S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/04/2017 - 01:15

హైదరాబాద్, డిసెంబర్ 3: క్రికెట్‌లో కొత్తగా రంగ ప్రవేశం చేసిన టి-10 ఫార్మాట్‌కు హీరా గ్రూప్ సంస్థ మద్దతు ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు జరిగే టి-10 క్రికెట్ లీగ్ (టీసీఎల్) టోర్నమెంట్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో టోర్నమెంట్ వివరాలను ప్రకటించారు.

12/04/2017 - 01:14

బ్యాంకాక్, డిసెంబర్ 3: ఇండోర్ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో భాగంగా మహిళల రికర్వ్ విభాగంలో భారత ఆర్చర్ దీపిక కుమారి కాంస్య పతకం సాధించింది. మూడో స్థానానికి జరిగిన పోటీలో ఆమె రష్యాకు చెందిన సయానా సిరెపిలొవాను 7-3 తేడాతో చిత్తుచేసింది. మిగతా ఆర్చర్లు విఫలం కావడంతో, భారత్ ఈ ఒక్క పతకంతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

12/04/2017 - 01:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు సంచలన ఆటగాడు పృథ్వీ షా నాయకత్వం వహించనున్నాడు. 16 మంది సభ్యులతో కూడిన జట్టును జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

12/04/2017 - 01:12

భువనేశ్వర్, డిసెంబర్ 3: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్‌లో భాగంగా రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీని ఢీ కొంటున్న భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిలకడ లేకపోతే, సమస్యలు తప్పవని స్పష్టం కావడంతో, జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి.

12/04/2017 - 01:12

దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కారణంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టుతో కలిసి వెళ్లలేకపోయిన బెన్ స్టోక్స్. యాషెస్ సిరీస్‌లో ఆడేందుకు పిలుపుకోసం ఎదురుచూస్తున్న అతను ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కాంటెర్బరీ తరఫున ఒటాగోతో దేశవాళీ మ్యాచ్ ఆడుతున్నాడు. 69 రోజుల విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన అతను కేవలం ఏడు బంతులు ఎదుర్కొని, రెండు పరుగులకే ఔటయ్యాడు.

12/03/2017 - 01:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: శ్రీలంకతో నాగపూర్‌లో జరిగిన రెండో టెస్టులో మాదిరిగానే, ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శనివారం ప్రారంభమైన చివరి, మూడో టెస్టులోనూ టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తున్నది. అదే జోరును కొనసాగిస్తూ, మొదటి రోజు ఆట పూర్తయ్యే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 371 పరుగులు సాధించి, భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతున్నది.

12/03/2017 - 01:14

భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ స్టంప్డ్ నిరోషన్ డిక్‌విల్లా బి లక్షన్ సండాకన్ 155, శిఖర్ ధావన్ సి సురంగ లక్మల్ బి దిల్‌రువాన్ పెరెరా 23, చటేశ్వర్ పుజారా సి సదీర సమరవిక్రమ బి లాహిరు గామగే 23, విరాట్ కోహ్లీ 156 నాటౌట్, అజింక్య రహానే స్టంప్డ్ నిరోషన్ డిక్‌విల్లా బి లక్షన్ సండాకన్ 1, రోహిత్ శర్మ 6 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 371.

12/03/2017 - 01:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: హోం గ్రౌండ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీలంకతో చివరి టెస్టు, మొదటి రోజునే అజేయ శతకంతో కదం తొక్కాడు. మూడు వరుస టెస్టుల్లో మూడు సెంచరీలు చేసి, హ్యాట్రిక్‌ను అందుకున్న తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

12/03/2017 - 01:10

న్యూఢిల్లీ: శ్రీలంక ఓపెనర్ సదీర సమరవిక్రమ తలకు గాయమైంది. దిల్‌రువాన్ పెరెరా బౌలింగ్‌లో మురళీ విజయ్ బలమైన షాట్ కొట్టినప్పుడు, ఫార్వర్డ్ షార్ట్‌లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమరవిక్రమ హెల్మెట్‌కు బంతి తలిగింది. దీనితో అధికారులు అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత, 24 గంటలు అతనిని అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు.

12/03/2017 - 01:10

అడెలైడ్, డిసెంబర్ 2: ఇంగ్లాండ్‌తో శనివారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లకు 209 పరుగులు చేసింది. యాషెస్ సిరీస్ చరిత్రలో మొట్టమొదటిసారి డే/నైట్ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది.

Pages