S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్పనా చావ్లాకు మోదీ నివాళులు

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం దివంగత ఇండో అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లాకు ఘనంగా నివాళులర్పించారు. కల్పన చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత సంతతి మహిళ. 2003లో అంతరిక్షం నుంచి కిందకు వస్తుండగా స్పేస్‌ షటిల్‌కు ప్రమాదం జరిగి ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఆర్లింగ్టన్‌ నేషనల్‌ సెమెటెరీ వద్ద ఆమె సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అనంతరం అమరజవాన్ల స్మారక చిహ్నానికి అంజలి ఘటించారు. నివాళులర్పించిన అనంతరం స్పేస్‌ షటిల్‌ కొలంబియా మెమోరియల్‌ కార్యక్రమంలో కల్పన చావ్లా భర్త, ఆమె కుటుంబసభ్యులను కలిసి మోదీ మాట్లాడారు.

ఖతార్‌లో భారతీయ ఖైదీలకు విముక్తి

దోహా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ పర్యటన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 23 మంది భారతీయ ఖైదీలను ఖతార్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఖైదీలను విడుదల చేసినందుకు ఖతార్ నేతలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

గోప్యత పాటిస్తున్న సిఐడి అధికారులు

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి తాజాగా అరెస్టు చేసిన నిందితుల వివరాలను ఎపి సిఐడి పోలీసులు బహిర్గతం చేయడం లేదు. పదిమందిని అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నా సిఐడి అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కడప, గుంటూరు జిల్లాల్లో కూడా నిందితులను గుర్తించినట్లు సమాచారం. నేడో, రేపో మరో 20 మందిని అరెస్టు చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అరెస్టు చేసిన వారిని ఏ కోర్టులో హాజరుపరుస్తారన్న విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. విశాఖ లేదా రాజమండ్రి కోర్టులో హాజరుపరిచి తర్వాత వారిని జైలుకి తరలిస్తారని సమాచారం. ముద్రగడ ఆందోళన ప్రారంభిస్తే అరెస్టులు ఆగుతాయా? అన్న చర్చ కూడా మొదలైంది.

పోలీస్ స్టేషన్‌లో ముద్రగడ బైఠాయింపు

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి కొంతమంది నిందితులను అరెస్టు చేయడంతో తనను కూడా అరెస్టు చేయాలంటూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. ఆయన అనుచరులు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో బైఠాయించడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకున్నారు. స్థానిక పోలీసులు జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులతో సంప్రదిస్తున్నారు. తనపైనా కేసులున్నాయి గనుక తనను అరెస్టు చేయాల్సిందేనని ముద్రగడ భీష్మించుకుని కూర్చోవడంతో అమలాపురంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తుని విధ్వంసంలో మొదటి నిందితుడిని తానేనని ఆయన పోలీసులకు చెబుతున్నారు.

విద్యార్థిని కిడ్నాప్.. ఆపై అత్యాచారం

వరంగల్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ మహిళలపై అత్యాచారాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం వరంగల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. హన్మకొండ ములుగురోడ్ సమీపంలో ఉంటున్న 19 సంవత్సరాల విద్యార్థిని ఐటిఐ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన జోగు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ విద్యార్థినికి కొద్ది రోజుల క్రితం పరిచయమయ్యాడు. చనువుగా ఉంటూ ఆ విద్యార్థినిని నమ్మించి అప్పుడప్పుడు బైక్‌పై తీసుకెళ్లే స్థాయికి వెళ్లాడు.

మెరుగైన వైద్యం.. ప్రభుత్వ లక్ష్యం

మహబూబాబాద్, జూన్ 6: ప్రజలకు మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యమని.. పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఖర్చులేకుండా అందించడమే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖామంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. మానుకోటలోని ఏరియా ఆస్పత్రిలో సోమవారం నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరియా ఆస్పత్రిలోని వివిధ వార్డులను తిరుగుతూ రోగులను పలకరించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా రూ. 10 లక్షల విలువైన సి-ఎపిఎంను, రూ. 10 లక్షలతో ఏర్పాటుచేసిన డిజిటల్ ఎక్స్‌రే సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.

బడి బాట విజయవంతం చేయాలి

నిజామాబాద్, జూన్ 6: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, బడి ఈడు బాలలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు వీలుగా చేపట్టిన బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంఇఓలు, తహశీల్దార్లతో బడి బాట కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ, సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రతి నివాస ప్రాంతంలోనూ ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి సర్వేలు నిర్వహించాలన్నారు.

వికలాంగులకు రుణాలు మంజూరు చేయాలి

నల్లగొండ టౌన్, జూన్ 6: జిల్లాలోని వికలాంగులకు 2015-16సంవత్సరానికి సంబందించిన రుణాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతల సైదులు సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు వారి అంగీకార పత్రంతో, మండల అభివృద్ధి అధికారి సమ్మతితో సుమారు 65మందికి పైగా వికలాంగులు రుణాల సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి ఇంత వరకు మంజూరు కాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

బడిబాట షురూ

సంగారెడ్డి టౌన్, జూన్ 6: బడి ఈడు పిల్లలందరు బడిలోనే ఉండాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ పిలుపునిచ్చారు. బడిబయట ఉన్న పిల్లలందరూ బడిలో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని సోమవారం చేపట్టింది. ఇందులో భాగంగా కలెక్టర్ సోమవారం సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామ పాఠశాల నుండి బడిబాట కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి గ్రామంలో విస్తృతంగా పర్యటించి పిల్లలందరిని మడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. పేద, అనాథ పిల్లలందిరినీ వసతి గృహాల్లో చేర్పించి నాణ్యమైన విద్యనందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.

ఎంసెట్ కౌనె్సలింగ్‌లో గందరగోళం

విశాఖపట్నం/విజయవాడ, జూన్ 6: వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లోకి ప్రవేశాలకు సంబంధించి సోమవారం ప్రారంభమైన ఎంసెట్-2016 కౌనె్సలింగ్ ప్రక్రియలో విజయవాడ, విశాఖపట్నం పట్టణా ల్లో తొలిరోజు గందరగోళ పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది.

Pages