S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానస సరోవర్‌లో యాత్రికులు సురక్షితం

మహబూబ్‌నగర్, మే 30: మానస సరోవర్ యాత్రకు వెళ్లి వాతావరణం అనుకూలించకపోవడంతో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. సోమవారం ఐదు హెలికాప్టర్లను నేపాల్ టూరిజం వారు సమకూర్చడంతో నేపాల్ ప్రభుత్వం సహయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. గంటసేపు వాతావరణం అనుకూలించడంతో ముందుగా ఐదు హెలిక్యాప్టర్ల ద్వారా మహిళలను చైనా, నేపాల్ సరిహద్దులోని హిల్సా నుండి సిమికోట్ ప్రాంతానికి తరలించారు. వారిలో 20 మంది తెలుగు మహిళలే ఉన్నారు. అందులో ఆరుగురు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శారద, అనితారెడ్డి, చేతన, శైలజతోపాటు మరో ఇద్దరున్నారు.

దూకుడు పెంచుతున్న తెలంగాణ బిజెపి

హైదరాబాద్, మే 30: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం పర్యటించి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ తెలంగాణ శాఖ నాయకులు దూకుడు పెంచారు. వచ్చే మూడేళ్ళలో తెలంగాణ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడి పని చేయాలని, బిజెపి అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదంటూ అమిత్ షా చేసిన ప్రసంగంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. దీంతో సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం కార్యకర్తల రాకతో సందడిగా మారింది. ఇలాఉండగా ఈ నెల 10న అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.

మళ్లీ కొలీజియం వేడి?

న్యూఢిల్లీ, మే 30: కొలీజియం వ్యవహారం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి, న్యాయస్థానానికి మధ్య సంఘర్షణకు దారితీసే అవకాశం ఉందా? జాతీయ ప్రయోజనాల పేరుతో తమ సిఫార్సులను తిరస్కరించేందుకు ప్రభుత్వానికి గల హక్కును సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కొలీజియం తన సిఫార్సులను పునరుద్ఘాటిస్తే..వాటిని ప్రభుత్వం తప్పసరిగా పాటించాలన్న నిబంధన ఉందని, అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల పేరుతో ఈ సిఫార్సులను ఎలా తిరస్కరిస్తారని తెలిపింది. దీనితో పాటు మరో క్లాజుపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుప్రీం కోర్టు, 24హైకోర్టుల న్యాయ మూర్తులకు నియామకానికి సంబంధించిన నియమావళిని (ఎమ్‌ఓపి) వెనక్కి పంపింది.

ముందుకు సాగని రుతుపవనాలు

హైదరాబాద్, మే 30 : నైరుతి రుతుపవనాలు అనుకున్న ప్రకారం ముందుకు సాగడం లేదు. కేరళ తీరాన్ని ఇవి మే 7 న తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి జూన్ 15 న లేదా ఆ తర్వాత వచ్చే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా గత నాలుగు రోజుల నుండి అరేబియా సముద్రంలోనే రుతుపవనాలు తిష్టవేసి ఉన్నాయి. నైరుతీ రుతుపవనాల కారణంగా అండమాన్, నికోబార్ ద్వీపాల్లో గత నాలుగైదు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

కొత్తదనంలో భారతీయులది కీలకపాత్ర

న్యూఢిల్లీ, మే 30: ఏ రంగంలోనైనా కొత్తదనంలో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారని గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల అన్నారు. భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఆలోచనాపరంగా సత్తాను చాటుతున్నారని పేర్కొన్నారు. ఒకరోజు భారత పర్యటనలో భాగంగా సోమవారం ఇక్కడకు చేరుకున్న నాదెళ్ల.. తమ సంస్థ నిర్వహించిన ‘టెక్ ఫర్ గుడ్, ఐడియాస్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన ఆయన డిజిటల్ ఇండియా తదితర కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు మైక్రోసాఫ్ట్ సహకారంపై, దేశ ఐటి రంగంపై చర్చించారు.

స్టార్టప్‌లకు ట్యాక్స్ హాలిడే పెంచాలి

న్యూఢిల్లీ, మే 30: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లకు ప్రస్తుతమిస్తున్న మూడేళ్ల ట్యాక్స్ హాలిడేను ఏడేళ్లకు పెంచాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నా రు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తప్పక ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఇక్కడ తన మంత్రిత్వ శాఖ గడచిన రెండేళ్లలో సాధించిన విజయాలను ఆమె విలేఖరులకు వెల్లడించారు. ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ అంకుర సంస్థల (స్టార్టప్)కు ప్రస్తుతం ఇస్తున్న పన్ను మినహాయింపు కాలవ్యవధిని మరో నాలుగేళ్లు పెంచి మూడేళ్ల నుంచి ఏడేళ్లకు చేర్చాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేసినట్లు చెప్పారు.

జీడిపప్పు ధరలు పరుగో.. పరుగు

పలాస, మే 30: అసలు బంగారంతో తెల్లబంగారంగా పిలిచే జీడిపప్పు ధరలు పోటీ పడుతుండడంతో వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జీడిపప్పుకు కేరాఫ్ అడ్రస్‌గా పలాసను చెప్పుకోవచ్చు. పలాస కేంద్రంగా జీడి పరిశ్రమలు ఏర్పడి 100 ఏళ్లు అవుతున్నా ఈ ఏడాదిలాంటి పరిణామాలు గతంలో ఎన్నడూ ఎదురు కాలేదని జీడి పరిశ్రమల యజమానులు అంటున్నారు. దేశీయంగా జీడి పిక్కల దిగుబడి తగ్గిపోవడంతోపాటు విదేశీ పిక్కలకు డిమాండ్ పెరగడం, డాలర్ రేటు కూడా పెరగడం.. జీడిపప్పు ధరలు పెరగడానికి కారణమని జీడి వ్యాపారులు చెబుతున్నారు. జీడిపప్పును దేశంలో కేరళ తర్వాత ఎక్కువగా ఉత్పత్తి చేసే కేంద్రం పలాస.

ప్రపంచ వృద్ధి చోదకశక్తి భారత్

టోక్యో, మే 30: ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంపై సర్వత్రా ఆందోళనల మధ్య వచ్చే పదేళ్లకుగాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ చోదకశక్తిగా వ్యవహరించనుందని సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టంగ్ అన్నారు. ‘ప్రపంచ దేశాల ఆశలన్నీ భారత్‌పైనే. పదేళ్ల క్రితం చైనా మాదిరిగానే ఇప్పుడు భారత్ కనిపిస్తోంది. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉన్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకశక్తి ఇక భారతే.’ అని జపాన్ స్టాక్ మార్కెట్ నికీ నిర్వహించిన ఆసియా భవిష్యత్ సదస్సులో పాల్గొన్న టంగ్ అభిప్రాయపడ్డారు.

వృద్ధిరేటు 7.7 శాతం

న్యూఢిల్లీ, మే 30: దేశ జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) లో 7.7 శాతంగా ఉండొచ్చని భారత పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసింది. ఈసారి వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాల మధ్య పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో పురోగతి ఉంటుందని పేర్కొంది. అయితే మందగించిన పెట్టుబడుల ప్రవాహం తిరిగి పుంజుకోవడానికి కనీసం మరో ఆరు నెలల సమయమైనా పడుతుందని ఓ సర్వేలో ఫిక్కీ అభిప్రాయపడింది. ‘ఈ ఆర్థిక సంవత్సరం పారిశ్రామిక, వ్యవసాయ రంగాల మద్దతుతోనే దేశ జిడిపి వృద్ధిపథంలో నడుస్తుంది.

ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 7.8 శాతం

ముంబయి, మే 30: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.8 శాతం వృద్ధిరేటును నమోదు చేయవచ్చని స్విట్జర్లాండ్ ఆర్థిక సేవల దిగ్గజం క్రెడిట్ సూస్ అంచనా వేసింది. వ్యవసాయం, వినియోగం విషయంలో పురోగతి కనిపిస్తుందని ఓ నివేదికలో పేర్కొంది. అయితే ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్) కంటే, ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో జిడిపి వృద్ధి పుంజుకోవడానికి అవకాశాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 7.5 శాతంగా ఉన్న దేశ జిడిపి వృద్ధిరేటు.. ఈ ఆర్థిక సంవత్సరం 7.8 శాతానికి పెరగవచ్చని అభిప్రాయపడింది. కాగా, కార్పొరేట్ పెట్టుబడులు, ఎగుమతుల్లో మందగమనం కొనసాగవచ్చంది.

Pages