో మంగళవారం క్లియర్ చేసింది. పది రోజుల్లోగా రాష్ట్రపతి లోకల్ ఫైల్‌ను ఆమోదించే అవకాశం ఉంది. స్థానికతపై గత ఏడాది అక్టోబర్ 9న కేంద్రానికి ఎపి సిఎం చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.

తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగతుండగా, మరోవైపు క్యుములోనింబస్ మేఘాల వల్ల ఎపి,తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో వర్షం కురుస్తుంది. తెలంగాణలో వడగళ్ల వాన కురుస్తుంది. నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కేరళను తాకుతాయని, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రైలును దగ్ధం చేసిన వారిని శిక్షించవద్దా?

గుంటూరు: కాపుగర్జన సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును దగ్ధం చేసినవారిని చట్ట ప్రకారం శిక్షించాలా? వద్దా?- అని ఎపి మంత్రి నారాయణ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను మంగళవారం ప్రశ్నించారు. నిందితులపై పోలీసులు చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తారని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదన్నారు. కాపులకు సిఎం చంద్రబాబు చేస్తున్న మేలును చూసి ఓర్వలేకే ముద్రగడ అరాచక శక్తులతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు.

దోషి మరణించేదాకా జీవితఖైదు..!

విజయవాడ: 2013లో ఓ బాలికపై అత్యాచారానికి సంబంధించి ఇక్కడి మహిళా సెషన్స్ కోర్టు మంగళవారం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. సునీల్ అనే నిందితుడికి మరణించేవరకూ జీవితఖైదు శిక్షను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. రెండు రోజులపాటు బాలికను నిర్బంధించి సునీల్ అత్యాచారం చేసినట్లు సాక్ష్యాధారాలు లభించడంతో న్యాయమూర్తి ఈ శిక్ష విధించారు.

జెఎసికి జనం గుర్తింపుఉంది: కోదండరామ్

ఆదిలాబాద్: తమ సంస్థకు ప్రజలే గుర్తింపు ఇచ్చారని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఆయన మంచిర్యాలలో మంగళవారం ప్రజాసంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యమ సంస్థకు ఏ నాయకుల గుర్తింపు అవసరం లేదని, తమకు ఎలాంటి పదవులు అక్కర్లేదని అన్నారు. తమకు ముందు, వెనుక ప్రజలే ఉన్నారన్నారు. తెరాస సర్కారు రెండేళ్ల పనితీరును ఆయన సమీక్షిస్తూ, జనం కోసం తాము పోరాటం వేడేది లేదని ప్రకటించారు.

కెసిఆర్ వల్లే కోదండకు గుర్తింపు: హరీష్

హైదరాబాద్: తెరాస పార్టీ వల్లే రాజకీయ జెఎసి ఆవిర్భవించిందని, ప్రొఫెసర్ కోదండరామ్‌ను జెఎసి చైర్మన్‌గా చేసింది కెసిఆర్ అని మంత్రి హరీష్‌రావు అన్నారు. విపక్షాల మాదిరి కెసిఆర్ సర్కారును కోదండరామ్ విమర్శించడం సరికాదన్నారు. కొంతమంది ఒత్తిళ్లకు లొంగి ఆయన విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన కరవు సహాయక చర్యలను ప్రధాని మోదీ సైతం ప్రశంసించారని, కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కోదండరామ్‌కు కనిపించడం లేదా? అని హరీష్ ప్రశ్నించారు.

ప్రధాని కావాలన్న తపన లేదు: నితీష్

పాట్నా: 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో ఉంటానని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి అసత్యవార్తలను నమ్మవద్దని బిహార్ సిఎం నితీష్‌కుమార్ అన్నారు. నిజానికి ప్రధాని అవ్వాలన్న కోర్కె తనకు ఏనాడూ లేదని ఆయన మంగళవారం ఇక్కడ ఓ పుస్తకావిష్కరణలో తెలిపారు. ఎంపీగా ఎన్నికైతే చాలని ఒకప్పుడు ఆశ పడ్డాడని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయానని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నందునే తాను ఈనాడు ఈ స్థాయికి చేరుకున్నానని వివరించారు.

తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని నగరంలోని వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. ఉరుములు, మెరుపులు, వడగళ్లతో విస్తారంగా వానలు కురుస్తాయి గనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో అధిక వర్షం కురిసే అవకాశం ఉంది.

సిబిఐ విచారణకు హాజరైన హరీష్ రావత్

దిల్లీ: అసమ్మతి ఎమ్మెల్యేలను ప్రభావితం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్ మంగళవారం ఇక్కడ సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గిన ఆయన సిఎంగా తిరిగి బాధ్యతలు చేపట్టాక సిబిఐ అధికారుల ముందు హాజరై వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయన ఇచ్చిన జవాబులకు సిబిఐ అధికారులు సంతృప్తి చెందలేదని సమాచారం. కాగా, సిబిఐ అధికారులకు తాను సహకరించానని, తనకు తెలిసిన సమాచారాన్నంతా ఇచ్చానని, వారు అసంతృప్తి చెందారన్న విషయంలో నిజం లేదని రావత్ మీడియాకు తెలిపారు.

Pages