S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/27/2017 - 03:34

భద్రాచలం టౌన్, నవంబర్ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో మావోయిస్టులు ఒక వ్యక్తిని హత్య చేశారు. అనంతరం అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లారు. చర్ల మండలం పెద్ద మిడిసిలేరు గ్రామానికి చెందిన గిరిజనుడు సోడె ప్రసాద్(45)ను శిక్షించాలని మావోయిస్టు శబరి చర్ల ఏరియా కమిటీ తీర్మానించిందని లేఖలో పేర్కొన్నారు. ప్రసాద్ ఇంటికి వచ్చిన మావోయిస్టులు అతన్ని ఇంటి సమీపంలో తుపాకులతో కాల్చి చంపారు.

11/27/2017 - 02:43

హైదరాబాద్, నవంబర్ 26: హైదరాబాద్‌లో వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా ఆస్ట్రేలియాలోని తెలుగువారికి ఆహ్వానించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ నగరాలలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం ఆదివారం జరిగింది.

11/27/2017 - 02:39

హైదరాబాద్, నవంబర్ 26: అవయు దానంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఆరోగ్యంగా జీవించండి, అవయవ దానం చేయండి, మరొకరికి ప్రాణదాతగా నిలవండని మంత్రి పిలుపునిచ్చారు. ఆదివారం నాడిక్కడ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అవయవ దానంపై అవగాహన చైతన్య వాక్‌ను మంత్రి ప్రారంభించారు.

11/27/2017 - 02:38

హైదరాబాద్, నవంబర్ 26: మియాపూర్ మెట్రోరైలు స్టేషన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోయే ప్లాజా హైదరాబాద్ నగరానికి తలమానికం కానుందని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి అన్నారు. మెట్రో ప్లాజా డిజైన్‌ను ఆదివారం మీడియాకు ఎన్‌విఎస్ రెడ్డి విడుదల చేసారు.

11/27/2017 - 02:38

హైదరాబాద్, నవంబర్ 26: ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ డిసెంబర్ 1 నుంచి విజయవాడ కేంద్రంగా పని చేయనుంది. ఈ మేరకు కార్యాలయాన్ని విజయవాడకు తరలించినట్లు కమిషన్ చైర్మన్ జస్టిస్ నౌషద్ అలి తెలిపారు.

11/27/2017 - 02:17

హైదరాబాద్, నవంబర్ 26: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్థులకు దగ్గరయ్యేందుకు కేంద్రం వినూత్న ప్రణాళిక ఖరారు చేసింది. దేశం మొత్తంమీద 35 వామపక్ష ప్రభావిత జిల్లాలున్నాయి. ఈ జిల్లాల్లో విద్యార్థులకు 15 లక్షల సౌర లాంతర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ కోరింది. వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసే విషయమై కేంద్రం పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో వ్యూహాలను చర్చించింది.

11/27/2017 - 02:16

ఖైరతాబాద్, నవంబర్ 26: హైదరాబాద్‌లో జీరో క్రైమ్ రేటు తెచ్చేందుకు పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా, దొంగలు వాటిని చిత్తుచేసి భారీ చోరీలకు పాల్పడుతున్నారు. బషీర్‌బాగ్‌లో ముగ్గురు వ్యాపారుల నుంచి ఆగంతకులు సుమారు 1.26 కోట్ల నగదు దోచుకెళ్లారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మైసూర్‌కు చెందిన సాంకేత్, స్వప్నిల్, సంగప్ప బంగారం వ్యాపారులు.

11/27/2017 - 02:18

పివి రమణారావు

11/27/2017 - 02:03

కోడుమూరు, నవంబర్ 26: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర 18 రోజు ఆదివారం కర్నూలు జిల్లా కోడుమూరు మండల పరిధిలోని గోరంట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభల్లో జగన్ సిఎం చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

11/27/2017 - 02:01

దొరవారిసత్రం, నవంబర్ 26: సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన సంఘటన ఆదివారం నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో చోటుచేసుకొంది. ఈ విషాద ఘటనతో చిన్నారుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. దొరవారిసత్రం మండలం అనేపూడి, అనేగొట్టం గ్రామాలకు చెందిన చొప్పల జయకృష్ణ (14), కార్ల రాకేష్ (14), వంకా వెంకట హేమంత్ (12) పక్క గ్రామం వడ్డికండ్రిగ చెరువుకు వెళ్లారు.

Pages