S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

08/22/2017 - 00:35

తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వ మ్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అధకార ‘అఖిల భారత అన్నా ద్రవిడ మునే్నత్ర కజగం’-అభాఅద్రముక-లో కొనసాగుతున్న సయోధ్య ప్రక్రియకు పరాకాష్ఠ. గత ఫిబ్రవరిలో రెండు వర్గాలుగా విడిపోయిన ‘అన్నాకజగం’లో ఈ సయోధ్య ప్రక్రియ గత ఏప్రిల్ నుంచి కొనసాగుతోంది.

08/21/2017 - 02:37

జాతీయ ప్రజాస్వామ్య సంఘటన-నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్-ఎన్‌డిఏ-లో ‘ఐక్య జనతాదళ్’-జనతాదళ్ యునైటెడ్-‘ఐజద’-పునఃప్రవేశించడం నకిలీ ‘సర్వమత సమభావ’ వాదులకు మరో చెంపపెట్టు! ‘సంయుక్త సంస్కృతి’ ప్రచారకులకు బిహార్‌లో మరో ఎదురు దెబ్బ తగలడం శనివారం నాటి పరిణామం!

08/19/2017 - 00:17

ఆటలే ప్రాణాంతకమవుతున్నాయి. వినోదాన్ని అందించిన క్రీడలే మృత్యు శకటాలుగా మారుతున్నాయి. నిన్న ‘పోకోమెన్’ ప్రపంచ దేశాల్ని ఎంతగా పరుగులు పెట్టించిందో.. నేడు అంతకు మించిన స్థాయిలో మరో క్రీడ పిల్లల్ని మృత్యుకుహరాల్లోకి నెట్టేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపోర్ జిల్లాలో పదిహేనేళ్ల కుర్రాడు అంకన్ దేవ్ ముఖానికి ప్లాస్టిక్ కవరు చుట్టుకుని ఊపిరి ఆడకుండా చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

08/18/2017 - 00:29

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దా టినా వైద్య సేవలన్నవి అందని మావి చందంగానే ఇప్పటికీ కొనసాగడం విచారకరం. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవదాస్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇటీవల జరిగిన చిన్నారుల మృతి సంఘటన గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో కళ్లకు కట్టింది. దేశ జనాభాలో మెజారిటీ భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారన్నది వాస్తవం.

08/17/2017 - 01:01

చైనానుంచి దిగుమతి అవుతున్న ‘సమాచార సాంకేతిక’ వస్తు సామగ్రిని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట! విస్తరిస్తున్న చైనా భౌ తిక దురాక్రమణ వ్యూహం మన ప్రభుత్వ ‘్భవన’కు విచిత్ర నేపథ్యం! చైనానుండి దిగుమతులను చేసుకోరాదన్న జ్ఞానోదయం మన ప్రభుత్వానికి దశాబ్దుల క్రితం కలిగి ఉండాలి. ‘కలుగకపోవడం’ జాతీయ మహాపరాధం! ఈ మహాపరాధం కారణంగానే మన దేశంలో చైనా వాణిజ్య సామ్రాజ్యం విస్తరించిపోయింది.

08/15/2017 - 23:27

సుదర్శన చక్రాన్ని ధరించిన ‘మోహనుని’ నుండి నూలు వడికే చక్రం ధరించిన ‘మోహనుని’ వరకు గల మహనీయులు ప్రస్ఫుటింప చేసిన స్ఫూర్తి స్వతంత్ర భారతదేశానికి భవిష్యత్ మార్గదర్శకమన్నది ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బయి ఒకటవ స్వాతంత్య్ర దినోత్సవ సభా వేదికపై పునరుద్ఘాటించిన చారిత్రక వాస్తవం. ఈ పునరుద్ఘాటన మరో నూతన చరిత్రకు శ్రీకారం అన్నది ఆయన ప్రసంగంలోని ఇతివృత్తం.

08/15/2017 - 00:45

సనాతన భరత జాతి మళ్లీ స్వతంత్ర జాతిగా అవతరించిన తరువాత డెబ్బయి వర్షాలు గడిచా యి. వైయక్తిక జీవనంలో ఏడు దశాబ్దుల కాలం సుదీర్ఘమైనది, ఎందుకంటే ‘జీవేయ శరదశ్శతం..’- నూరేళ్లు జీవిస్తాము-అన్నది వ్యక్తిగత ఆకాంక్ష! పరిపూర్ణ జీవన కాలవ్యవధి వందేళ్లు! కానీ ఒక జాతి జీవన ప్రస్థానంలో డెబ్బయి వసంతాల సమయం మహాసముద్రంలోని చిరు కెరటంలోని సగం కంటే తక్కువ!

08/14/2017 - 00:49

బొగ్గు పులుసు వాయువు-కార్బన్ డై ఆక్సయిడ్-మోతాదుకు మించి గాలిలో కలుస్తుండడం పరిసరాల కాలుష్యం పెరుగుతుండడానికి ప్రధాన కారణం! పల్లెటూళ్లలోని ‘స్వచ్ఛ’ కార్యకర్తలు మొదలుకుని పర్యావరణ పరిరక్షణ కోసం పారిస్ నగరంలో కుదిరిన అంతర్జాతీయ అంగీకార రూపకర్తల వరకూ అందరూ చెబుతున్న మాట ఇది. వాహనాలు విసర్జిస్తున్న ఇంధన కాలుష్యాల వల్ల ప్రకృతి పొగచూరిపోతోందన్నది ప్రధాన ప్రచారం!

08/12/2017 - 00:22

ఆగస్టు పదకొండవ తేదీ బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరంతో అనేక రీతులుగా ముడివడి ఉండవ చ్చు. రెండింటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాజ్యసభలో ఉటంకించాడు. మొదటిది- నూట తొమ్మిది ఏళ్ల క్రితం క్రీస్తుశకం 1908 ఆగస్టు పదకొండవ తేదీన స్వాతంత్య్ర సమరవీరుడు ఖుదీరామ్ వసు బలిదానం చేశాడు. మాతృధరణి దాస్య శృంఖలాలను పగులగొట్టడానికై ఆ పద్దెనిమిదేళ్ల సమరవీరుడు తన జీవితాన్ని అర్పించగలిగాడు.

08/10/2017 - 23:48

శ్రీరామ్‌సాగర్ జలాశయం పునరుజ్జీవన పథకానికి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేయడం మరో జల విప్లవ శుభారంభం. నదులలో ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతాలకు, పర్వతసీమల నుంచి సాగర క్షేత్రం వైపు నీరు ప్రవహించడం సహజ పరిణామక్రమం! కానీ నదుల నీటిని దిగువ ప్రాంతాల నుంచి ఎగువకు తరలించుకొని రావడం మానవుడు సాధించగలుగుతున్న అద్భుతం, విచిత్రం.

Pages