S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనం కోసం పోరు ఆగదు: కోదండరామ్

ఆదిలాబాద్: ఎవరేమి అనుకున్నా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాడితీరతామని రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మంగళవారం స్పష్టం చేశారు. తనపై తెరాస నేతలు, రాష్ట్ర మంత్రులు చేస్తున్న విమర్శలపై ప్రస్తుతానికి స్పందించలేనని, బుధవారం జెఎసి స్టీరింగ్ కమిటీలో చర్చించాకే ఆ విషయాలు మాట్లాడతానని అన్నారు. జెఎసి సమావేశంలో ప్రాధాన్యతల మేరకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు.

సాక్ష్యాలున్నందునే తుని ఘటనలో అరెస్టులు: సిఐడి

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో నిందితులకు సంబంధించి తమ వద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయని సిఐడి పోలీసులు మంగళవారం మీడియాకు వివరించారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధమైనపుడు వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నామని వారు తెలిపారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన దూడల మణీంద్ర అమలాపురంలో రౌడీషీటర్ అని సీఐడీ తేల్చింది. 2015లో అమలాపురంలో హత్యాయత్నం కేసులో నిందితుడని స్పష్టం చేసింది. 2012లో జరిగిన హత్య కేసులో, 2009లో అధికారులపై దాడి కేసులో దొరబాబు నిందితుడని వెల్లడించింది.

కెసిఆర్‌ను దిగిపొమ్మనడానికి ఆయనెవరు?: నాయిని

హైదరాబాద్: తెలంగాణను పరిపాలించాలని తెరాస పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టగా, సిఎం పదవి నుంచి కెసిఆర్ తప్పుకోవాలని అడగడానికి కోదండరామ్ ఎవరని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం ప్రశ్నించారు. కోదండరామ్ వెనుక కొంత మంది బాసులున్నారని, తమకు మాత్రం ప్రజలే బాసులని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు మద్దతుగా కోదండ పనిచేశారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కొన్ని శక్తులు కోదండరామ్‌ను ఆడిస్తున్నాయని నాయిని ఆరోపించారు.

రాజకీయ కక్షతో అరెస్టులు అన్యాయం

కాకినాడ: రాజకీయ కక్షలతో విపక్షపార్టీల కార్యకర్తలను తుని విధ్వంసకాండలో నిందితులుగా పేర్కొంటూ అరెస్టులు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంగళవారం ఆరోపించారు. ఈ రోజు సిఐడి పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురిలో ఇద్దరు అమాయకులున్నారని ఆయన అన్నారు. తుని వద్ద విధ్వంసం జరిగినపుడు ఆ ఇద్దరు ఆ ప్రాంతంలోనే లేరని తెలిపారు. వీరికి విధ్వంసంతో సంబంధం ఉందని నిరూపిస్తే తాను రాజకీయాలకు స్వస్తి చెబుతానని ఆయన సవాల్ చేశారు.

తెలంగాణ ద్రోహులకు అందలం!

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంతో మమేకమైనవారికి బదులు తెలంగాణ ద్రోహులకు సిఎం కెసిఆర్ పదవులు కట్టబెడుతున్నారని ఉద్యమవేదిక నేతలు చెరుకు సుధాకర్, ఎన్నం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆరోపించారు. తన ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందోనన్న భయంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని వారికి కెసిఆర్ అందలం ఎక్కిస్తున్నారని వారు అన్నారు. కెసిఆర్ రెండేళ్ల పాలనలో పాలనావ్యవస్థ అంతా భ్రష్టుపట్టిపోయిందని, అవినీతి, అరాచకశక్తులే రాజ్యమేలుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం తాము కృషి చేస్తామని వారు ప్రకటించారు.

విశాఖ తీరంలో ముందుకొచ్చిన సముద్రం..!

విశాఖ: ఇక్కడి రామకృష్ణా బీచ్ వద్ద మంగళవారం ఉదయం సముద్రం ముందుకు వచ్చింది. తీరంలోని సబ్ మెరైన్ మ్యూజియంను అలలు తాకుతున్నాయి. వైఎంసిఎ వైపు సుమారు 50 అడుగుల మేరకు సముద్రం ముందుకు చొచ్చుకుని రావడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ఇటీవలి కాలంలో సముద్రం ముందుకు రావడం, బీచ్ కోతకు గురికావడంతో శాస్తవ్రేత్తలు కొంతకాలంగా అధ్యయనం చేస్తున్నారు.

కళానికేతన్ ఎండికి 2 వారాల రిమాండ్

అనంతపురం: చేనేత కార్మికులకు భారీగా బకాయిలు పడిన కేసులో కళానికేతన్ వస్తద్రుకాణం ఎండి లక్ష్మీశారదకు ధర్మవరం కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఆమెను మంగళవారం ధర్మవరం కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. తమ వద్ద పట్టుచీరలు తీసుకుని 9 కోట్ల రూపాయలు బకాయి పడడంతో లక్ష్మీశారదపై స్థానిక చేనేత వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తుని విధ్వంసంలో మరో ఏడుగురు అరెస్టు

కాకినాడ: కాపుగర్జన సందర్భంగా ఇటీవల తునిలో జరిగిన విధ్వంసకాండకు సంబంధించి సిఐడి పోలీసులు మంగళవారం నాడు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. సిసి టీవీ ఫుటేజి, వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా, తనను అరెస్టు చేయాలంటూ అమలాపురం పోలీస్ స్టేషన్‌లో హంగామా సృష్టిస్తున్న కాపు ఉద్యమనేతతో చర్చలు జరపాలంటూ తూ.గో. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎస్పీ అమలాపురం చేరుకుని ముద్రగడతో మాట్లాడతారు. కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా సిఐడి పోలీసులను సంప్రదించాలని ముద్రగడకు ఎస్పీ చెబుతారని సమాచారం.

ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లలో మార్పు లేదు...

ముంబయి: ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని ఆ సంస్థ గవర్నర్ రఘురాం రాజన్ మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష వివరాలను ఆయన వెల్లడించారు. రెపోరేటు 6.5శాతం, రివర్స్‌ రెపో రేటు 6.5శాతం యథాతథంగా ఉంచారు. సీఆర్‌ఆర్‌ 4శాతంలో కూడా ఎలాంటి మార్పులేదు.

తెలంగాణ నేతల అనవసర రాద్ధాంతం: దేవినేని

విజయవాడ: నదీ జలాల వాటాలో అన్యాయం జరిగిందంటూ తెలంగాణ నేతలు దేశ రాజధానిలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. బచావత్ అవార్డు ప్రకారమే ఎపి, తెలంగాణలకు నీటిని కేటాయిస్తున్నారన్నారు. విభజన చట్టానికి నాడు అంగీకరించిన టి.నేతలు ఇపుడు కృష్ణా రివర్ బోర్డు నిర్ణయాలను అంగీకరించమంటూ ప్రకటనలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగా 512 టీఎంసీలు రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయని వివరించారు. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కృష్ణా బోర్డు ఆదేశాలను మంచినీటి విడుదలకు అమలు చేశారా?

Pages