S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు

వికారాబాద్, మే 30: గత ప్రభుత్వాల అభివృద్ధి పనులు మొక్కుబడిగా చేపట్టగా, తమ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేపడుతోందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పుల్సుమామిడి గ్రామ సమీపంలో, పట్టణంలోని శివారెడ్డిపేట ఫిల్టర్‌బెడ్ వద్ద మిషన్ భగీరథ వాటర్‌గ్రిడ్‌కు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చెరువు పూడికతీత పనులకు గత ప్రభుత్వాలు ఐదు నుండి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేవని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని 46 వేల చెరువుల పనరుద్దరణకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెప్పారు.

నేడు హనుమజ్జయంతి

పవన తనయుడు హనుమంతుడి జయంతి నేడు. జంటనగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పండుగ ఏర్పాట్లతో హనుమంతుడి దేవాలయాలు కళకళలాడుతున్నాయ.

గువ్వ గూడు!

సొట్టబుగ్గల చిన్నదానికి ఇళ్ల పిచ్చి పట్టుకుంది. ఒక్కో మూడ్‌లో ఒక్కోలా ఉంటాం. ఆ మూడ్‌కు అనుకూలమైన అందమైన ఇల్లొకటుంటే భలే ఉంటుంది కదూ! అన్నది తాప్సీ పొన్ను ఆలోచన, ఆశ కూడా. తెలుగులో ప్రాజెక్టులు కరవవ్వడంతో -ముంబయిలో వాలిన తాప్సీ అక్కడో ఫ్లాట్ సెట్ చేసుకుంది. బిజీ లైఫ్ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే -ముంబయిలోనే ఉండాలని ఫీలైంది. అప్పుడప్పుడూ బిజీ లైఫ్ కూడా బోర్ కొడుతుంది. కొద్దిరోజులు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. ఆ ప్రశాంతతను అందించే బ్యూటిఫుల్ గూడుంటే బావుండు అనుకుంది. అందుకే -గోవాలో ఇల్లు సెట్ చేసుకోవావాలని చూస్తోందట. అంతులేని కడలిని చూస్తూ కూర్చుంటే -దానిముందు మన పని ఒత్తిడి ఎంత అనిపిస్తుంది.

‘వి’రామకృష్ణుడు! ..శరత్కాలం

పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలు మస్తిష్కంలో మెదిలినపుడు -మహానటుడు ఎన్టీఆర్ ఒక్కరే గుర్తుకురావొచ్చు. కానీ, అలాంటి పాత్రలను తమదైన శైలిలో పోషించి మెప్పించిన నటులూ పాతతరాన్ని పరికించి చూస్తే అక్కడక్కడా మనకు కనిపిస్తారు. సాంఘిక చిత్రాలలో ప్రధాన పాత్రలలో నటిస్తూ పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో దొరికిన అవకాశాలను వినియోగించుకుని రాణించిన వాళ్లలో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కృష్ణుడు కూడా తక్కువేమీ కాదు. నిజానికి ఇలాంటి పాత్రలు పోషించాలంటే ఆహార్యం ఒక్కటే సరిపోదు, అంతకుమించి అనుభవం, నటనా ప్రతిభను కూడా జతచేయాలి.

-పర్చా శరత్‌కుమార్ 9849601717

ఫ్యానే్స నిజమైన హీరోలు!

పాలు.. పండ్లు.. పువ్వులు సినిమాలో హీరోయిన్ కోసం, అవసరమైతే సినిమా హాలు బయట హీరోగారి పూజకోసం అవసరం. ‘అభిమాని లేనిదే హీరోలు లేరులే!’ అన్న గీత రచయిత భావం అక్షరసత్యం. ఇదేమి బంధమో తెలియదుకానీ సినిమాకు మాత్రం వీరే బలం. కలెక్షన్ల వాటాలో వీరిదే అగ్రతాంబూలం. ఒకప్పుడు అభిమానులకు దూరంగా ఏ సినిమా ఫంక్షనైనా జరిగేది. ఇప్పుడు అభిమానుల సమక్షంలోనే జరుగుతోంది. పైగా వంశాభిమానులుగా అభిమానులు తమ హీరోల నోట కొనియాడబడటం విశేషం!

-బాసు

డైరెక్టర్స్ ఛాయిస్..

-అనిల్ రావిపూడి

తెలుగులో దర్శకుడిగా తొలి ‘పటాస్’ పేల్చి మంచి విజయాన్ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకుని, వెంటనే మరో ఛాన్స్ దక్కించుకున్నాడు. మెగా మేనల్లుడు సాయిధరమ్‌తో సుప్రీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్‌తో చిట్‌చాట్...

ద్వితీయ విఘ్నం దాటేసినట్టున్నారు?
-ఔను. రెండో సినిమా కూడా మంచి విజయం సాధించడం ఆనందంగా వుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌కే
ప్రాధాన్యత ఇస్తున్నారు?
-ఇప్పుడు ప్రేక్షకులకి ఈ తరహా సినిమాలే నచ్చుతున్నాయి కదా.

-శ్రీ

నాకు నచ్చిన పాట--మూగమనసులు

1964లో బాబూ మూవీస్ ‘మూగ మనసులు’ విడుదల అయింది. ఆదుర్తి సుబ్బారావుగారి దర్శకత్వంలో నాగేశ్వరరావు, సావిత్రి, జమున, సూర్యకాంతం, గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం మొదలైన వారితో నిర్మించబడి అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రమిది. మూడు జన్మల మరపురాని కావ్యంగా నిర్మించబడిన చిత్రంలో ‘పాడుతా తీయగా..’ గీతాన్ని ఘంటసాల పాడగా కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. సావిత్రి పాత్ర ఉన్న జమిందారీ కుటుంబానికి పడవ నడిపేవాడు కథానాయకుడైన నాగేశ్వరరావు. సావిత్రి భర్తగా నటించిన నటుడు పద్మనాభం. అతడు మరణించి సావిత్రి విధవరాలు అవుతుంది. ఆమెను ఓదార్చడానికి వచ్చిన నాగేశ్వరరావు పాత్ర పాడే పాటే ఇది.

- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

నాకు నచ్చిన సినిమా..మంగమ్మ శపథం

1965లో విడుదలైన డి.వి.ఎస్ ప్రొడక్షన్ పతాకంపై డి.వి.ఎస్.రాజు, ప్రముఖ దర్శకుడు విఠలాచార్య దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఆ దేశపు రాజు స్ర్తిలను మోహిస్తూ అనుభవించి వదిలివేస్తూ వినోదిస్తాడు. ఒకసారి గ్రామీణ యువతి మంగమ్మను మోహించి బలవంతం చేయబోగా ధైర్యసాహసాలతో అడ్డుకుంటుంది.

- ఎస్.ఎస్.శాస్ర్తీ, విశాఖపట్నం

చితక్కొట్టేశాడు!!

బాగోలేదు.. రాయుడు

**
తారాగణం: విశాల్, శ్రీదివ్య, రాధారవి, సూరి, కులాపుల్లి లీల,
ఆర్కే సురేష్ తదితరులు
సంగీతం: డి.ఇమాన్
మాటలు: శశాంక్ వెనె్నలకంటి
నిర్మాత: బి.హరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముత్తయ్య
**

-ప్రనీల్

Pages