S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపిలో తిరగాలంటే వీసా కావాలా?

జగ్గయ్యపేట రూరల్, మే 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగాలంటే వీసా కావాలా ఇదేమన్నా పాకిస్తానా, పరాయి దేశమా అని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు బయలుదేరిన ఆయనను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా సరిహద్దు గరికపాడు వరకూ పోలీస్ వాహనంలో తీసుకువచ్చి సరిహద్దు దాటించారు. ఈ సందర్భంగా కృష్ణ మాదిగ విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.

చైతన్య స్ఫూర్తితో ‘నవ నిర్మాణ దీక్ష’

మచిలీపట్నం, మే 30: నవ చైతన్య స్ఫూర్తిని కల్పించే విధంగా జూన్ 2న రాజధాని నగరమైన విజయవాడ బెంజ్ సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నవ చైతన్యాన్ని సమాజానికి అందించాలన్న దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోరారు. 2న నవ నిర్మాణ దీక్షతో పాటు ఏడు రోజుల పాటు వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టామన్నారు. 8న భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.

ధనుంజయ హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

మచిలీపట్నం (లీగల్), మే 30: అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత దిడ్ల ధనుంజయ హత్య కేసులో ఐదుగురి నిందితులకు జీవిత ఖైదు, రూ.2వేలు జరిమానా విధిస్తూ పదవ అదనపు జిల్లా జడ్జి జి స్వర్ణలత సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం పులిగడ్డ గ్రామానికి చెందిన దిడ్ల ధనుంజయను విజయ భాస్కర కో-ఆపరేటీవ్, కనెక్టవెటీ ఫ్రెషింగ్ సొసైటీ భూముల వివాదమై 2009 జూలై 7న అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు ఇనుపరాడ్లతో కొట్టి చంపారు. దీనిపై అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

దోమతోటి హత్య కేసులో మరో ముగ్గురి అరెస్టు

తిరువూరు, మే 30: అక్కపాలెం సర్పంచ్ దోమతోటి వెంకటరమణ భర్త నాగేశ్వరరావు హత్య కేసులో పోలీసులు సోమవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ నెల 17న నాగేశ్వరరావు అక్కపాలెంలోని వాటర్ ట్యాంక్ వద్ద దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నమోదు చేసిన కేసులో నలుగురు ముద్దాయిల్లో ఈ నెల 22న ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముద్దాయి శివశంకరరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నందున అతను కోలుకున్న తర్వాత అరెస్టు చేస్తామని ఎస్సీ, ఎస్‌టి డిఎస్‌పి హరిరాజేంద్రబాబు చెప్పారు.

నేడు ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన

గన్నవరం, మే 30: ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మంగళవారం గన్నవరం, బాపులపాడు మండలాల్లో ఉదయం 9.30 గంటలకు పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈపోస్ పద్ధతిలో రైతులకు ఎరువులు పంపిణీపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. గన్నవరం వ్యవసాయ సహకార పరపతి సంఘంతో ఈ పోస్ విధానం అమలు తీరును ఈ బృందం పరిశీలిస్తుంది. బాపులపాడు మండలం ఓగిరాల, ఆరుగొలను గ్రామాల్లో ఈపోస్ అమలు తీరును పరిశీలిస్తారు.

ఎమ్మెల్యే కాగితకు స్వల్ప అస్వస్థత

పెడన, మే 30: స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు స్వల్ప అస్వస్థతకు గురై సోమవారం ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో పాల్గొన్న ఆయన ఆదివారం బిపి, షుగర్ ఎక్కువ కావటంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో తిరుపతిలోని స్విమ్స్‌లో ఆయనను చేర్చారు. కోలుకోవటంతో ఆయన డిశ్చార్చి అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం కాగిత నియోజకవర్గానికి రానున్నారు.

చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ‘కొల్లు’

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 30: సిఎం సహాయ నిధి కింద ఆరుగురికి రూ.2.57 లక్షలు ఆర్థిక సాయాన్ని సోమవారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అందజేశారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వివిధ అనారోగ్యాలతో బాధ పడుతున్న వారికి మెరుగైన వైద్యం నిమిత్తం సిఎం సహాయ నిధి నుండి ఈ ఆర్థిక సాయం అందచేసినట్లు మంత్రి తెలిపారు.

ఎండ దెబ్బకు తగ్గిన మీకోసం అర్జీలు

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 30: ఎండ వేడిమి అధికంగా ఉండటంతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి అర్జీదారుల సంఖ్య తగ్గింది. జాయింటు కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రంగయ్య మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుండి వారం రోజులు పాటు జరగనున్న నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాల సందర్భంగా అధికారులకు విధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. జూన్ 2వ తేదీ ఉదయం 8 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలతో ప్రతిజ్ఞ చేస్తారని తెలిపారు.

200 ఎంబిబిఎస్ సీట్లు కోల్పోవడం ప్రభుత్వ వైఫల్యమే

విజయవాడ, మే 30: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పలుమార్లు లోటుపాట్లు సవరించుకోవాలని సూచన చేస్తూ హెచ్చరించినా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన 200 ఎంబిబిఎస్ సీట్లు కోల్పోవడంతో 200 మంది విద్యార్థులు డాక్టర్లు అవ్వాలనే కలలను ప్రభుత్వం చిదిమేసిందని ఎపి కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్ కో చైర్మన్ డా అంబటి నాగ రాధాకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రికి ప్రైవేటు మెడికల్ కాలేజ్ మేనేజ్‌మెంట్లపై ఉన్న ప్రేమ గవర్నమెంట్ కాలేజీలపై లేకపోవడం దురదృష్టకరమన్నారు.

హనుమత్‌దీక్షలతో స్వామివారి కటాక్షం

పాతబస్తీ, మే 30: సర్వశక్తి సంపన్నుడు లోక రక్షకుడైన హనుమంతుని దీక్షలను భక్తిశ్రద్ధలతో అవలంభించిన వారు ఆ పరమాత్ముని కటాక్షం పొందుతారని శ్రీ హనుమత్‌దీక్షాపీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ప్రవచించారు. హనుమత్‌దీక్షల విరమణ కార్యక్రమంలో భాగంగా రెండోరోజైన సోమవారం పాలఫ్యాక్టరీ ఎదురుగా నున్న హనుమత్‌దీక్షపీఠంలో పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా వేలాది మంది దీక్ష విరమణ చేశారు.

Pages