S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/05/2017 - 00:02

భువనేశ్వర్, డిసెంబర్ 4: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్‌లో భారత్ మరో పరాజయాన్ని చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొని డ్రాగా చేసుకున్న భారత్ ఆతర్వాత ఇంగ్లాండ్ చేతిలో 2-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన మూడో మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీతో తలపడి, 0-2 తేడాతో ఓటమిపాలైంది.

12/05/2017 - 00:01

న్యూఢిల్లీ, నవంబర్ 4: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తదుపరి ప్రత్యర్థి ఖరారయ్యాడు. ఆఫ్రికా చాంపియన్ ఎర్నెస్ట్ అముజూను అతను ఢీ కొంటారు. డబ్ల్యూబీవో ఓరియంటన్, ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్స్‌ను నిలబెట్టుకునేందుకు అతను ఘనా వీరుడు అముజూను ఈనెల 23న జైపూర్‌లో జరిగే ఫైట్‌లో ఢీ కొంటాడు. కెరీర్‌లో అతనికి ఇది పదో ఫైట్.

12/05/2017 - 00:01

వెల్లింగ్టన్, డిసెంబర్ 4: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 45.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ 148.4 ఓవర్లు ఆడి, 9 వికెట్లకు 520 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసింది.

12/05/2017 - 00:00

అడెలైడ్, డిసెంబర్ 4: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 227 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా 8 వికెట్లకు 442 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మార్క్ స్టోన్‌మన్ (18) వికెట్‌ను కోల్పోయి 29 పరుగులు చేసింది.

12/04/2017 - 01:35

టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో
బ్రియాన్ లారా రికార్డును అధిగమించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
శ్రీలంకపై రెండో టెస్టులో డబుల్ సెంచరీతో రాణించిన అతను చివరి,
మూడో టెస్టులోనూ డబుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు
*
ఊపిరాడక లంకేయులులికిపడగ
బ్యాటు ఝళిపించు విరాట్పురుషుడగుచు

12/04/2017 - 01:22

టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బ్రియాన్ లారా రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. నాగపూర్ టెస్టులో డబుల్ సెంచరీ చేసినప్పుడు, కెప్టెన్‌గా ఐదు డబుల్ సెంచరీలతో లారా రికార్డును కోహ్లీ సమం చేసిన విషయం తెలిసిందే.

12/04/2017 - 01:21

భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 90 ఓవర్లలో 4 వికెట్లకు 371) : మురళీ విజయ్ స్టంప్డ్ నిరోషన్ డిక్‌విల్లా బి లక్షన్ సండాకన్ 155, శిఖర్ ధావన్ సి సురంగ లక్మల్ బి దిల్‌రువాన్ పెరెరా 23, చటేశ్వర్ పుజారా సి సదీర సమరవిక్రమ బి లాహిరు గామగే 23, విరాట్ కోహ్లీ ఎల్‌బి లక్షన్ సండాకన్ 243, అజింక్య రహానే స్టంప్డ్ నిరోషన్ డిక్‌విల్లా బి లక్షన్ సండాకన్ 1, రోహిత్ శర్మ సి నిరోషన్ డిక్‌విల్లా బి లక్షన్ సండాక

12/04/2017 - 01:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: హోం గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు డబుల్ సెంచరీ సాధించి, భారత్‌కు భారీ స్కోరు అందించాడు. దీనితో ఏడు వికెట్లకు 536 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

12/04/2017 - 01:18

అడెలైడ్, డిసెంబర్ 3: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లకు 442 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. షాన్ మార్ష్ అజేయ సెంచరీతో రాణించడంతో ఆసీస్‌కు ఈ స్కోరు సాధ్యమైంది. మొదటి రోజు మాదిరిగానే రెండో రోజు ఆటకు కూడా వర్షం వల్ల ఆటంకం కలిగింది.

12/04/2017 - 01:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందంటూ వచ్చిన వార్తలను గమనించారో లేక నిజంగానే అసౌకర్యానికి గురయ్యారో తెలియదుగానీ భారత్‌తో జరుగుతున్న చివరి, మూడో టెస్టు మ్యాచ్ రెండు రోజు ఆటకు శ్రీలంక క్రికెటర్లు రెండు పర్యాయాలు ఆటంకం కలిగించారు. మాస్క్‌లతో మైదానంలోకి దిగారు.

Pages