S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలి

ఆర్మూర్, జూన్ 7: సాదాబైనామాలను క్రమబద్ధీకరించుకోవడం కోసం ఎవరికి కూడా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన సాదాబైనామాలపై పేరు మార్పిడి కోసం ఈ నెల 15వ తేది వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని యాల్ల రాములు మెమోరియల్ హాలులో మంగళవారం రెవిన్యూ డివిజన్ పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, విఆర్‌ఓలతో సాదాబైనామాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.

పనుల్లో నాణ్యత లోపిస్తే లైసెన్స్‌లు రద్దు

కోటగిరి, జూన్ 7: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తూ పనులు చేపడితే, అలాంటి కాంట్రాక్టర్ల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. కోటగిరి మండలం హెగ్డోలి, కొల్లూర్ గ్రామ చెరువుల్లో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులను మంగళవారం మంత్రి పోచారం సందర్శించి పరిశీలించారు. కొల్లూర్‌లో మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడంతో సంబంధిత శాఖ డిఇపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోదండరాం విమర్శలు అర్ధరహితం

కంఠేశ్వర్, జూన్ 7: ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు చేయడం అర్ధరహితమని, అసలు ఆయన ఆరోపణల వెనుక ఎవరున్నారో తెలుపాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పోరాటాన్ని ముందుకు నడిపించేందుకు ప్రొఫెసర్ కోదండరాం పేరును ప్రతిపాదించడం జరిగిందని, దాంతో ఆయన పొలిటికల్ జెఎసి చైర్మన్ అయ్యారని ఆయన గుర్తు చేశారు.

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

డిచ్‌పల్లి, జూన్ 7: దర్పల్లి మండలంలోని బిబితండా, చల్లగర్గె, మైలారం గ్రామాల్లో రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మిషన్ కాకతీయ, సిసిరోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గ్రామాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బాజిరెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.

స్పెషల్ బ్రాంచ్‌లో మొదలైన కదలిక!

బోధన్, జూన్ 7:పోలీసు శాఖలో నిఘా నేత్రాలుగా విధులు నిర్వహించే స్పెషల్ బ్రాంచ్ విభాగంలో కదలిక మొదలయ్యింది. ఇన్నాళ్లు స్తబ్దంగా ఉన్నటువంటి ఎస్‌బి అధికారులు తమ ప్రత్యేకతను చాటుకోవడంలో నిమగ్నమయ్యారు. పాసుపోర్టు దరఖాస్తుల ఎంక్వయిరీలకే పరిమితమైన సర్కిల్ స్థాయి అధికారులు నేడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, పోలీసు శాఖలో ఠాణాల వారీగా నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి సారిగా ఇద్దరు ఎస్సైల వ్యవహారాలపై ఎస్‌బి వర్గాలు ఎంక్వయిరీలు చేసి వాస్తవాలతో నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు అందచేసినట్లు తెలిసింది.

2017 డిసెంబర్‌కు ఇంటింటికి తాగునీరు అందిస్తాం

ఆర్మూర్, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని గ్రామాలకు 2017 సంవత్సరం డిసెంబర్ వరకు ఇంటింటికి తాగునీరు అందిస్తామని మిషన్ భగీరథ ఎస్‌ఇ ప్రసాద్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్మూర్ మిషన్ భగీరథ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ పథకాన్ని సకాలంలో పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతోందని అన్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు 4600 కోట్లు, నిజామాబాద్ జిల్లాకు 2700 కోట్లు కేటాయించిందని చెప్పారు.

పజిల్ 578

అడ్డం

ఆధారాలు
1.ఇచ్ఛ, ఇష్టం, సమ్మతి (5)
5.‘నాకా? కరకర ఆకలేస్తోంది’. ఇందులో ఉన్న కూర వడ్డించు చాలు (3)
6.‘... వస్తు వాహనాల’ని వాడుక (5)
8.ప్రణాళిక (3)
10.అర్జునుడి రథటెక్కెంపై ఉండే కారు (3)
13.పోనేపోను! పోపో అనకండి (2)
14.బిళహరి రాగంలో అలలా వినిపించేది (3)
15.విప్రవర! తమ గోత్రనామాదులు (3)
16.స్వర్గం (2)
17.అందెలు (3)
19.పెళ్లంటే సూత్రధారణ, తలంబ్రాలు వగైరా ‘....’ తప్పనిసరి (3)
21.స్వపుత్రుడు (5)
23.టాంటాం (3)
24.కొలువు చేసి ఉపకార వేతనం పొందేవాడు (5)

నిశాపతి

అనుమతి (స్ఫూర్తి)

పేపర్లోంచి తలెత్తి చూసిన తండ్రి చేతిలో నూనె పేకెట్లతో వచ్చిన కూతురు ఆమోద వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.
‘ఇవెక్కడివి? వీటిని కొనడానికి నీకు డబ్బెక్కడిది?’
‘కొనలేదు నాన్నా. ఇవన్నీ ఫ్రీగా వచ్చాయి’ ఆమోద సంతోషంగా చెప్పింది.
‘ఫ్రీగానా? ఎవరు ఇచ్చారు?’
‘చౌరస్తాలో ఓ వేన్ తిరగబడింది. అందులోంచి అట్టపెట్టెలన్నీ బయటకి పడిపోయి, వాటిలోంచి ఈ నూనె పేకెట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. రోడ్డు మీదంతా నూనె పేకెట్లే’
‘అరె! డ్రైవర్‌కి ఏమైనా అయిందా?’
‘కాలేదు. అంతా వీటిని ఏరుకుని తీసుకెళ్తూంటే మన కోసం నేను వీటిని తెచ్చాను’ ఆమోద గర్వంగా చెప్పింది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

జీరో (0) --శాస్ర్తియ ఆవిష్కరణలు

సున్నాను క్రీ.పూ.300 సంవత్సరంలో ప్రథమంగా బాబిలోనియాలో ఒక వాలుగా ఉన్న డబుల్ వెడ్జ్ చిహ్నంతో ఉపయోగించినట్లు తెలుస్తోంది. మాయన్‌లు ఒక శిల్పంగా చెక్కిన సంకేత చిహ్నాన్ని ఉపయోగించారు. కాని రెండు సందర్భాలలోనూ జీరో అన్నది ఒక చిహ్నంగానే కనిపించింది. ఒక దృఢమైన పరిమాణం అంటూ లేకుండానే వున్న ఒక చిత్రరూపంలో వున్న ఆకారం ఇది.

-బి.మాన్‌సింగ్ నాయక్

బాలీవుడ్ ఫస్ట్ లేడీ

సినీ రంగంలోకి గౌరవప్రద కుటుంబం వారు రావటానికి సంకోచించే సమయంలో ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చిన దేవికారాం సినీ రంగానికి ఫస్ట్ లేడీగా గౌరవం పొందింది. విశ్వకవి రవీంద్రుడి వంశానికి చెందిన, ఆయనకు మనుమరాలి వరుస అయ్యే దేవికారాణి 1933లో ద్విభాషా చిత్రమైన ‘కర్మ’లో ప్రధాన పాత్ర పోషించింది. బొంబాయి టాకీస్‌ని స్థాపించిన రాయ్‌ని వివాహం చేసుకుని పలు హిట్ చిత్రాల హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

-పి.వి.రమణకుమార్

Pages