S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జన్మ - ఆదర్శం

మానవజన్మ అన్ని జన్మలకన్నా ఉత్తమమైనది. మానవుడు తన ఉనికిని తెలుసుకొని మసలుకోవాలి. స్వార్థం విడనాడాలి. నేను, నా కుటుంబం, నావాళ్లు అనుకోవడంతోబాటు అందరూ నావాళ్లు అనుకోవడంలో ఎంతో పరమార్థం దాగి వుంది. నా స్వార్థం అని అనుకునేవారిని ఎవ్వరూ తలవరు. నా మనిషి నా సంఘం, నా వాళ్ళు అనుకునేవారికి సమాజం ప్రతినిత్యం స్వాగతం పలుకుతుంది. మనిషి తోటి మనిషికి కాస్త సాయపడాలి. చేతనైన సాయం చేయాలి. ఆపదలో వున్నవారిని ఆదుకోవాలి.

-ఎల్.ప్రపుల్లచంద్ర

హరివంశం 148

వాళ్ళపై శ్రీకృష్ణుడు విల్లు ఎక్కుపెట్టగానే వాళ్ళు అమిత భయసంత్రస్తులైనారు. పరుగు పరుగున పోయి ఇంద్రుడికి ఈ వార్త చేరవేశారు. ఇంద్రుడికి ఆయన దివ్యమహిమ, త్రైలోక్య రక్షణ తత్పరత్వం బాగా తెలిసి ఉన్నప్పటికీ, ఆ మహాప్రభువు పారిజాత తరువు పెరికి తీసుకొని పోవటానికి మనసు సమాధానపరచుకొన్నప్పటికీ, ఉండబట్టలేక అది తన ఇల్లాలకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి వదులుకోలేక తన సేనతో వచ్చి ఆయనను అడ్డగించాడు. ఆయనపై వజ్రాయుధం ప్రయోగించాడు. కాని ఆ వజ్రాయుధం స్తంభించిపోయింది.

-అక్కిరాజు రమాపతిరావు

యమహాపురి 57

‘‘ఒకప్పుడు టామీ కూడా ఊళ్ళో మనిషే. పాపం చేసింది. జంతువై శిక్ష అనుభవిస్తోంది. శిక్ష అయిపోగానే మళ్లీ మనిషౌతుంది’’.
‘‘అక్కడికి- ఈ ఊళ్ళో మనుషులకీ, జంతువులకీ పెద్ద తేడా ఉన్నట్లు’’ అనుకున్నాడు రాజా.

వసుంధర

నేర్చుకుందాం

శ్రవణ సుఖంబుగా సామగానంబులు చదవెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులయు గరికర శీతల చ్ఛాయదచ్ఛీకరాంబు
కణముల చల్లనిగా డ్వాసపడి దాని జెంది సుఖం బున్న సింహములయు
భూసురప్రవరులు భూతబలుల్ తెచ్చి పెట్టు నీవారాలన్న పెండతతులు
గడంగి భక్షింప నొక్కట గలపియాడు చున్న
యెలకులు బిల్లుల యొండులయు సహజ
వైరివర్గంబులయు సహవాస మపుడు
సూచి ముని శక్తి కెంతయు జోద్యమంది

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

ఎక్కడికి పోతావు చిన్నవాడా!

నిఖిల్, హేబాపటేల్, నందితాశే్వత ప్రధాన తారాగణంగా మేఘనా ఆర్ట్స్ నిర్మాణంలో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’. ఈ చిత్రానికి సంబంధించిన 80 శాతం షూటింగ్ పూర్తిచేశారు. కథానాయకుడు జన్మదినోత్సవ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు కొత్త తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని, నిఖిల్ సెలక్టివ్‌గా నటించే చిత్రాలలో ఇదొకటని తెలిపారు.

పవన్‌తో త్రివిక్రమ్ మరో సినిమా?

ప్రస్తుతం యస్.జె.సూర్య దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న పవన్‌కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా వచ్చే నవంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. పవన్‌కళ్యాణ్ త్వరలో సినిమాలు చేయడం మానేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అందువల్ల పవన్ వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు. అందువల్ల ఎస్.జె.సూర్య సినిమా పూర్తయిన తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్టు తెలిసింది. అయితే గతంలో ప్రకటించినట్టు ఇది ‘కోబలి’ సినిమానా లేక వేరొక కథా అన్నది తెలియరాలేదు.

ఏంజిలినా జోలి విడాకులు?

హాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా అప్పట్లో దుమ్ము రేపిన సంచలన తార ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే సమాధానం ఒక్కటే.. అదే ఏంజిలినా జోలీ? అందాలతో కుర్రకారుకి మతులు పోగొట్టిన ఈ భామ ఇప్పుడు విడాకులు తీసుకునేందుకు సిద్ధం అయింది? ఎంజిలినా జోలి బ్రాడ్ పిట్‌తో దాదాపు 11 సంవత్సరాలు కలిసి వుంది. రెండేళ్ళ క్రితమే వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్న వీరిమధ్య ఇప్పుడు విభేదాలు తలెత్తాయి. దానికి కారణం బ్రాడ్ పిట్ మరో నటితో సంబంధం పెట్టుకోవడమే. అలాగే ఎంజిలినా జోలి ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగాలేదు. ఇటీవలే కాన్సర్ సోకడంతో ఆమె రెండు వక్షోజాలను కూడా తొలగించారు. దాంతో సమస్య ఇంకా పెద్దదైందట.

తెలంగాణ విజయగాథ... చండీయాగం

తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని కాపాడడం కోసం ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఒక కారణజన్ముని సారథ్యంలో తెలంగాణ సమాజం సాగించిన విజయగాథను కథాంశంగా చండీయాగం అనే టైటిల్‌తో పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ తరహాలో హెగియో గ్రాఫికల్ సినిమాగా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుగుతున్నవేళ చండీయాగ చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా వుందని నిర్మాత తెలియజేశారు.

‘మునుము’ పాట విడుదల

తెలంగాణ రాష్ట్ర అవతరణ దిన్సోవం సందర్భంగా ఓ ప్రముఖ టీవీ చానెల్ సమర్పణలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో పూర్ణచందర్ దర్శకత్వంలో మిట్టపల్లి సురేందర్ సంగీత, సాహిత్యం సమకూర్చిన ‘మునుము’ అనే ప్రత్యేక గీతాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.

Pages