S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

05/05/2016 - 06:35

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో మే నెల ఒకటవ తేదీన ఇద్దరు శ్రమజీవులు పారిశుద్ధ్య గవాక్షంలో చిక్కుకుని అకాల మృత్యువు పాలు కావడం పాలనా యంత్రాంగం వారి నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ! ఇది విస్తృత హైదరాబాద్ మహానగర పాలిక-జిహెచ్‌ఎంసి-వారి నిర్లక్ష్యం.

05/04/2016 - 06:57

ఇటలీకి చెందిన హంతక నావికులకు అనుకూలంగా ఐక్యరాజ్యసమితి ‘మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయ మండలి’ - పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ - మధ్యంతర నిర్ణయాన్ని ప్రకటించడం ఆశ్చర్యకరం కాదు. ఐరోపా దేశాల దురహంకార పూరితమైన దౌత్య దౌర్జన్యం ఈ వ్యవహారంలో మొదటినుంచీ కొనసాగుతుండడం ఇందుకు మొదటి కారణం. మన కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపరమైన విధానం రెండవ కారణం!

05/03/2016 - 00:32

దేశవ్యతిరేక విచ్ఛిన్న వాదులపై మన ప్రభుత్వం జరుపుతున్న పోరాటం కథ మళ్లీ మొదటికి వచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో దేశ విద్రోహ కలాపాలకు నాయకత్వం వహిస్తున్న హురియత్ ముఠాలవారు ఏ దేశపు ప్రతినిధులతోనైనా చర్చలు జరపడంపై ఎలాంటి నిషేధం లేదని కేంద్ర ప్రభుత్వం, స్పష్టం చేయడం కథ మొదటికి వచ్చిందనడానికి సాక్ష్యం.

05/02/2016 - 04:16

అవినీతికి ఆకాశమెత్తు ప్రతీక అయిన అంతస్థుల ఆదర్శ భవనాన్ని కూలగొట్టాలని కేంద్ర ప్రభుత్వానికి బొంబాయి హైకోర్టు ఉత్తరువులు జారీ చేయడం సందర్భోచిత పరిణామం. రక్షణ రంగాన్ని అగస్టా వెస్ట్‌లాండ్ గగన శకటాల అవినీతి కుదుపుతున్న సమయం లో ముంబయి ఉన్నత న్యాయస్థానం శుక్రవారం చెప్పిన తీర్పు సరికొత్త ప్రకంపనం..ఆదర్శ భవన సముదాయం రక్షణ రంగంలో పెరిగిన మరో అవినీతి పుట్ట!

04/29/2016 - 23:38

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలోని ‘కెబిఆర్’ పార్కు ప్రాంగణంలోని దాదాపు రెండువందల డెబ్బయి పచ్చని చెట్లను పరిమార్చడానికి రంగం సిద్ధం కావడం ప్రతీక మాత్రమే. విస్తృత హైదరాబాద్ మహానగర పాలిక-జిహెచ్‌ఎంసి-వారు ఆర్భాటంగా అమలు జరుపున్న వ్యూహాత్మక పథ ప్రగతి ప్రణాళిక-ఎస్‌ఆర్‌టిసి-కు దాదాపు మూడువేల వంద మహావృక్షాలు బలి కానుండడం పెద్దగా ప్రచారానికి నోచని వైపరీత్యం.

04/28/2016 - 23:37

భారత్‌లో నిర్మించండి-అన్న స్ఫూర్తి మేధా సంపత్తి హక్కుల వ్యవస్థకు భంగం కారాదని అమెరికా ప్రభుత్వం ఉచిత సలహానిస్తోంది. మన అంతర్గత వ్యవహారాలలో అమెరికా ప్రభుత్వం వారు అక్రమ ప్రమేయం కల్పించుకొనడం దశాబ్దుల చరిత్ర. ఈ అక్రమమైన జోక్యానికి ఇప్పుడు అమెరికా విడుదల వార్షిక వాణిజ్య ప్రత్యేక నివేదికలో మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి.

04/28/2016 - 00:32

రాజ్యసభ సభ్యుడుగా నియుక్తుడైన మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టడం, మరో అవినీతి వ్యతిరేక రాజకీయ ప్రభంజనం మొదలు కావడం సమాంతర పరిణామాలు.

04/26/2016 - 23:42

డాల్కన్ ఈశ అనే ఉయిఘర్ ఉద్యమనాయకుడికి ప్రవేశ అనుమతి పత్రాన్ని నిరాకరించడం ద్వారా మన ప్రభుత్వం మరోసారి చైనా ప్రభుత్వానికి గౌరవం ఘటించింది. మనదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారు ప్రవేశ అనుమతి-వీసా-ని జారీ చేశారు. మరుసటి రోజున విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారు వీసాను రద్దు చేశారు.

04/25/2016 - 23:41

న్యాయం చేయవలసిన వారు న్యాయం కోరుతుండడం విచిత్రమైన రాజ్యాంగ విషాదం. ఈ విషాద ఘట్టాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి తీర్థసింగ్ ఠాకూర్ ఆదివారం న్యూఢిల్లీలో సజల నయనాలతో స్వయంగా సమావిష్కరించడం ఎవ్వరూ ఊహించని విపరిణామం. న్యాయ వ్యవస్థకు న్యాయం కలిగించవలసిందిగా ఈ రాజ్యాంగపు విభాగపు సర్వోన్నత ప్రతినిధి రుద్ధ కంఠంతో విజ్ఞప్తి చేయడం తిలకించిన వారిని బహుశా దిగ్భ్రాంతికి గురి చేసి ఉంటుంది.

04/25/2016 - 07:02

రహదారులకు ఆకుపచ్చని అందాలను సంతరించి పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం శ్లాఘనీయం. గత ఏడాది సెప్టెంబర్‌లో హరిత మహాపథ విధానం-గ్రీన్‌వే పాలసీ-ఆవిష్కరించిన ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ఆరువేల కిలోమీటర్ల ఆకుపచ్చని బాటలను ఏర్పాటు చేయనున్నట్టు కూడ ప్రకటించింది. జాతీయ మహా పథాలకు ఇరువైపులా చెట్లను నాటడం ఈ హరిత విధానంలో భాగం!

Pages