S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ రజాక్‌ఖాన్ కన్నుమూత

బాలీవుడ్‌లో నవ్వుల రారాజుగా వెలుగొందిన హాస్య నటుడు రజాక్‌ఖాన్ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా గుండె సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. ముంబాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. దాదాపుగా 90కి పైగా చిత్రాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకుల్ని రజాక్‌ఖాన్ ఆకట్టుకున్నారు. జోరూకాగులామ్, హేరాఫెరీ, బాద్‌షా, హసీనామాన్, జాయేగీ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, హాస్యనటుడుగా స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్‌లోని ప్రముఖ నటులు సంతాపం వ్యక్తం చేశారు.

సీక్వెల్‌గా కాలింగ్‌బెల్-2

గతంలో పన్నారాయల్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన కాలింగ్‌బెల్ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. ఈ చిత్రానికి కాలింగ్‌బెల్-2 అనే పేరును ఖరారు చేశారు. డ్రీమ్‌కేచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశోక్, రాజ్‌దలవాయి రూపొందించనున్నారు. ఈనెలలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, సాంకేతికంగా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేశామని, హాలీవుడ్ నుంచి కొంతమంది టెక్నీషియన్స్‌ని ఈ సినిమాకోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. మంచి కథనంతో ఈనెల్లోనే సినిమాను ప్రారంభిస్తున్నామన్నారు.

మహేష్ సోదరి దర్శకత్వం?

నటిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న మహేష్‌బాబు సోదరి మంజుల ఇప్పుడు మరో బాధ్యత తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పటివరకూ నటిగా షో, కావ్యాస్ డైరీ లాంటి చిత్రాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహేష్ కథానాయకుడిగా నటించిన నాని, పోకిరితోపాటు షో, కావ్యాస్ డైరీ, ఏమాయ చేసావె తదితర చిత్రాల్ని నిర్మించారు మంజుల. ప్రస్తుతం నాని కథానాయకుడిగా తన దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మంజుల సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా పూర్తిఅయిన తర్వాత మంజుల దర్శకత్వంలో సినిమా మొదలవచ్చని సమాచారం.

పెళ్ళికి రెడీ

దక్షిణాదిలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. ఆ తరువాత బాలీవుడ్‌కి చెక్కేసిన హాట్ భామ ఇలియానాకు అక్కడ తీవ్ర నిరాశే మిగిలింది. చేసిన నాలుగు సినిమాలు ఢమాల్‌మనడంతో అవకాశాలు రావడం ఆగిపోయాయి. దాంతో మళ్లీ గ్లామర్ పెంచి మాగజిన్‌లకు హాట్‌హాట్ ఫోజులిచ్చి సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రైచేసినా పెద్దగా లాభం లేకపోయింది. దాంతో ఇక పెళ్లిచేసుకునేందుకు రెడీ అయినట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి! ఇప్పటికే ఆండ్రు అనే అతనితో కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ.. ఇటీవలే తన ప్రేమను మీడియా ముందు ఒప్పుకుంది. అంతేకాదు త్వరలోనే వివాహం చేసుకునే ఆలోచనలో వున్నట్టు చెప్పింది.

ముహూర్తం కుదిరింది

శ్రీనువైట్ల, వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘మిస్టర్’ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 28న స్పెయిన్‌లో ప్రారంభం అవుతుందని తెలిసింది. నిజానికి మొదట ఈ సినిమా మే 15 నుంచి స్పెయిన్‌లో షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా అది జరుగలేదు. ప్రస్తుతం లాస్‌వేగాస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న వరుణ్‌తేజ్ మరికొద్ది రోజుల్లో ఇండియాకు రానున్నారు. ఆ తరువాత ‘మిస్టర్’ సినిమాపై దృష్టి సారిస్తారు. ఆగడు, బ్రూస్‌లీ లాంటి రెండు భారీ పరాజయాల తర్వాత మళ్లీ ఓ బలమైన హిట్ కొట్టాలన్న కసితో దర్శకుడు శ్రీనువైట్ల వరుణ్‌కు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం.

పుచ్చకాయతో పెరిగే సౌందర్యం

వేసవికాలంలో పుచ్చకాయలకు మంచి గిరాకీ వుంటుంది. శరీరానికి చల్లదనం కలిగించటమే కాక దాహార్తిని కూడా ఈ పుచ్చకాయ తీరుస్తుంది. అంతేకాక, చర్మ సౌందర్యానికి, ముఖ సౌందర్యానికి పుచ్చకాయ ఎంతో మంచిది. ఒక కప్పు పైతొక్క, గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు, ఒక చెంచా కలబంద జెల్ తీసుకుని బాగా కలిపి ముఖానికి రాసుకుని రెండు నిముషాలపాటు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల ముఖ కాంతి పెరిగి వెలిగిపోతున్నట్లవుతుంది. రెండు అరటిపండ్ల ముక్కలకు, రెండు చెంచాల పుచ్చకాయ గుజ్జు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15-20 నిముషాల తరువాత కడిగేసుకోవాలి.

- మనస్విని

బానిస సంకెళ్లు ఇంకెన్నాళ్లు?

ప్రపంచంలోబానిసత్వం పనులు చేసేవారి సంఖ్య అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ కోట్లాదిమంది బానిస పనులు చేస్తున్నారని కొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 1.835 కోట్లమంది అంటే 1.3 బిలియన్ల మంది వెట్టి చాకిరిలో మగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 46 బిలియన్ల మంది ఉన్నారు. గత రెండేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఇలాంటివారు కటిక పేదరికంలో మగ్గుతూ వెట్టి చాకిరి పనులు చేస్తున్నారు. వీరికి ఎలాంటి చట్టాలు వర్తించవు. కనీస వేతనాలు అసలే లభ్యంకావు. పొద్దస్తమానం వెట్టిచాకిరీ చేస్తూ అర్థాకలితో గడుపుతున్నారు.

ఐడియా

మనం అరుదుగా ధరించే బట్టలు పెట్టెల్లో పెట్టి ఉంచుతాం. పెట్టెలలో చాలా రోజులు వుంచడంవల్ల కొన్ని రకాలైన చీడపురుగులు, క్రిమి కీటకాలు చేరి బట్టలను కొరికి పాడు చేస్తూంటాయి. వీటి బారిన పడకుండా బట్టలు సురక్షితంగా వుంచాలంటే కొద్దిగా కర్పూరం, లవంగాల పొడి మిశ్రమాన్ని పెట్టె మూలల్లో వేసి వుంచినట్లయితే ఎలాంటి పురుగులైనా సరే నాశనమవుతాయి. బట్టలు సురక్షితంగా ఎంతకాలమైనా వుంటాయి.

-బి.మాన్‌సింగ్

సింపుల్‌ వాచీలు.. సరికొత్త అందాలు

ఆధునిక ఫ్యాషన్లు ఎన్ని వచ్చినా.. కొంతమంది మహిళలు సింపుల్‌గా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తారు. కుడి చేతికి రెండు బంగారు గాజులు, ఎడమ చేతికి వాచీ పెట్టుకుని తమ ప్రత్యేకతను చాటుకుంటారు. మరికొందరు కొత్తగా కనిపించాలను కుంటారు. కొత్తగా కనిపించాలనుకున్నపుడు తమ ఆహార్యంలో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారో ముందు ఆలోచించండి. అందుకు అనుగుణంగా తయారవ్వండి. తరాలు మారినా తరగని క్రేజ్ సంపాదించుకున్న వాచీల ఎంపికలో కాస్తంత ఆధునికత చూపించాల్సిన అవసరం ఉంది. అపుడే మీచేతిని అందం చుట్టేస్తోంది. ఏవి పడితే వాటిని ధరించటం వల్ల చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండవచ్చు. కళ్లను కట్టిపడేసేలా..

ఆ ఒక్క నిమిషం నోరు మూసుకోలేరా? (వార్త-వ్యాఖ్య)

మే 27న దీదీ మమతా బెనర్జీ కలకత్తా ‘ఎర్రవీధి’లో జనాలమధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు- సభలో హేమాహేమీ నాయకులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీరందరితోపాటే శ్రీమాన్ లల్లూ ప్రసాద్ యాదవ్ ప్రక్కనే అంతెత్తు విగ్రహం కనుక- అందరి కంటా పడుతూ కాశ్మీర్ జనాల వృద్ధ నాయకుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు జనాబ్ ఫారూక్ అబ్దుల్లాగారూ కూడా కెమెరాల దృష్టిని ఆకట్టుకుంటూనే వున్నాడు.

-వీరాజీ veeraji.pkm@gmail.com

Pages