S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

09/03/2017 - 23:03

ఆదివారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ‘ఊహాగాన కళాకోవిదుల’కు నిరాశ కలిగించిందన్నది నిరాకరింపజాలని నిజం! ఈ ఊహాగాన కుశలులెవ్వరూ ముందుగా కనిపెట్టలేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చేయగలిగిన ప్రధాన మార్పులు ఇందుకు కారణం! తమ ఊహలు నిజమైనట్టు ఈ ‘అంచనాల నిపుణులు’ ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వీరు ఊహించని ప్రధానమైన పరిణామం నిర్మలా సీతారామన్ రక్షణశాఖ మంత్రి కావడం!

09/02/2017 - 00:05

ప్రపంచీకరణ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థను నిలదీస్తుండడం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం నుంచి దాపురించిన విధాన వైపరీత్యం! ‘స్థూల జాతీయ ఉత్పత్తి’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- పెరుగుదల వేగాన్ని మందకొడితనం ఆవహించడానికి కారణం అంతర్జాతీయ ఆర్థిక అనుసంధానం. ఈ అనుసంధానం ప్రధాన లక్ష్యం మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలను క్రమంగా కుదేలుమనిపించడం!

09/01/2017 - 00:05

మన సమర పటిమను పెంపొందించడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషికి కొనసాగుతున్న వైఫల్యాలు విచిత్రమైన నేపథ్యం! సరిహద్దులకు ప్రాణం పోస్తున్న ‘సమరుల’ సంఖ్యను పెంచడానికి బుధవారం ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం! కొత్తగా నూట ఇరవై మూడు ‘సమర గగన శకటాల’ను సమకూర్చుకొనడానికి మన నౌకాదళం నిర్ణయించడం సముద్ర భద్రతను పెంపొందించే కార్యక్రమం!

08/31/2017 - 00:08

మాల్‌దీవులలో మూడు చైనా యుద్ధనౌకలు తిష్ఠ వేసి ఉండడం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ మూడవ తేదీనుంచి జరుపనున్న చైనా పర్యటనకు విచిత్రమైన నేపథ్యం. ఐదవ తేదీ వరకు చైనాలో పర్యటించే మోదీ నాలుగవ తేదీన చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చలలో మాల్‌దీవులలో చైనా యుద్ధనౌకల ఉనికి గురించి ప్రస్తావన జరుగదు.

08/29/2017 - 23:20

‘రోహింగియా’ తెగవారి కడగండ్లకు ఏకైక కారణం ‘రోహింగియా’ జిహాదీలు! ఇతర మతాల వారిని మట్టుపెట్టడానికై బీభత్సకాండ జరుపుతున్నది ‘రోహింగి యా’ తెగకు చెందిన ‘జిహాదీలు’. ఫలితంగా ఇతర మ తాల వారి ప్రతిక్రియకు గురి అవుతున్నది ‘రోహింగియా’ తెగకు చెందిన సా మాన్య ముస్లింలు. బర్మాలోని ‘రక్షణ’- రఖెనీ- ప్రాంతంలో శతాబ్దులుగా నివసిస్తున్న ‘రోహింగియా’లు ఇప్పుడు చెల్లాచెదరు కావడానికి కారణం దశాబ్దుల ‘జిహాదీ’ బీభత్సకాండ!

08/29/2017 - 00:48

డోక్‌లా పచ్చిక మైదానం నుంచి తన దళాలను ఉపసంహరించుకొనడానికి చైనా అంగీకరించ డం మన ప్రభుత్వం సాధించిన దౌత్య విజయం! చైనా అక్రమ విస్తరణకు, వ్యూహాత్మక దురాక్రమణకు తీవ్రమైన అవరోధం ఏర్పడిందనడానికి ఇది మరో నిదర్శనం!

08/27/2017 - 23:27

ఒక లైంగిక బీభత్సకారుడిని శిక్షించే ప్రక్రియకు ఇంతటి ఘోరమైన పైశాచికమైన ప్రతిఘటన దాపురించడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని కళంకం. ‘డేరా సచ్ఛా, సౌదా’ అన్న ‘తెగ’కు చెందిన గుర్‌మీత్ రామ్హ్రీమ్‌సింగ్ అనే వాడిని హరియాణాలోని ‘పంచకుల’ పట్టణంలోని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన వెంటనే అతగాడి అనుచరులు హరియాణా, పంజాబ్ రాష్ట్రాలలో సృష్టించిన భయంకర బీభత్సకాండ అభూతపూర్వం.

08/25/2017 - 00:15

వైయక్తిక గోపనీయత-ఇండివిడ్యువల్ ప్రైవసీ- ప్రాథమికమైన హక్కు అని సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి సరికొత్త ధ్రువీకరణ. రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ అధికరణం నిర్దేశిస్తున్న ‘జీవించే హక్కు’లో ‘వ్యక్తిగత గోప్యత’ భాగమన్నది తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం చేసిన నిర్ణయంలోని సారాంశం.

08/24/2017 - 01:18

సురేశ్ ప్రభు రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడడం ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల నైతిక బాధ్యతా నిర్వహణ సూత్రానికి మరో నిదర్శనం. గతంలో 1960వ దశకంలో తమిళనాడులోని ఒక వంతెన వరద నీటికి కొట్టుకునిపోవడంతో ఘోరమైన రైలు ప్రమాదం జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఆ సందర్భంగా అప్పటి రైల్వేమంత్రి- ఆ తరువాత ప్రధానమంత్రి అయిన -లాల్‌బహదూర్ శాస్ర్తీ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి పదవీ త్యాగం చేశాడు!

08/22/2017 - 23:48

ముమ్మారు ‘తలాఖ్’ చెప్పడం ద్వారా భర్త భార్యకు విడాకులిచ్చే సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం చారిత్రక శుభ పరిణామం. పురుషాధిక్య దుష్ప్రభావగ్రస్తులైన ముస్లిం మహిళలకు విముక్తి కలిగించగల సామాజిక విప్లవం!

Pages