S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టుకున్నవాడే కాలయముడు

కనిగిరి రూరల్, మే 31: కట్టుకున్నవాడే కాలయముడుగా మారాడు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య, ఇద్దరు కన్నబిడ్డలపై ఏమాత్రం మానవత్వం లేకుండా వారి మెడలకు తాడుతో ఉరి బిగించి చంపేశాడు. ఈ సంఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని చింతలపాలెంలో చోటుచేసుకుంది. స్థానిక సిఐ యు సుధాకర్‌రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలపాలెం గ్రామంలోని తమ్మినేని శ్రీనివాసరెడ్డికి గత కొనే్నళ్ల క్రితం మొదటి భార్య వెంకటలక్ష్మి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అనంతరం పదేళ్ల క్రితం ఆదిలక్ష్మి (28) అనే యువతితో వివాహమైంది. వీరికి గణేష్ (7), భవాని (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరం

సంగారెడ్డి, మే 31: బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కల్గించే విధంగా పోగ పీల్చడం చట్టరిత్యా నేరమని, ఇందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిమానా, శిక్షలు విధించే అవకాశం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అమర్ సింగ్ పేర్కొన్నారు. పపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఐబి నుంచి జిల్లా పరిషత్ వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. జిల్లా పరిషత్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైల్వే జోన్ ఖాయం: సోము వీర్రాజు

ఒంగోలు, మే 31: విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఎంఎల్‌సి సోము వీర్రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన ఒంగోలులో విలేఖర్లతో మాట్లాడుతూ 2014వ సంవత్సరం వరకు అధికారంలో ఉన్న పార్లమెంటు సభ్యుల అసమర్ధత వల్లే విశాఖకు రైల్వే జోన్ రాలేదన్నారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చేందుకు కొన్ని సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలను అధిగమించి జోన్ తెచ్చేందుకు కేంద్రం ముందుకు వెళ్తుందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుకు భారతరత్న ఇవ్వాల్సిందేనని అన్నారు.

దాహం తీర్చు పద్మక్కా..!

చిన్నశంకరంపేట, మే 31: మండల పరిధి దర్‌పల్లి గ్రామంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి గ్రామానికి రాగా గ్రామంలోని చౌరస్తాలో ఉపసభాపతి కాన్వాయిని 1వ వార్డు మహిళలు, గ్రామస్తులు ఖాళీ నీటి బిందెలతో అడ్డుకొని నిరసన తెలిపారు. అనంతరం 1వ వార్డులో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉందని గ్రామ సర్పంచ్ పాలకవర్గంకు పలుమార్లు తెలిపినప్పటికి పట్టించుకోకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని మహిళలు, గ్రామస్థులు తెలిపారు. అనంతరం గ్రామంలోని కసాన్‌చెరువు అభివృద్ధి పనులకు పద్మాదేవేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

జూన్ 16 నుండి ఆంధ్రా టెన్త్ అడ్వాన్స్ పరీక్షలు

హైదరాబాద్, మే 31: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 16వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల టైమ్‌టేబుల్‌ను రాష్ట్ర పరీక్షల బోర్డు మంగళవారం నాడు విడుదల చేసింది. పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.30 వరకూ జరుగుతాయని డైరెక్టర్ ఎం ఆర్ ప్రసన్నకుమార్ చెప్పారు.

ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు పాటించాల్సిందే

హైదరాబాద్, మే 31: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించడం ద్వారానే మరింత మెరుగైన విద్యను విద్యార్ధులకు అందించడం సాధ్యమవుతుందని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన సచివాలయంలో తన చాంబర్‌లో ఉన్నత విద్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలతోనే విద్యార్థులకు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్భ్రావృద్ధికి ఉన్నత విద్యారంగం అత్యంత కీలకమని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించగలమని అన్నారు.

నాణ్యమైన విద్య కోసమే.. ప్రైవేటు కళాశాలలపై కొరడా

రామాయంపేట, మే 31: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిపై కొరడా ఝలిపించడం జరుగుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యావ్యవస్థలో మా ర్పులు తేవడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ కళాశాలల ఫీజుల జులుంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే తెరాస ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు.

తీరంలో ప్రమాదాల నివారణకు కార్యాచరణ

విశాఖపట్నం, మే 31: తీరంలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. తీరంలో సందర్శకులు మృత్యువాత పడుతున్న సంఘటనలను నియంత్రించేందుకు వీలుగా పటిష్ఠమైన చర్యలు చేపట్టేందుకు పోలీస్, మెరైన్ పోలీస్, కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ, నౌకాదళం ప్రతినిధులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. గడచిన దశాబ్ద కాలంలో ఒక్క విశాఖ సాగరతీరంలో చోటుచేసుకున్న ప్రమాదాల్లో 465 మంది మృత్యువాత పడ్డారంటే ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. సందర్శకులను విశేషంగా ఆకర్షించే విశాఖ ఆర్‌కె బీచ్, రుషికొండ బీచ్‌ల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి

సిద్దిపేట అర్బన్, 31: ఇంటినంబర్ కోసం లంచం తీసుకుంటు ఏసిబి అధికాలకు రెడ్‌హ్యాండడ్‌గా చిక్కిన పంచాయతీ కార్యదర్శి ఉదంతం ఇది. మంగళవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ సూర్యనారాయణ విలేఖరులతో మాట్లాడారు. సిద్దిపేట మండలం తడ్కపల్లి పంచాయతీ కార్యదర్శి ఎస్. బాల్‌రాజ్ దండు శంకరయ్య ఇంటి నంబర్ కోసం 5వేలు లంచం డిమాండ్ చేయగా 4వేలకు ఒప్పందం చేసుకున్నాడు. గ్రామ హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించారు. తన భూమిలో పాఠశాల నిర్మించారని శంకరయ్య కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం శంకరయ్యకు తీర్పు అనుకూలంగా వచ్చింది.

పోర్టుల అభివృద్ధిపై జర్మనీ ఆసక్తి

హైదరాబాద్, మే 31: పోర్టుల అభివృద్ధికి విస్తృ త అవకాశాలు ఉన్నాయని, జర్మనీ సహా పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. ఐదు రోజుల పర్యటనకు జర్మనీ వెళ్లిన మంత్రి జర్మనీ హాంబర్గ్‌పోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోర్టు ఎండి హెన్నింగ్ కింగ్ హార్ట్స్, డెన్నిస్ కోగ్ బాన్, డేవిడ్ జాన్ తదితరులు సమావేశమయ్యారు. సన్‌రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ విశిష్టతను మంత్రి పోర్టు అధికారులకు వివరించారు.

Pages