S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమికన్నా స్వయం ఉపాధి మిన్న

హైదరాబాద్, జూన్ 1 : తెలంగాణ ప్రాంతంలో దళితులను ఆర్థికంగా ఉన్నతస్థాయికి తీసుకువచ్చేందుకు స్వయం ఉపాధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. భూమి సాగుచేస్తే వచ్చే ఆదాయం కన్నా స్వయం ఉపాధి పథకాలు చేపడితే లాభాలు అధికంగా వస్తున్నాయని దళిత కుటుంబాలకు చెందిన లబ్ధిదారులు భావిస్తుండటంతో స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

ఊహకందనంత ద్రవ్యరాశి

టొరంటో, జూన్ 1: పాలపుంత మొత్తం ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 700 బిలయన్ రెట్లు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది. సూర్యుడి మొత్తం ద్రవ్యరాశి 2 నానిలియన్లు. అంటే 2 తరువాత 30 సున్నాల కిలో గ్రాములన్నమాట! మరో రకంగా చెప్పుకోవాలంటే ఈ భూమి ద్రవ్యరాశి కంటే సూర్యుడి ద్రవ్యరాశి 3 లక్షల 30వేల రెట్లు ఎక్కువ. ఈ విశ్వంలో మన పాలపుంత అత్యంత పెద్ద గెలాక్సీ కాకపోయినా దీని మొత్తం ద్రవ్యరాశి అపారమేనని మెక్ మాస్టర్ యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్త గ్వెండోలిన్ ఈడి తెలిపారు.

ఊహకందనంత ద్రవ్యరాశి

టొరంటో, జూన్ 1: పాలపుంత మొత్తం ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కంటే 700 బిలయన్ రెట్లు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది. సూర్యుడి మొత్తం ద్రవ్యరాశి 2 నానిలియన్లు. అంటే 2 తరువాత 30 సున్నాల కిలో గ్రాములన్నమాట! మరో రకంగా చెప్పుకోవాలంటే ఈ భూమి ద్రవ్యరాశి కంటే సూర్యుడి ద్రవ్యరాశి 3 లక్షల 30వేల రెట్లు ఎక్కువ. ఈ విశ్వంలో మన పాలపుంత అత్యంత పెద్ద గెలాక్సీ కాకపోయినా దీని మొత్తం ద్రవ్యరాశి అపారమేనని మెక్ మాస్టర్ యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్త గ్వెండోలిన్ ఈడి తెలిపారు.

ఎంజె అక్బర్‌కు సొంత కారు లేదు!

భోపాల్, జూన్ 1: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీచేస్తున్న పాత్రికేయుడు ఎంజె అక్బర్, బిజెపి సీనియర్ నేత అనిల్ దవే ఇద్దరూ అఫిడవిట్‌లో తమకు సొంత కారు లేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ టంఖా మాత్రం మెర్సిడెజ్ బెంజ్‌తోపాటు ఐదు వాహనాలు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో చూపారు. బిజెపి అభ్యర్థి, సీనియర్ జర్నలిస్టు ఎంజె అక్బర్ (65), ఆయన భార్యకు 44 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. బిజెపి వ్యూహకర్త అనిల్ దవే (59) తనకు 60.9 లక్షల రూపాయలున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ టంఖా, ఆయన భార్యకు 62 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్‌లో తెలిపారు.

యూపిలో గెలుపే లక్ష్యం

న్యూఢిల్లీ, జూన్ 1: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి జాతీయ కార్యవర్గం అలహాబాద్‌లో ఈ నెల 12, 13తేదీలలో సమావేశం కానుంది. అసోంలో ఘనవిజయంతో ఊపుమీదున్న బిజెపి దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన యూపిలో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది.

చర్చల నుంచి భారత్ పరార్

ఇస్లామాబాద్, జూన్ 1: భారత్‌తో చర్చల కోసం తాము ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ, ఆదేశం నుంచి సానుకూల ప్రతిస్పందన రావడంలేదని.. చర్చల నుంచి భారత్ పారిపోతోందని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ విమర్శించారు. ‘్భరత్‌తో చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు పాకిస్తాన్ కృషి చేస్తున్నప్పటికీ, పఠాన్‌కోట్‌పై దాడి కేసులో సంయుక్త దర్యాప్తుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ భారత్ మాత్రం ఇరు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలకు ముందుకు రావడం లేదు. దీనిపై పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది’ అని ఆయన అన్నారు.

‘తలాక్’ను వ్యతిరేకిస్తున్న ముస్లిం మహిళలు

న్యూఢిల్లీ, జూన్ 1: మూడుసార్లు నోటి మాటగా తలాక్ చెప్పి విడాకులు తీసేసుకోవడాన్ని దేశంలోని ముస్లిం మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ వారు పోరాటానికి సైతం సిద్ధమవుతున్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బిఎంఎంఏ) సంస్థ నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా ఈ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించాలని కోరే ఒక పిటిషన్‌పై 50 వేలకు పైగా ముస్లింలు ఇప్పటికే సంతకాలు చేశారు. ట్రిపుల్ తలాక్ ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌కు వ్యతిరేకమైందని ఈ ఆన్‌లైన్ పిటిషన్ అంటోంది.

అక్రమం కాకుంటే ఆస్తులుండడం నేరం కాదు

న్యూఢిల్లీ, జూన్ 1: ఆస్తులు సంపాదించడం తప్పు కాదని, అయితే ఆ ఆస్తులు సక్రమమార్గంలో సంపాదించినవై ఉండాలని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు మూర్ఖమైందని కర్నాటక ప్రభుత్వం వాదించిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఆస్తులు సంపాదించడం నేరం కాదు. ఆస్తులకోసం ఖర్చు చేసిన సొమ్ము అక్రమమైంది అయినప్పుడు మాత్రమే అది నేరమవుతుంది’ అని న్యాయమూర్తులు పిసి ఘోష్, అమితావ్ రాయ్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.

పొలిటికల్ సైన్స్ అంటే వంట నేర్పే సబ్జెక్ట్!

పాట్నా, జూన్ 1: పొలిటికల్ సైన్స్ అంటే వంటలు నేర్పే సబ్జెక్ట్ అట. ఇంటర్మీడియట్‌లో ఆ సబ్జెక్ట్‌లో రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచిన ఓ విద్యార్థిని చెప్పిన సమాధానమిది. అంతేకాదు ఆ అమ్మాయి ఆ పదాన్ని సరిగా ఉచ్చరించలేకపోయింది కూడా. సైన్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన మరో విద్యార్థి అయితే తన సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక స్థాయి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక పోయాడు. బిహర్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రంలోనే టాపర్లుగా నిలిచిన వారి తెలివితేటలు ఇలా ఏడిస్తే మిగతా లక్షలాది మంది విద్యార్థుల స్థాయి ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. గత వారం ఈ పరీక్ష ఫలితాలను ప్రకటించారు.

ఇప్పుడున్న ఇంటి అదనపు నిర్మాణానికీ ప్రభుత్వ సాయం

న్యూఢిల్లీ, జూన్ 1: ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేయడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లభించే సాయం కొత్తగా సొంతింటిని కట్టుకునే వారికే కాదు, ఇప్పుడున్న ఇంటికి అదనంగా కనీసం 9 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాను చేర్చుకున్నా సరే ఈ పథకం కింద సాయం లభిస్తుంది. తాజాగా రూపొందించిన గైడ్‌లైన్స్ ప్రకారం ఈ పథకంలోని ‘బెనిఫిషరీ లెడ్ కన్‌స్ట్రక్షన్’ (బిఎల్‌సి) విభాగం కింద ఇప్పటికే పక్కా లేదా సెమీ పక్కా ఇళ్లు కలిగి ఉన్న లబ్ధిదారులు తమ ఇంటిని మరింత సౌకర్యవంతంగా చేసుకోవడానికి జరిపే అదనపు నిర్మాణానికి కూడా ప్రభుత్వ సాయం లభిస్తుంది.

Pages