S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయహో హనుమా.. జయ జయహో

మల్యాల, మే 31: జయహో హనుమా.. జయ జయహో హనుమా.. రామదూత హనుమాన్‌కీ జైభోలో శ్రీరామ్‌కీ అంటూ హనుమాన్ హనుమాన్ నామకీర్తనలతో కొండగట్టు అంజన్న జయంతి తరలివచ్చిన కాషాయదండు వేడుకలు మారుమ్రోగాయి. ఉదయం నుండి రాత్రి వరకు అంజన్న జయంతి వేడుకల్లో 80వేలకు పైగా భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

కలుషిత రక్తంతో 2234మందికి ఎయిడ్స్

న్యూఢిల్లీ, మే 31: భారత దేశంలో కలుషిత రక్తాన్ని ఎక్కించటం వల్ల గత 17 నెలల్లో 2234 మందికి హెచ్ ఐ వీ వైరస్ సోకిందని హిందూ దినపత్రిక ఓ నివేదికను వెలువరించింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 361 కేసులు ఇలాంటివి నమోదయ్యాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. గుజరాత్‌లో 292 కేసులో, మహారాష్టల్రో 272, ఢిల్లీలో 264 కేసులు నమోదయ్యా యి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో)కు సమాచార హక్కు కార్యకర్త చేతన్ కొఠారీ దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఈ సమాచారాన్ని నాకో వెల్లడించింది. బడ్జెట్ కోత వంటి కారణాల వల్ల ఎయిడ్స్‌పై చైతన్య కార్యక్రమాలను ప్రభుత్వం తగ్గించింది. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం.

జరిమానా కట్టాల్సిందే

న్యూఢిల్లీ, మే 31: ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల తాము మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం వల్ల ఢిల్లీలోని యమునా నది ఒడ్డుకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదంటూఆ సంస్థ చేసిన వాదనను తిరస్కరించిన గ్రీన్ ట్రిబ్యునల్, నష్టపరిహారంగా చెల్లించాల్సిన మిగతా 4.75 కోట్లు చెల్లించాలని మంగళవారం ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల్లోగా ఆ జరిమానా సొమ్మును డిపాజిట్ చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది.

స్టింగ్ ఆపరేషన్ కేసులో రావత్ అరెస్టుపై స్టే

నైనిటాల్, మే 31: స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సీడీ కేసులో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అరెస్టుపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఈ అంశంపై జూన్ 20వ తేదీన తదుపరి విచారణ జరుపనుంది. రావత్‌కు ప్రమేయం ఉన్న స్టింగ్ ఆపరేషన్‌పై దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) గత వారం ఆయనను ప్రశ్నించిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తునకు రాష్టప్రతి పాలన సమయంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నామని రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సిబిఐ తిరస్కరించడంతో రావత్ బలవంతంగా విచారణకు హాజరుకావలసి వచ్చింది.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి

మేడ్చల్, మే 31: రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టిఆర్‌ఎస్ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఓం శివసాయి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మేడ్చల్ మండల టిఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసిన వారికి తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు.

రూ.200 కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి

తాండూరు, మే 31: క్షేత్రస్థాయిలో గ్రామాల పురోభివృద్ధికి తమ ప్రభుత్వం నిర్మాణాత్మక అభివృద్ధిని చేపడుతుందని రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె తాండూరు, యాలాలలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర మంత్రి పి.మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.200 కోట్లతో తాండూరు నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు హరితహారం రెండవ విడతను విజయవంతం చేయాలన్నారు.

సర్కారు పంతుళ్లు పాఠాలు మానేసి దందాలు

శేరిలింగంపల్లి, మే 31: సర్కారు బడిబంతుళ్లు దందాలు చేసుకుంటూ చదువు చెప్పడం లేదని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఆవేదన వ్యక్తం చేసారు. చందానగర్‌లో జరిగిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎ.గాంధీ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం చేసుకుంటున్నారని, దాంతో చదువు కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. మండల పరిధిలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద అన్ని సదుపాయాలు కల్పించినా ఫలితాలు దారుణంగా వున్నాయన్నారు.

ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలి

ఇబ్రహీంపట్నం, మే 31: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఉద్యమంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రాజకీయ ఐకాస చైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జెఎసి తూర్పు విభాగం చైర్మన్ వెదిరె చల్మారెడ్డి ఆధ్వర్యంలో జెఎసి నేతలు స్థానిక చౌరస్తాలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో రాజకీయ నాయకులు, ఐకాస నేతలు, న్యాయవాదులు, ప్రజలు, విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు ఎన్నో పోరాటాలు నిర్వహించారని అన్నారు.

మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు

ఇబ్రహీంపట్నం, మే 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపి నర్సయ్యగౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ ఇంటింటికీ తాగునీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం ప్రజలకువరం లాంటిదని చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

చెత్త వేయద్దు సిసి కెమెరాలు చూస్తున్నాయ్!

ఉప్పల్, మే 31: జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో పరిసరాల పరిశుభ్రతకోసం అధికారులు నిడుంబిగించారు. యువజన సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో చేరుూ చేరుూ కలుపుదాం సుందర నగరంగా తీర్చిదిద్దుదామంటూ... ప్రజల్లోకి వెళుతున్నారు. స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ హైదరాబాద్ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలకు మరింత వేగం పెంచారు. కాలనీలలో రహదార్లపై చెత్తవేయకుండా సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఆకర్షించే విధంగా ముగ్గులు వేస్తూ గోడలపై పెయింటింగ్ చిత్రాల ద్వారా ప్రజల్లో నూతన చైతన్యం తీసుకొస్తున్నారు.

Pages