S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్యులర్ జైలు

అండమాన్ దీవులలో ఖైదీల కోసం బ్రిటీష్ వారు సెల్యులర్ జైలును ఒక దానిని నిర్మించారు. 1896లో ప్రారంభమైన ఈ నిర్మాణం ఆ తర్వాత పదేళ్లకు గానీ పూర్తవలేదు. మొత్తం 698 చిన్న అరల్లాంటి గదులుండేవి. ప్రతి నేరస్తుడిని ఒక్కో గదిలో ఉంచేవారు. ఎంతటి నేరస్థుడైనా ఆ గుహలాంటి సెల్యులర్ జైలులో ఒంటరిగా శిక్ష అనుభవిస్తూ మగ్గిపోవలసిందే. శిక్షలు చాలా కఠినంగా ఉండేవి.

-పి.వి.రమణకుమార్

నాలుక పంజా

సుప్రమాంటీ గుహల్లోని ఊసరవెల్లికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అది తన నాలుకను పులిపంజాలా విసరగలదు. రెండున్నర అంగుళాలుండే ఈ ఊసరవెల్లి నాలుక దూరంలో ఉన్న అనేక కీటకాలను నిశ్శబ్దంగా పట్టేసి, నోట్లోకి సరఫరా చేస్తుంది. ఈ ఊసరవెల్లి నాలుక బారిన పడిన ఎటువంటి కీటకమైనా నాలుకపై ఉండే జిగురు వంటి పదార్థానికి అంటుకుపోయి స్తంభించి పోవడమే తప్ప బైటపడి తప్పించుకోలేదు.

-పి.వి.రమణకుమార్

అలుపెరుగని యోధుడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అప్పుడే రెండేళ్లు! రాజధాని సైతం లేని రాష్ట్రం... నిధులు విదల్చని కేంద్రం...ఆర్థిక లోటు...గాడిన పడని పాలనా యంత్రాంగం ... ఇదీ నేటి అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. బాలారిష్టాలనుంచి గట్టెక్కని రాష్ట్ర రథాన్ని అనుభవజ్ఞుడైన రౌతు చంద్రబాబు ఒడుపుగా నడిపిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతిపథం ఎక్కించేందుకు ఏటికి ఎదురీదుతున్నారు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా అభివృద్ధికి ‘మహాసంకల్పం’ చెప్పుకుంటున్న తరుణంలో ఇది ఆంధ్రభూమి అందిస్తున్న ప్రత్యేక వ్యాసావళి.

- మార్తి సుబ్రహ్మణ్యం

ఎదురీత

తెలుగు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టడం.. విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోపోవడం.. ఇవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వేధిస్తున్న అంశాలు. ఆ ఆవేదనే ఆయనలో కసి పెంచింది. అన్యాయంగా మిగిలిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశం యావత్తు నివ్వెరపోయేలా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఓపక్క ఆర్థిక ఇబ్బందులు, మరోపక్క పాలనాపరమైన సమస్యలు, ఇంకోపక్క రాజకీయ వైషమ్యాలు చంద్రబాబును వేధిస్తున్నా, దృఢ సంకల్పంతో ఏటికి ఎదురీదుతూ రాష్ట్భ్రావృద్ధి కోసం అహరహం ఆయన శ్రమిస్తున్నారు.

- కె.వి.జి. శ్రీనివాస్

మాటల మాటున...

అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. రాష్ట్రం ఇంకా గాడిలో పడలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ‘మీరు ఏం చేశారని’ ప్రజలు నిలదీయవచ్చు. వారు ప్రశ్నించకముందే జవాబు చెప్పేస్తే పోలా...అదీ అర్థవంతంగా, మార్కులు కొట్టేసేలా, మరోమాట లేకుండా...ఇదీ ఏపీ ముఖ్యమంత్రి ఎత్తుగడ. అందుకే ఆయన కష్టాల పల్లవి అందుకున్నారనిపిస్తోంది. కష్టాల రాజ్యభారాన్ని మోస్తూ చాకచక్యంగా పరిపాలన నిర్వహిస్తూ, వచ్చే దశాబ్దాల్లోకూడా అధికారంలో కొనసాగేందుకు ఏం చేయాలో అవన్నీ ఆయన పక్కాగా చేస్తున్నారని ఈ రెండేళ్లలో ఆయన వేసిన అడుగులు చెబుతున్నాయి. వ్యూహం అంతా ఆయన మాటల్లో అంతర్లీనంగా కన్పిస్తూంటుంది.

- బి.వి. ప్రసాద్

mataata

నేర్చుకుందాం

తే. ఉత్తమాశ్రమ ని ష్ఠితుఁ దూర్థ్వ రేతుఁ
డైన కణ్వ మహాముని యనఘ చరితుఁ
డట్టిముని కెట్లుఁ గూతుర వైతి? దీని
నెఱుఁగంగఁ జెప్పుము నలిన నేత్ర

యమహాపురి 62

తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు- ప్రభాకరం పిల్లలు ఆ వాతావరణంలోనే పెరిగి పెద్దవుతున్నారు. కానీ ప్రభాకరం భయపడ్డడట్లు- ఆ వాతావరణం వారి సంస్కారంపై ప్రభావం చూపలేదు. వాళ్లు అప్పుల ఊబిలోంచి బయటపడ్డానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో - వ్యాఘ్రేశ్వరుడి కబురొకటి తెలిసింది.
అతగాడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పడి ఆరేళ్ల క్రితం అమెరికా చేరాడు. అప్పటికి తల్లిదండ్రులు పోయారు. తలిదండ్రుల జీవితం చూసిన విరక్తి భావంతోనో ఏమో- అతడు పెళ్లి చేసుకోలేదు. హాబీగా మొదలెట్టిన షేర్ల వ్యాపారం అతడి దశ మార్చేసింది. కోట్లకు పడగెత్తాడు.

వసుంధర

హరివంశం 153

భళాలే! నీ అంతటి అద్భుత శక్తి సంపన్న ఈ విశాల ప్రపంచంలో ఇంకెవరున్నారు తల్లీ! వింతలలో వింత అంటే నీవే కదా! అన్నాను ఆమెతో. అపుడు గంగాదేవి ‘నన్ను తేరిపార చూసి’ తండ్రీ! నేనెంత? నా శక్తి సామర్థ్యాలేపాటివి? నా గొప్ప ఏమి గొప్ప! నా వంటి అసంఖ్యాక, సంఖ్యాతీత ప్రవాహాలు ఎన్ని వచ్చినా కాదనక చోటిస్తాడు కదా సాగరుడు! అయినా ఉద్ధతుడు కాడే! ఆయన మహాత్మ్యం, ఇటువంటిది అని ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడూ పరమ హర్షంతో నింగిదాకా నవ్వు కెరటాలను వ్యాపింపచేస్తాడు. ఆయన తత్త్వం ఏమిటో ఎవరూ నిరూపించలేరు కదా! ఆశ్చర్యాలలో పరమాశ్చర్యం అంటే ఆ మహానుభావుడికే అది యోగ్యమవుతుంది అన్నది. ఇదేదో తప్పక తెలుసుకోవాలని నేను సముద్రుణ్ణి అడిగాను.

Pages