S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరాధన

ప్రేమనేభక్తి అంటారు. అపారమైన కృపారాశి యైన భగవంతునిపై నిశ్చలమైన ప్రేమనే భక్తి అంటారు. త్రికాలవేత్త, ఎల్లవేళలా భగవంతుని నామాన్ని విడవక భజించేవాడు అయన నారదుడే భక్తి సూత్రాలను ప్రవచిస్తూ ప్రేమనే భక్తి అని అన్నారు. భగవంతునిపై కలిగిన ప్రేమను వ్యక్తపరచడానికి పలు మార్గాలున్నా వాటిల్లో ప్రముఖమైనవి తొమ్మిది విధాలు.. వాటినే నవవిధ భక్తిమార్గాలన్నారు. ప్రతినిముషమూ భగవంతుని గూర్చిన వివరణాత్మకమైన కథలను వింటూ ఉంటే భగవంతుణ్ణి కీర్తించే కీర్తనలు విన్నా దానే్న శ్రవణము అన్నారు.

- సాయకృష్ణ

భవిష్యత్‌కు రైట్..రైట్ చెప్పారు!

సుమంత్ అశ్విన్
‘పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకునే కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో కండక్టర్ అవుతాడు. ఆ తరువాత ఏం జరిగిందనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రం ఇది’ అని అంటున్నాడు యువ హీరో సుమంత్ అశ్విన్. ‘తూనీగ తూనీగ’ సినిమాతో హీరోగా పరిచయమైన సుమంత్ అశ్విన్, ఆ తరువాత విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘రైట్ రైట్’. బాహుబలి ప్రభాకర్ మరో ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం ఈనెల 10న విడుదలవుతున్న సందర్భంగా సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు..
కెమిస్ట్రీ కుదిరింది

-శ్రీ

ఐదు భాషల్లో క్యాంపస్ అంపశయ్య

శ్యామ్‌కుమార్, పావని, వౌనిక ప్రధాన పాత్రల్లో ప్రభాకర్ జైని దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మిస్తున్న చిత్రం ‘క్యాంపస్ అంపశయ్య’. హిందీలో కూడా డబ్‌చేసి విడుదల చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన హిందీ పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కె.వి.రమణాచారి మాట్లాడుతూ, ప్రభాకర్ తన శిష్యుడని, కళలు, సాహిత్యాల పట్ల మక్కువ చూపించేవాడని, లక్ష్యం వుంటే ఏదైనా సాధించొచ్చు అనే దానికి అంపశయ్య నవలే నిదర్శనమని అన్నారు. ఆ నవల ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచిందని, 45 ఏళ్ళు దాటుతున్నా ఆ ప్రభావం తగ్గలేదని, అలాంటి కానె్సప్ట్‌ని తెరకెక్కిస్తున్న ప్రభాకర్‌ను అభినందిస్తున్నానన్నారు.

త్రివిక్రమ్‌తో కొత్త చిత్రం

టాలెంటెడ్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఇటీవలే రూపొందించిన ‘అ ఆ’ సినిమా మంచి హిట్ టాక్‌తో రన్ అవుతోంది. చక్కటి కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. ‘అ ఆ’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘త్రివిక్రమ్ రూపొందించిన అ ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నైజాంలో మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. విడుదల చేసిన ఐదురోజుల్లోనే 12 కోట్ల గ్రాస్ కలక్షన్స్ సాధించింది. నితిన్ కెరీర్‌కు ఇదొక టర్నింగ్ పాయింట్.

10న తుహిరే మేరీ జాన్

వికాశ్, కల్యాణి, రేష్మా ప్రధాన తారాగణంగా దుర్గాదేవి ఫిలిం మేకర్స్ పతాకంపై ఎస్.డి.ఉదయ్‌కుమార్ దర్శకత్వంలో కవనరెడ్డి నాగేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 10న విడుదలకు సిద్ధంచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ, లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా స్క్రీన్‌ప్లే ఆధారంగా నడిచే ఈ చిత్రంలో కాలేజీ చదువులు పూర్తిచేసిన అబ్బాయి తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా అనే కథాంశంతో వుంటుందని తెలిపారు.

సంఘవి మళ్లీ వస్తోంది!

అప్పట్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘తాజ్‌మహల్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన సంఘవి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించి గ్లామర్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న సంఘవికి సింధూరం సినిమా చక్కటి గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా నటించిన గ్లామర్ భామ సంఘవి ఈమధ్యే పెళ్లిచేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది సంఘవి. ఇప్పటికే రెండు తమిళ చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పిందట. తన వయసుకు తగ్గ పాత్రల్ని చేయాలనే ఆలోచనలో ఉందట.

శ్రీశ్రీకి మంచి స్పందన

ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్‌బిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన శ్రీశ్రీ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో హీరో కృష్ణ మాట్లాడుతూ, ఇప్పటివరకు తెలుగు సినిమా ఆడని దేశాల్లో కూడా శ్రీశ్రీ చిత్రాన్ని విడుదల చేయడం, అక్క డ కూడా మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా వుందని, సినిమాకు చాలా మంచి ఆదరణ లభిస్తోందని, ముఖ్యంగా డైలాగ్స్‌కి క్లాప్స్ కొడుతున్నారని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చిన చిత్రమిదని అన్నారు.

11న రోజులు మారాయి పాటలు

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించగా మారుతి టాకీస్ బ్యానర్‌పై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రోజులు మారాయి’. చేతన్, పార్వతీశన్, కృతిక, తేజశ్వి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జి.శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈనెల 11న పాటలు విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ, మంచి కథా కథనంతో తెరకెక్కుతున్న చిత్రమిదని, దిల్‌రాజు లాంటి నిర్మాత ఈ సినిమాకు సమర్పకుడిగా ఉండడం ఆనందం ఉందని, మారుతి కథలు యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయని అన్నారు. ఈ సినిమా యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా నచ్చేలా ఉంటుందని అన్నారు.

గ్యారేజ్‌లో విదీష

అల్లరి నరేష్ సరసన అత్తిలి సత్తిబాబు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విదీషకు ఆ తర్వాత చేసిన సినిమాలు కెరీర్‌కు ఉపయోగపడలేదు. దాంతో తమిళంలో కూడా ప్రయత్నాలు సాగించిన ఈమె ఇటీవలే శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలో నటించింది. తాజాగా విదీష ఎన్.టి.ఆర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఎన్‌టిఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ చిత్రం ఇటీవల చెన్నయ్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ని మొదలుపెట్టనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం విదీషను అడిగారట. కీలక పాత్ర కావడంతో చేయడానికి ఓకే చెప్పిందని తెలిసింది.

కేరళలో వానవిల్లు

ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రేమ్‌కిరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన మలేషియా షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మా ట్లాడుతూ- ఓ వెరైటీ ప్రేమకథతో పేరుకు తగిన విధంగానే ఈ చిత్రాన్ని అందంగా, దృశ్యకావ్యంగా తీర్చిదిద్దుతున్నామని, ఓ చక్కని ప్రేమ జంట ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. సినిమా కథతోపాటుగా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన మలేషియా షెడ్యూల్ పూర్తిచేశామని, ఇప్పటివరకు అరవై శాతం పూర్తిచేశామని తెలిపారు.

Pages