S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూకుమ్మడి అత్యాచారాలు నిజమే

చండీగఢ్, మే 31: హర్యానాలో గత ఫిబ్రవరిలో ఉవ్వెత్తున జరిగిన జాట్ల ఆందోళనలో జరిగిన అరాచకాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పడిన ప్రకాష్‌సింగ్ కమిటీ నివ్వెరపోయే నిజాలను బయటపెట్టింది. హైకోర్టు సమర్పించిన ఈ నివేదికలో మూకుమ్మడి అత్యాచారాలు నిజమేనని కమిటీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కార్లలోంచి మహిళలను బయటకు లాగి వివస్తల్రను చేసిన ఆందోళనకారులు మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడ్డారని పేర్కొంది. వాహనాల్లో ప్రయాణిస్తున్న మహిళలను బలవంతంగా బయటకు లాగి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో అత్యాచారాలు జరిపారని నివేదించింది.

నౌకాదళ ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన లాంబా

న్యూఢిల్లీ, మే 31: భారత నౌకాదళ ప్రధానాధికారిగా అడ్మిరల్ సునీల్ లాంబా (58) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ నౌకాదళ ప్రధానాధికారిగా సేవలు అందించిన అడ్మిరల్ ఆర్‌కె.్ధవన్ పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన సునీల్ లాంబా పూర్తిగా మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. నావిగేషన్, డైరెక్షన్ విభాగాల్లో ఎంతో నిష్ణాతుడైన అడ్మిరల్ సునీల్ లాంబా ప్రపంచంలోని అత్యుత్తమ నావికా దళాల్లో ఒకటైన భారత నౌకదళ సారథిగా బాధ్యతలు చేపట్టడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.

చిత్రం సునీల్ లాంబాకు బాధ్యతలు అప్పగిస్తున్న రాబిన్ కె ధోవన్

కన్నడం నేర్చుకుంటా

బెంగళూరు, మే 31: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో కర్నాటక నుంచి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు చివరిరోజు మంత్రి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అవుట్‌సైడర్ అన్న విమర్శలపై ఆమె స్పందించారు.‘కర్నాటక ప్రాజెక్టుల పరిరక్షణకు కృషి చేస్తాను. అంతేకాదు కన్నడం నేర్చుకుంటాను’అని సీతారామన్ హామీ ఇచ్చారు. కర్నాటకకు సంబంధించిన అంశాలు పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి వెల్లడించారు.‘బిజెపి కార్యకర్తగా నామినేషన్ వేశాను.

ఆర్జీ-2లో 88శాతం బొగ్గు ఉత్పత్తి

యైటింక్లయిన్ కాలనీ, మే 31: బొగ్గు ఉత్పత్తికి కార్మికులు, అధికారులు సమన్వయంతో మరింతగా శ్రమించాలని సింగరేణి ఆర్జీ-2 జిఎం విజయ్‌పాల్ రెడ్డి సూచించారు. మే మాసానికి గాను ఆర్జీ-2లో 88శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆర్జీ-2 జిఎం కార్యాలయంలోని ఛాంబర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. భూగర్భ గనుల వారిగా వకీల్‌పల్లి గనిలో 25,699 టన్నులతో 90శాతం, 7 ఎల్ ఇపి గనిలో 15,990 టన్నులతో 80శాతం, ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్‌ల వారిగా ఓసిపి-3లో 4,03,019 టన్నులతో 90శాతం, ఓసిపి-3 ఫేజ్-2 64,115 టన్నులతో 58శాతం బొగ్గు చేసినట్లు తెలిపారు.

అగ్రవర్ణాలపై వివక్ష విడనాడాలి

మల్లాపూర్, మే 31: మండల కేంద్రంలో మంగళవారం ఓసి జెఎసి ఆధ్వర్యంలో ఓసి గర్జనను చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి వేల సంఖ్యలో అగ్రవర్ణాల ప్రజలు వచ్చారు. మండల కేంద్రంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం నుండి ఓసి జెఎసి గర్జన ర్యాలీని ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల వెంట ర్యాలీగా వెళ్లి తహశీల్ కార్యాలయంలో తహశీల్దార్ రవీందర్‌రాజుకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర జెఎసి చైర్మన్ నల్లా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ జనాభా ప్రాతిపాదికన విద్యా, ఉద్యోగ రంగాల్లో ఓసిలకు 19 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

మినీ ట్యాంక్‌బండ్ తరహాలో కుడి చెరువు అభివృద్ధి

చొప్పదండి, మే 31: నియోజకవర్గ కేంద్రంలోని కుడి చెరువును మినీ ట్యాంక్‌బండ్ తరహాలోనే అభివృద్ధి చేస్తామని ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన ఇఇ శ్రీనివాస్ గుప్తా, డిఇ కె.శ్రీకాంత్‌లతో కలిసి కుడి చెరువును పరిశీలించారు. ఈసందర్భంగా స్థానిక ఎంపిపి గుర్రం భూంరెడ్డి, జడ్పీటిసి ఇప్పనపల్లి సాంబయ్యలు కుడి చెరువు అభివృద్ధి విషయాన్ని ఎస్‌ఇ దృష్టికి తీసుకువెళ్లారు. చొప్పదండి ప్రజల చిరకాల కోరిక మేరకు మినీ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని కోరారు.

అగ్నికీలల ధాటికి భీతిల్లిన జనం

పుల్‌గావ్, మే 31: మహారాష్టల్రోని పుల్‌గావ్ ఆయుధగారంలో జరిగిన పేలుళ్ల శబ్దానికి చుట్టుపక్కలంతా దద్దరిల్లిపోయింది. సమీప గ్రామాల్లోని ఇళ్లు ఊగిపోయాంటే ధాటి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆయుధగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 18మంది భద్రతా సిబ్బంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భూకంప వస్తే ఎలా ఉంటుందో అలాంటి భయానక పరిస్థితి చూశామని గ్రామస్తులు తెలిపారు. ఇళ్ల కిటికీలు, తలుపులు పెద్ద ఎత్తున ఊగడంతో ఏం జరుగుతుందోనన్న భయంతో బయటకు పరుగులు తీశారు. డిపో నుంచి అగ్నికీలలు ఎగిసిపడడంతో దట్టమైన పొగ గ్రామాలను కప్పేసింది.

మారేడుగొండలో చెరువు శిఖం భూమి ఆక్రమణ

పెద్దపల్లి రూరల్, మే 31: చెరువు శిఖం భూమిని ఆక్రమించడమే కాకుండా మిషన్ కాకతీయ పనులు జరగకుండా అడ్డుతగలడాన్ని నిరసిస్తు మండంలోని మారేడుగొండ గ్రామస్థులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. మారేడుగొండ గ్రామ సమీపంలోని చెరువు శిఖం భూమిని కొంత మంది ఆక్రమించుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇటీవల మిషన్ కాకతీయ కింద పనులు ప్రారంభించగా ఆక్రమించుకున్న భూముల్లో నుంచి మట్టి తీయకుండా ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారు. ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోక పోవడంతో ఆయకట్టు రైతులు, గ్రామస్తులు మంగళవారం ఉదయం పెద్దపల్లి-కాల్వశ్రీరాంపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

అసంతృప్తిలో జడ్పీటిసిలు...

కరీంనగర్, మే 31: తమకు ప్రాధాన్యత లేదని, నిధులు కూడా రావడం లేదంటూ గతకొంతకాలంగా అసంతృప్తితో ఉన్న జడ్పీటిసిలు మంగళవారం నాటి జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరుకాకపోవడంతో సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశం 11 గంటల వరకు వేచి ఉన్నా జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డితోపాటు 15మంది జడ్పీటిసి సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ సమావేశాన్ని గంటసేపు వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సమావేశాన్ని ప్రారంభించగా, అప్పటికీ సభ్యులు రాకపోవడంతో కోరం లేని కారణంగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ప్రకటించారు.

మోదీ చక్రవర్తి కాదు.. ప్రధాని

రాయ్‌బరేలీ, మే 31: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను తాను షహన్‌షా(చక్రవర్తి)గా భావించుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఆరోపించారు. తన లోక్‌సభ నియోజక వర్గం రాయ్‌బరేలీలో ఆమె విలేఖరులతో మాట్లాడారు. ‘ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ చూడలేదు. ఇక్కడ ప్రధానమంత్రి ఉంటారు.. చక్రవర్తి కాదు. ఆయన దేశానికి ప్రధానమంత్రి. దేశంలో తీవ్రమైన పేదరికం ఉంది. కరవు ఉంది.. రైతులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి ప్రదర్శనలు(ఎన్డీఏ సర్కారు రెండేళ్ల సంబరాలు) సరైనవని నేను భావించటం లేదు’ అని సోనియా వ్యాఖ్యానించారు.

Pages