S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెంచిన పెట్రో ధరలను ఉపసంహరించుకోండి

చెన్నై, జూన్ 1: పెట్రోలు, డీజిలు ధరలను భారీగా పెంచుతూ పెట్రోలియం కంపెనీలు తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం డిమాండ్ చేశారు. కాగా, సిపిఎం సైతం పెట్రో ధరల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ సర్కారు జరపుతున్న వృథా ఖర్చుకు ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేయడమే ఈ చర్య అని దుయ్యబట్టింది. ‘చమురు మార్కెటింగ్ కంపెనీలు అనుసరిస్తున్న ధరలను నిర్ణయించే విధానం తప్పని నేను అనేక సందర్భాల్లో స్పష్టం చేశాను. ఈ తప్పుడు విధానం ఆధారంగానే ఇటీవల పెట్రోలు, డీజిలు ధరలను పెంచడం జరిగింది’ అని జయ ఒక ప్రకటనలో పేర్కొంది.

తప్పదు రాజకీయ పునరేకీకరణ

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణను అస్థిర పరచడానికీ కుట్ర జరుగుతోందని, ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. తెదేపాకు చెందిన మల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువాను కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ అత్యవసరమన్నారు. రాజకీయ అవసరాల కోసం ఆషామాషీగా చేరికలు జరగటం లేదని, తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే జరుగుతున్నాయన్నారు.

టి-ఎమ్సెట్‌కు అభ్యర్థుల జోరు

హైదరాబాద్, జూన్ 1: మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఎమ్సెట్-2 నోటిఫికేషన్‌కు తొలి రోజు విశేష స్పందన కనిపించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని కన్వీనర్ డాక్టర్ ఎన్ వి రమణారావు వెల్లడించారు. తొలి రోజు 6వేల మంది దరఖాస్తు చేశారు. ఎమ్సెట్-2 మెడికల్ స్ట్రీం దరఖాస్తులను బుధవారం నుండి స్వీకరిస్తున్నారు. దాదాపు 60వేల మంది పరీక్షకు దరఖాస్తు చేస్తారని అంచనా. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్‌లో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ముస్తాబైన తెలంగాణ

తెలంగాణ ధగధగలాడుతోంది. పట్టుబట్ట కట్టి పండుగ జరుపుకోవడానికి రాష్ట్రం మొత్తం ముస్తాబైంది. రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లు పూరె్తై మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించే సంబురాలకు చిన్నా పెద్దా ముసలీ ముతకా సన్నద్ధమైంది. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించుకుంటోంది. ప్రత్యేక ఉద్యమ ఫలాన్ని పదిమందితో కలిసి పంచుకుని పండువ చేసుకోవడానికి ఉత్సాహం చూపుతోంది.

నేడు రాష్ట్రంలో నవనిర్మాణ దీక్ష

విజయవాడ, జూన్ 1: రాష్ట్ర విభజన దినాన్ని ఎపి ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షగా పరిగణించి, ఈ సందర్భంగా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో ప్రతిజ్ఞా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయి నవ నిర్మాణ దీక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నిర్వహించనున్నారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగిన వేదికల వద్ద గురువారం నవ నిర్మాణ దీక్షలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో ఎపికి జరిగిన అన్యాయం, ఆనాడు యుపిఎ ప్రభుత్వం వ్యవహరించిన తీరును చంద్రబాబు నాయుడు ప్రజలకు మరోసారి వివరించనున్నారు.

10 నుంచి ఉద్యోగుల బదిలీలు

విజయవాడ, జూన్ 1: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను ఈనెల 10 నుంచి 20వ తేదీల మధ్య జరపాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే విడుదల చేయాలని బుధవారం సిఎం క్యాంపుకార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ స్కూళ్ళలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 మంది విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేయనున్నామని తెలిపారు.

మంత్రులకు మళ్లీ పరీక్ష

హైదరాబాద్ జూన్ 1: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు మళ్లీ పరీక్ష ఎదురుకానుంది. మంత్రుల పనితీరు, సామర్థ్యం, ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న తీరుపై గతంలో సర్వేలు నిర్వహించి, ర్యాంకులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ మరో సర్వే చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాను మళ్లీ ఈ నెలలో మంత్రుల పనితీరుపై కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తీసుకుంటున్నానని వెల్లడించారు. మొత్తం 136 అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులు ఇస్తున్నట్లు వివరించారు.

సైకిలెక్కిన అశోక్‌రెడ్డి

విజయవాడ, జూన్ 1: ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వైసిపి ఎమ్మెల్యే ముత్తంశెట్టి అశోక్‌రెడ్డిని చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒకవైపు వౌలికవసతులు లేక మరోవైపు రాజధాని లేక అష్టకష్టాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ త్వరలోనే కష్టాలను అధిగమించి పురోభివృద్ధి సాధించడం తథ్యమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న నాకు రాజకీయాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

పెరిగిన ధాన్యం మద్దతు ధర

న్యూఢిల్లీ, జూన్ 1: ఖరీఫ్‌లో ధాన్యం కనీస మద్దతు ధరను మరో అరవై రూపాయలు పెంచేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం తమ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఖరీఫ్ ధాన్యం కనీస మద్దతు ధరను క్వింటాలుకు 1,410 నిర్ణయించటం తెలిసిందే. అయితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు అదనంగా మరో అరవై రూపాయలు పెంచేందుకు అంగీకరించటంతో 2016-17 సంవత్సరానికి ధాన్యం కనీస మద్దతు ధర 1,470 రూపాయలకు చేరుకున్నది. పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ మినహా మిగతా అన్ని పంటలకు ప్రభుత్వ సలహా సంఘం సిఫారసు చేసిన కనీస మద్దతు ధరలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం తమ ఆమోదం తెలిపింది.

రగులుతున్న దేశం

హైదరాబాద్, జూన్ 1: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు అటు తిరిగి కులం రంగు అంటుకుంది. కేంద్రమంత్రి సుజనా చౌదరి, టిజి వెంకటేష్‌ను ఎంపిక చేయటం ఇంటా, బయట ఇతర కులాలకు అసంతృప్తిగా మారింది. పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలను టిడిపి మోసం చేసిందని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన ఆర్. కృష్ణయ్య తిరుగుబాటు చేస్తే, దళిత నేత పుష్పరాజ్‌ను పార్టీ వాడుకుని వదిలేసిందని మాలమహానాడు బహిరంగంగా విరుచుకుపడింది. పుష్పరాజ్ సైతం తనను నమ్మించి మోసం చేశారని వాపోయారు. కాపులకు పార్టీ మొండి చేయి చూపిందని కాపునాడు నేతలు కనె్నర్ర చేస్తున్నారు.

Pages