S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ క్వార్టర్స్‌కు ముర్రే

పారిస్, మే 30: బ్రిటన్ ఆశా కిరణం, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే ఫ్రెండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. 33 ఏళ్ల ముర్రే ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన జాన్ ఇస్నర్‌ను 7-6, 6-4, 6-3 తేడాతో ఓడించి, కెరీర్‌లో ఆరోసారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. సెమీస్‌లో స్థానం కోసం అతను రిచర్డ్ గాస్క్వెట్‌తో తలపడతాడు. మరో ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో గాస్క్వెట్ 6-4, 6-2, 4-6, 6-2 స్కోరుతో ఐదో సీడ్, జపాన్ హీరో కెయ్ నిషికొరీని ఓడించాడు. స్థానికుడైన గాస్క్వెట్‌కు అభిమానుల మద్దతు లభించడం అదనపు బలాన్నిస్తోంది.

వర్షంతో మ్యాచ్‌లు రద్దు

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌ను వర్షం వెంటాడింది. దాదాపుగా ప్రతిరోజూ వర్షం కారణంగా పలు మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడుతునే ఉంది. అయితే, సోమవారం జరగాల్సిన మ్యాచ్‌లన్నీ వర్షం వల్ల రద్దు కావడం విశేషం. 2000లో చివరిసారి ఈ విధంగా ఒక రోజులో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. 16 ఏళ్ల తర్వాత మొదటిసారి మరోసారి అదే పరిస్థితి పునరావృతమైంది. ఇలావుంటే, వర్షం వల్ల మ్యాచ్‌లను వాయిదా వేస్తున్న నిర్వాహకులు, సకాలంలో టోర్నీ పూర్తవుతుందా లేదా అని భయపడుతున్నారు. వర్షం తగ్గిన వెంటనే విరామం లేకుండా మ్యాచ్‌లను పూర్తి చేయించే ప్రయత్నంలో పడ్డారు.

జేమ్స్ ఆండర్సన్ ‘సాన్‌టినా’ నిష్క్రమణ

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ నుంచి సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ నిష్క్రమించింది. మూడో రౌండ్‌లో బార్బొరా క్రెజిసికొవా, కాతెరీన సింజకొవా జోడీతో తలపడిన వీరు 3-6, 2-6 తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ సీజన్‌లో మరో టైటిల్‌పై కనే్నసిన ‘సాన్‌టినా’ జోడీ క్వార్టర్ ఫైనల్స్ చేరకుండానే ఓటమిపాలుకావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. కాగా, సానియా పోరాటం మిక్స్‌డ్ డబుల్స్‌లో కొనసాగుతుంది. ఇవాన్ డోడింగ్‌తో కలిసి ఈ విభాగంలో పోటీపడుతున్న ఆమె రెండో రౌండ్‌లో ఎలిజా కార్నెట్, జొనథాన్ ఎసెరిక్ జోడీతో తలపడనుంది.

లంకకు ఆండర్సన్ చెక్

చెస్టర్ లీ స్ట్రీట్, మే 30: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టును తొమ్మిది వికెట్ల తేడాతో గెల్చుకున్న ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన జేమ్స్ ఆండర్సన్ రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్లు కూల్చి లంకను దారుణంగా దెబ్బతీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్లకు 498 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యా టింగ్‌కు దిగిన శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 475 పరుగులు సాధించి, ఇంగ్లాండ్ ముందు 79 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

క్రికెట్ సంఘాలకు ఎసిఎ ఆదర్శం

విజయవాడ (స్పోర్ట్స్), మే 30: దేశంలోని అన్ని క్రికెట్ సంఘాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) ఆదర్శమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నూతన అధ్యక్షుడు, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. సోమవారం కృష్ణాజిల్లాలోని మూలపాడులో ఎసిఎ కెడిసిఎ క్రికెట్ సెంటర్‌ను, మంగళగిరిలోని ఎసిఎ ఇండోర్ క్రికెట్ నెట్స్ అకాడమీని ప్రారంభించిన ఠాకూర్ అక్కడి క్రికెటర్లతో కొద్దిసేపు క్రికెట్ ఆడాడు. గతంలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ బ్యాటింగ్ చేసి రెండు మైదానాలను ప్రారంభించాడు.

బాంబు దాడులతో దద్దరిల్లిన ఇరాక్

బాగ్దాద్, మే 30: ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో గల వాణిజ్య స్థలాలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సోమవారం జరిపిన బాంబు దాడుల్లో 24 మంది మృతి చెందారు. 48 మంది గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్‌లో షియాల ప్రాబల్యం గల ఒక వాణిజ్య ప్రాంతంలోని ఒక చెక్‌పాయింట్‌లోకి ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన కారుతో దూసుకెళ్లాడు. ఈ పేలుళ్లలో ఎనిమిది మంది పౌరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని, 14 మంది గాయపడ్డారని ఒక పోలీసు అధికారి చెప్పారు. తర్మియా పట్టణంలోని మార్కెట్‌లోకి మరో కారుబాంబర్ దూసుకెళ్లడంతో ఏడుగురు పౌరులు, ముగ్గురు పోలీసులు మృతి చెందారు.

‘హోదా’ తేలేక పారిపోయారు

న్యూఢిల్లీ, మే 30: ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదానుండి తప్పించుకునేందుకే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రాజస్తాన్‌కు పారిపోయారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఆదివారం జరిగిన సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశానికి వచ్చిన నారాయణ సోమవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు. ‘రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పదు’ అన్నట్లు ప్రత్యేక హోదా వెంకయ్యను వెంటాడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని మహానాడులో చేసే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేకుండాపోయిందని దుయ్యబట్టారు.

వాద్రాకు గిఫ్టుగా లండన్‌లో ఫ్లాట్!

న్యూఢిల్లీ, మే 30: ఓ ఆయుధ డీలర్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు గిఫ్టుగా లండన్‌లో ఫ్లాట్ దక్కిందన్న కథనాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఓ ఆంగ్ల వార్తా సంస్థలో వచ్చిన కథనాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ దృష్టి సారించింది. 2009లో రాబర్ట్‌వాద్రాకు లండన్‌లో బినామీ పేరుతో ఫ్లాట్ దక్కినట్టు చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించపనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆదాయపన్ను అధికారులు నిమగ్నమై ఉన్నారు. వాద్రాకు గిఫ్టు ఇచ్చినట్టు ఆరోపణలున్న మనోజ్ అరోరా మధ్య జరిగిన ఇమెయిల్స్‌పై విచారణ జరపనున్నారు.

ఆఫ్రికన్ల భద్రత మా ప్రాధాన్యం

న్యూఢిల్లీ. మే 30: దేశంలో ఆఫ్రికన్లపై వరుస దాడుల నేపథ్యంలో వారిలో నమ్మకం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆఫ్రికన్ల భద్రత, సురక్ష తమ ప్రధాన విధానమని విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ అన్నారు. కాంగో జాతీయుడి హత్య, ఆఫ్రికన్లపై కేసుల నమోదు నేపథ్యంలో జయశంకర్ సోమవారం ఆఫ్రికన్ విద్యార్థుల బృందాన్ని కలిసి చర్చించారు. ఆఫ్రికన్లకు రక్షణ కల్పించటం తమ విధానమని జయశంకర్ వారికి హామీ ఇచ్చారంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. జయశంకర్‌తో సమావేశం సందర్భంగా ఆఫ్రికన్ విద్యార్థులు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను ఆయనతో ప్రస్తావించారు.

దుమారం రేపిన వీడియో

ముంబయి, మే 30: ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్‌తోపాటు క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌ను అనుకరి స్తూ హాస్య నటుడు తన్మయి భట్ రూపొందించిన వీడియోపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో తన్మయి భట్‌పై ఫిర్యాదు దాఖలవడంతో ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై శివసేన, బిజెపి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, తన్మయి భట్‌తోపాటు ఎఐబి అనే ఆన్‌లైన్ కామెడీ గ్రూపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా యి.

Pages