S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్‌జిల్లా బదిలీలకు సిఎం ఆమోదం

హైదరాబాద్, మే 31: ఉపాధ్యాయుల అంతర్‌జిల్లా బదిలీలకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. ఫైలు విద్యాశాఖకు చేరుకోవడంతో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపో విడుదల కానున్నాయి. జిఎడిలో పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు కూడా వీటితో కలిపి చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు ఐ వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి పి బాబురెడ్డి చెప్పారు. అనేక సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఈ ఉత్తర్వులు ఊరటకలిగిస్తాయని వారు చెప్పారు.

వ్యవస్థపై నమ్మకం కలిగేలా పనిచేయాలి

సంగారెడ్డి, మే 31: ప్రభుత్వ రంగానికి చెందిన వివిధ శాఖలతో పోల్చితే పోలీసు శాఖపై బాధ్యతలు అధికంగా ఉంటాయని, ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ శాఖపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరు పని చేయాలని హైదరాబాద్ డిఐజి, నిజామాబాద్,మెదక్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్ సూచించారు. ఇటీవలే నిజామాబాద్ రేంజ్ డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మంగళవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రధాన జాతీయ రహదారులు ఉన్నాయని, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

సమన్వయం లోపిస్తే కఠిన చర్యలు

సంగారెడ్డి, మే 31: మండల అభివృద్ధి అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు సమన్వయంతో పని చేసి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ పనులు చేపట్టాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ సూచించారు. మంగళవారం కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారిగా త్రాగు నీటి ఎద్దడిపై సమీక్షించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మండల అభివృద్ధి అధికారుల మద్య సమన్వయం లేక సిఆర్‌ఎఫ్, నాన్ సిఆర్‌ఎఫ్ పనుల ప్రతిపాదనలు సమర్పించడంలో జాప్యం చేయడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. రెండు శాఖలు కూడా పంచాయతీరాజ్ క్రిందనే పని చేస్తున్నాయనే విషయాన్ని విస్మరించరాదని కలెక్టర్ హితవు పలికారు.

వేర్వేరు ప్రమాదాల్లో భారీ ఆస్తినష్టం

గద్వాలటౌన్, మే 31: రెండు వేర్వేరు ప్రమాదాల్లో మండలంలో భారీ ఆస్తినష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల మండలంలోని పరుమాల గ్రామంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులు నిర్వహించేందుకు నంద్యాల నుంచి లారీలో జెసిబిని తీసుకవస్తున్నారు. పరుమాల చెరువు కట్ట దగ్గర విద్యుత్ హైటెన్షన్ వైర్ తగిలి లారీ, జెసిబిలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకవచ్చారు. గ్రామంలో ఎలాంటి ప్రమాదం లేకుండా ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ప్రముఖ కవి, పరిశోధకులు కపిలవాయికి రాష్టస్థ్రాయి అవార్డు

నాగర్‌కర్నూల్, మే 31: రాష్ట్రంలో వివిధ రంగాలలో చేసిన సేవలను గుర్తించి అవార్డులను ప్రకటించగా, సాహిత్య రంగంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన ప్రముఖ కవి, పండితులు, పరిశోధకులైన కపిలవాయి లింగమూర్తికి(88) అవార్డును ప్రకటించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ ఉత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ అవార్డును అందించనున్నట్లు కపిలవాయికి ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. కపిలవాయి లింగమూర్తికి రాష్టస్థ్రాయి అవార్డు రావడం పట్ల సాహితి అభిమానులు, జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన వారు పలువురు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దోషుల్ని ఉపేక్షించం

న్యూఢిల్లీ, మే 31: ఆఫ్రికా దేశీయులపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సమాయత్తమైంది. ఢిల్లీలో చోటుచేసుకున్న కాంగో యువకుడి హత్య జాతి విద్వేషనేరం కాదని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. కాంగో దేశానికి చెందిన యువకుడిపై రెండురోజుల క్రితం కొందరు ఢిల్లీలో దాడికి పాల్పడి హత్య చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో దుమారం రేపిన ఘటనపై ఇప్పటికే కేంద్రం చర్యలు చేపట్టింది. ఆఫ్రికా జాతీయులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.

రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న ప్రభుత్వం

వనపర్తి, మే 31: రాష్ట్రంలో విచ్చలవిడిగా రాజకీయ ఫిరాయింపులకు పాల్పడుతూ టిర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నదని ఎఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి విమర్శించారు. మంగళవారం వనపర్తి పిఆర్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను టిఆర్‌ఎస్ 63 స్థానాల్లో గెలుపొంది పూర్తి మెజారిటీ సాధించినప్పటికీ రెండేళ్లలో రాజకీయ ఫిరాయింపులకు పాల్పడి 25 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ఆయన ఆరోపించారు. టిర్‌ఎస్ పక్షాన నామమాత్రంగా ఉన్న ఎమ్మెల్సీలు నేడు 20 మందికి చేరడం నిజంకాదా అని ఆయన అన్నారు.

పాలమూరు అడ్డుకుంటే రక్తపాతమే

మహబూబ్‌నగర్, మే 31: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు మహానాడులో తీర్మానం చేయడం హేయమైన చర్య అని, ప్రాజెక్టును అడ్డుకుంటే రక్తపాతమే జరుగుతుందన్న సంగతిని మరిచిపోవద్దని,మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ చంద్రబాబునాయడు విష కర్కోటకుడని, విషనాగులా తెలంగాణ ప్రాజెక్టులపై బుస కొడుతున్నారని ఆరోపించారు.

ఎస్‌పి,బిఎస్‌లను ‘పెకిలించివేస్తాం’

అలహాబాద్,మే 31: వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అలాగే బిఎస్‌పిలను పెకిలించివేస్తామని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. కాంగ్రెస్ సారధ్యంలోని అవినీతిమయమైన యుపిఏ సర్కార్‌కు మచ్చలేని ఎన్‌డిఏ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ఆయన వివరించారు. ఈరెండేళ్ల పాలనలో ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి పనిచేసిందని, ఎలాంటి ఆరోపణలకు తావులేని పరిపాలన అందించిందని అన్నారు. మోదీ ప్రభుత్వం సాధించిందేమిటంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడాన్ని అమిత్‌షా సవాల్ చేశారు.

డ్రైవరే మోసగాడు

మహబూబ్‌నగర్, మే 31: అద్దెకు కారును తీసుకుని కర్నూల్ నుండి హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి కర్నూల్‌కు వస్తున్న సందర్భంలో కారు డ్రైవర్ వ్యక్తిని మోసగించి రూ.15లక్షలను ఊడాయించి తనకేమీ తెలియనట్లు నటించి తప్పించుకుందామనిచూసిన డ్రైవర్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ఆసలు నింధితుడిగా గుర్తించారు. మంగళవారం జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కర్నూల్‌కు చెందిన నిఖిల్ పండ్ల వ్యాపారి అని ఆయన ఏప్రిల్ 30వ తేదిన కర్నూల్‌కు చెందిన ఏపి 21 ఏ ఆర్ ఏ 0243 నంబర్ గల కారును హైదరాబాద్‌కు అద్దెకు తీసుకుని వెళ్లారు.

Pages