S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

09/14/2017 - 23:35

చక్మా హజోంగ్ తెగలకు చెందిన బంగ్లాదేశీయ హిందూ శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం ‘అఖండ భారత’ విభజన నాటి గాయాలకు కొంత ఉపశమనం. క్రీస్తుశకం 1947 ఆగస్టులో మత ప్రాతిపదికన జరిగిన దేశ విభజన కారణంగా బెంగాల్ అస్సాం ప్రాంతాలలోని ‘ఇస్లాం బాహుళ్య’ ప్రాంతాలు తూర్పు పాకిస్తాన్‌గా ఏర్పడినాయి. తూర్పు పాకిస్తాన్ 1971లో బంగ్లాదేశ్‌గా ఏర్పడింది.

09/14/2017 - 00:25

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర విద్యాసంస్థలలో ఒకటవ తరగతి నుంచి పనె్నండవ తరగతి వరకు తెలుగు భాషను బోధించి తీరాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రక శుభ పరిణామం! తెలుగువారి జీవన వ్యవహారంలో తగ్గిపోతున్న మాతృభాషా ప్రభావం మళ్లీ పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేయగలదు.

09/13/2017 - 00:43

మనదేశంలోకి అక్రమంగా చొరబడి ఏళ్ల తరబడి నివసిస్తున్న ‘రోహింగియా’ తెగకు చెందిన వారిని దేశం నుంచి బయటికి తరలించరాదని ‘ఐక్యరాజ్య సమితి’ హక్కుల సంస్థ కోరడం విచిత్రమైన వ్యవహారం. మనదేశపు అంతర్గత వ్యవహారాలలో అక్రమ ప్రమేయానికి ఇది మరో నిదర్శనం! శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి నియమావళిని అనేక దేశాల ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి. అలాంటి ప్రభుత్వాలను ఐక్యరాజ్య సమితి వారు నిరసించాలి!

09/11/2017 - 23:41

అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యముల్ - అన్న నానుడి ఆ ‘అమ్మ’కు కూడా వర్తిస్తుంది. అధికారం కోల్పోయిన తరువాత మూడేండ్లు గడిచిపోయాయి. ఇన్నాళ్లకు ప్రముఖ రాజకీయ నాయకురాలు జయంతీ నటరాజన్‌కు వ్యతిరేకంగా ‘కేంద్ర నేర పరిశోధక మండలి’ వారు ‘అవినీతి ఆరోపణ’ను నమోదు చేశారు.

09/10/2017 - 22:33

ప్రజాప్రతినిధుల, రాజకీయ వేత్తల ఆస్తుల విలువ శరవేగంతో పెరుగుతుండడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం విస్మయాన్ని వ్యక్తం చేయడం రాజకీయాలను ఆవహించి ఉన్న అవినీతికి మరో నిదర్శనం. ఈ విషయమై సకాలంలో దర్యాప్తు జరుపనందుకు ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తప్పుపట్టడం సంచలనాత్మక పరిణామం.

09/09/2017 - 00:50

ఇద్దరు బీభత్సకారులకు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్షను విధించడం తో, 1993లో ఈ మహానగరంలో పాకిస్తాన్ తొత్తులు జరిపిన భయంకర హత్యాకాండ మరోసారి జనానికి గుర్తుకువచ్చింది. 1947 నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలోని ఉగ్రవాద మృగాలను ఉసిగొల్పుతోంది. మన దేశంలో పుట్టి పెరిగినవారిని సైతం జిహాదీ బీభత్సకారులుగా తీర్చిదిద్దుతోంది. 1993 నుంచి ఈ పాకిస్తానీ ప్రభుత్వ బీభత్సకాండ తీవ్రతరం కావడం చరిత్ర.

09/08/2017 - 00:42

నకిలీ గోరక్షకుల వల్ల గోసంతతికి జరిగిన, జరుగుతున్న నష్టానికి ఇదంతా నిదర్శనం! నకిలీ గోరక్షకులను కఠినంగా అణచివేయాలని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడానికి కారణం ఈ నకిలీలు జరిపిన అత్యాచారాలు! సర్వోన్నత న్యాయస్థానం ధ్రువీకరించింది కనుక దేశమంతటా ఇలాంటి నకిలీ గోరక్షకులు గోమాంసం తినదలచిన వారిపై అత్యాచారాలు జరుపుతున్నారని విశ్వసించవలసి వస్తోంది!

09/07/2017 - 01:39

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బర్మాలో పర్యటించడం ఇరుగు పొరుగు దేశాల మధ్య పెరుగుతున్న ఆత్మీయతకు నిదర్శనం. బుధవారం మన దేశానికి బర్మా-మ్యాన్‌మార్-కు మధ్య పదకొండు ఒప్పందాలు కుదరడం, బర్మా ప్రభుత్వ అధినేత్రి-స్టేట్ కౌన్సిలర్-అంగ్‌సాన్ సూచీతో మోదీ చర్చలు జరపడం వంటి పరిణామాలు ఈ పర్యటనలో భాగం. కానీ, భా రత ప్రధానమంత్రి బర్మాలో పర్యటించడమే వీటికంటే ప్రధానమైన పరిణామం.

09/05/2017 - 23:48

‘బ్రిక్స్’ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశంలో ఆమోదించిన ‘ఉగ్రవాద వ్యతిరేక’ విధాన పత్రం మన దేశం చైనా, పాకిస్తాన్‌లపై సాధించగలిగిన వ్యూహాత్మక విజయం. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను తుదముట్టించడంలో ఇది తుది విజయం కాదన్నది మాత్రం నిరాకరింపజాలని నిజం.

09/04/2017 - 23:30

నదీజలాల పరిరక్షణ కోసం, నీటి స్వచ్ఛతను పునరుద్ధరించడం కోసం అఖిల భారత మహాయాత్ర ఆరంభం కావడం మరో భగీరథ యజ్ఞం. ఆదివారం నాడు కలియుగం 5119వ సంవత్సర భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ఆరంభమైన ఈనదీ జల రక్షణ జైత్రయాత్ర- ర్యాలీ ఫర్ రివర్స్-నెలరోజులపాటు కన్యాకుమారి నుంచి ఇంద్రప్రస్థం-దిల్లీ-వరకూ, పంజాబ్‌లోని అమృతసర్ వరకూ, హిమాలయాలలోని హరిద్వారం వరకూ కొనసాగనుండడం చారిత్రక మహా శుభ పరిణామం!

Pages