S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్‌కు పగ్గాలు

న్యూఢిల్లీ, జూన్ 1: కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టనున్నారా? ఈ విషయంలో సోనియాగాంధీ తుది నిర్ణయానికి వచ్చేశారా? రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుందా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తర్జన భర్జనల అనంతరం సోనియా ఎట్టకేలకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. సిడబ్ల్యుసిలో కూలంకషంగా చర్చించి ప్రకటించే అవకాశం ఉందని కూడా అంటున్నాయి. సిడబ్ల్యుసి సమావేశం శుక్రవారం జరిగే అవకాశముందని పార్టీ సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు.

కృష్ణా ముసాయదా ఆపండి

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు చర్యలను ఆ రాష్ట్ర సిఎం కె చంద్రశేఖర్‌రావు, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాశారు. కృష్ణానదీ జలాలను వినియోగిస్తున్న తెలంగాణను సంప్రదించకుండా విస్తృతంగా చర్చలు జరపకుండా కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తన లేఖలో ఆరోపించారు. బోర్డు నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పద్యం పిడుగులు

తిరుపతి, జూన్ 1: ఆంగ్ల భాష జోరందుకుంటున్న నేటి సమాజంలో తెలుగు నేర్చుకోవాలంటేనే తాము తక్కువ వారేమో అని భావిస్తున్న అనేకమంది కళ్లు తెరిపించేలా నాలుగేళ్ల వయసున్న వంద మంది చిన్నారులు 10 నిమిషాల్లో వంద వేమన పద్యాలను శ్రావ్యమైన కంఠంతో అలవోకగా వల్లిం చి అందరినీ విస్మయపరిచారు. ఏకకాలంలో మూడు రికార్డులను బద్దలు కొట్టారు. తిరుపతిలో మేక్ మై బేబీ జీనియస్ పాఠశాల విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఈ చిచ్చర పిడుగులు గతంలో జ్ఞాపక శక్తి ప్రదర్శనల్లో అనేక రికార్డులు సృష్టించారు.

తిరుగులేని స్థాయికి తెరాస (నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం)

‘‘తెలంగాణ సాధించామని సంబరపడుతున్నారు. ఈ సంబరాలు ఎక్కువ రోజులు ఉండవు. ఆరునెలలు గడిస్తే కెసిఆర్‌పై తెలంగాణ ప్రజలు తిరగబడతారు, తిరిగి ఆంధ్రలో కలిపేయమని ఉద్యమిస్తారు.’’ తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రం మంత్రిగా ఉన్న టిజి వెంకటేశ్ చెప్పిన మాటలివి. ఆయన కోరుకున్న తెలంగాణ అది. ఇటీవల ఒక టీవి చానల్‌లో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు లైవ్‌లో మాట్లాడుతుంటే ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ఫోన్ చేసి ‘‘సార్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం మా నాయకుల వల్ల కాదు. కెసిఆర్ ప్రయత్నిస్తే ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది. దయచేసి మీరీ ప్రయత్నం చేయాలి’’ అని అభ్యర్థించారు.

- బుద్దా మురళి

రుణమాఫీ వర్తింపజేయండి

నెనొక సన్నకారు, సామాన్య రైతును. నాకు ఉన్న కొద్ది పొలంపై (2ఎకరాల 60 సెంట్లు) అంబాజీపేట ఎస్‌బిఐలో9-12-2013న, రూ.97,000 పంటరుణాన్ని అరటి పంట నిమిత్తం తీసుకున్నాను. అప్పటి ప్రభుత్వం వారు ఉద్యావన పంటలకు రైతులకు రుణమాఫీ వర్తించదని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు ఉద్యానవన పంటలకు కూడా రుణమాఫీ వర్తింపజేశారు. కానీ అర్హుడనైనప్పటికీ నాకు పంట రుణమాఫీ వర్తించలేదు. ఆంధ్రాబ్యాంకు, సహకార పరపతి సంఘం వారు కూడా అర్హులైన ఉద్యానవన పంట రైతులకు రుణమాఫీ వర్తింపజేశారు. కానీ అంబాజీపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియావారు అర్హుల జాబితాను పంపలేదో ఏమో, ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ వర్తించలేదు.

అన్నింటికీ బ్రాహ్మణులనే అనడం తగదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటికీ చాలా ఊళ్ళలోని వీధులు కులాల పేరుతోనే చెలామణి అవుతున్నాయి. అప్పుడు ఇప్పుడూ కూడా కులాలు సజీవంగానే ఉన్నాయి. కులాభిమానం ఉండేదే తప్ప కుల దురభిమానం ఉండేది కాదు. కులం తిట్లు సజీవమే. ఇప్పుడా తిట్లు కొన్ని వర్గాల వారికి పరమ నేరం. కులాన్ని సూచించే పేర్లు ఆరోజుల్లో కొందరికి మాత్రమే పరిమితమైతే నేడన్ని కులాల వాళ్ళు (మినహాయింపు మామూలేకదా!) తమ పేరు చివర కులాన్ని సూచించే తోకల్ని సగర్వంగా తగిలించుకుంటున్నారు. అదీ తప్పు లేదు. ‘‘మీరేమట్లు?’’అని అడగక్కర్లేకుండానే తెలిసిపోతూ ఉంది. ఇంతవరకు ఏ ఒడిదుడుకులు లేవు.

- ఆయి కమలమ్మ

పాఠానికి ప్రేరకులెవరు?

ఉపాధ్యాయుడనే వ్యక్తికి ప్రతిరోజు కొత్తే. ప్రతిరోజు ఒక నూతన సూర్యోదయం. అది కాదనుకునేవాడికి ఇది అరిగిన పాఠం. లేదనుకుంటే అది అయిపోయిన పాఠం. అమెరికన్ అధ్యక్షుడు ఐరన్ ఓవర్ ఒకసారి ఇలా అన్నాడు. ‘‘ఉపాధ్యాయులకై నిరంతరం శోధన జరుగుతూనే ఉండాలి.’’ తరగతి గదికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయుడికి విద్యార్థి పరీక్షకు వెళుతున్నట్లు ఉంటుంది. పరీక్షకుపోయే విద్యార్థికి ఏమి జ్ఞప్తికి రాదు. అప్పుడు భయపడుతుంటాడు. సంవత్సరం సొంతం చదివినా కానీ పరీక్షలప్పుడు అంతా జ్ఞప్తికి రావటం లేదని అనుకుంటాడు. అదే సమయంలో పిల్లలకు ధైర్యం చెప్పాలి. ‘‘పిల్లలూ! జీవితంలో సాధించిన విజయాలు ఒక్కసారి స్మరించుకొమ్మని చెప్పాలి’’.

- చుక్కా రామయ్య

వాస్తవాల కథ..‘గీటురాయి’ జాతీయత

కోతియుగం, రాతియుగం వంటి కృత్రిమ కాల విభాగాలను చేసినవారికి సహజ చారిత్రకపరిణామ క్రమాన్ని వివరించే ఆవిష్కరణలు అనేకం జరుగుతున్నాయి. అయినప్పటికీ పాశ్చాత్యులు మన నెత్తికెత్తిపోయిన కట్టుకథల ప్రభావం నుంచి మన విద్యావ్యవస్థకు ఇప్పటికీ విముక్తి లభించలేదు. ‘‘సింధు నాగరికత’’గా బ్రిటిష్ వారు చెలామణి చేసి వెళ్లిన చారిత్రక సమాజం ఎనిమిదివేల ఏళ్ళకు పూర్వం పరిఢవిల్లినట్టు భారత పురాతత్వ పరిశోధన సంస్థ-ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్‌ఐ- వారు సరికొత్తగా కనిపెట్టారట.

- హెబ్బార్ నాగేశ్వరరావు

సవాళ్లకు దీటుగా

భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించి సరిగ్గా రెండేళ్లు గడిచిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏదో అయిపోతుందనే అనుమానాలు కనుమరుగయ్యాయి. పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఒక్కో రంగంలో పురోగామిగా ముందుకు వెళ్తోంది. ఒక్కో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తూ మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది. రాష్ట్రం ఏర్పడిన మరుక్షణం విద్యుత్తు సంక్షోభం తలెత్తుతుందని అనుమానాలు వ్యక్తమయితే, కేవలం ఆరు మాసాల వ్యవధిలో కరెంటు కోతలు లేకుండా పోయాయి. ఒకటి రెండు ఘటనలు మినహా నక్సలైట్ల సమస్య రానేలేదు.

2-6-2016

Pages