S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/26/2017 - 02:16

హైదరాబాద్, నవంబర్ 25: భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా శే్వతసౌధం సలహాదారు ఇవాంక ట్రంప్‌తో 28వ తేదీ సాయంత్రం సమావేశం కానున్నారు. ఇవాంక ట్రంప్‌తో సమావేశం ముగిసిన వెంటనే జీఈఎస్ ప్రదర్ళనను, స్టార్టప్‌ల స్టాల్స్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాతనే శిఖరాగ్ర సదస్సు ప్లీనరీని ప్రధాని ప్రారంభిస్తారు.

11/26/2017 - 02:25

హైదరాబాద్, నవంబర్ 25: రబీలో తెలంగాణలో 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదొక రికార్డుగా నమోదవుతోంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ, సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టుల ఆయకట్టులో వరి, పల్లి తదితర పంటల సాగు చేయడం ప్రారంభమైంది. నాగార్జునసాగర్ కింద డిసెంబర్ 10 నుండి 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి.

11/26/2017 - 02:06

హైదరాబాద్, నవంబర్ 25: పోలీసు శాఖలో విధేయత, క్రమశిక్షణకు మారుపేరని, ఎంపికైన అభ్యర్ధి వీటికి లోబడి నడుచుకోవాలని, అబద్ధాలు తెలియచేసే అభ్యర్థులను పోలీసు శాఖలో తీసుకోరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సబబేనని జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

11/26/2017 - 02:04

హైదరాబాద్, నవంబర్ 25: మెట్రోరైలు చార్జీలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. చాలాకాలంగా ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఛార్జీల సవరణ ప్రస్తుతం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ప్రతిపాదనల ప్రకారం మెట్రో కనిష్ట చార్జీగా రూ. పదిగా, గరిష్ట చార్జీగా రూ. 60గా నిర్ణయించినట్లు తెలిసింది. అంతేగాక, రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ నాలుగు కిలోమీటర్ల లోపు చార్జీ రూ. 15, నాలుగు నుంచి

11/26/2017 - 02:24

హైదరాబాద్, నవంబర్ 25: మహానగరంలో మెట్రో రైలు పరుగులు తీసేందుకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈనెల 28న మధ్యాహ్నం 2.15 గంటలకు శుభారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె. తారక రామారావు సారథ్యంలో మంత్రులు, ప్రముఖుల బృందం శనివారం చ వేసింది. ప్రయాణికులకు 29న ఉదయం 6 గంటల నుంచి మెట్రో అందుబాటులోకి రానుంది.

11/26/2017 - 01:43

విజయవాడ, నవంబర్ 25: పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛన్ల చెల్లింపులో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ట్రెజరీ శాఖ ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం ఆచరణలో వృద్ధులకు అనేక కష్టాలు తెచ్చిపెడుతోంది. చేతివేళ్లు అరిగిపోయి వేలి ముద్రలు సరిగ్గా పడక బయో మెట్రిక్ విధానానికి విఘాతం కలగటం అటుంచి, వయో వృద్ధులైన పింఛనుదారుల తిరుగుడు, ఎవరికి చెప్పుకోవాలో తోచక తల్లడిల్లిపోతున్నారు.

11/26/2017 - 01:41

ఖాజీపేట, నవంబర్ 25: కన్నవారిని ఆదరించని ప్రభుత్వ ఉద్యోగులపై వేటు తప్పదని కడప జిల్లా కలెక్టర్ బాబూరావునాయుడు హెచ్చరించారు. తల్లిదండ్రులు, భార్యాపిల్లలను పోషించని, వారి బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తామని అన్నారు. తండ్రి బాగోగులు పట్టించుకోని శంకవరం పాఠశాల హెడ్‌మాస్టర్ జాషువాను సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు.

11/26/2017 - 01:54

క్రిష్ణగిరి/ కోడుమూరు, నవంబర్ 25: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే తొలి అభ్యర్థి పేరును పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి శనివారం ప్రకటించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి పోటీ చేస్తారన్నారు.

11/26/2017 - 02:21

హైదరాబాద్/ నార్సింగి, నవంబర్ 25: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఇవాంక ట్రంప్‌కు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన గోల్కొండ కోటలో విందు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేపథ్యంలో జీఈఎస్ సదస్సుకు విచ్చేస్తున్న అతిథులకు గోల్కొండ కోటలో ఈనెల 29న సాయంత్రం విందు ఏర్పాట్లు చేస్తున్నారు.

11/25/2017 - 04:13

హైదరాబాద్, నవంబర్ 24: మెట్రోరైలు చార్జీలను ఒకటి రెండు రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టితో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోనే చార్జీలు కూడా ముందుగానే ఖరారు అయ్యాయి. అయితే గతంలో ఖరారు చేసిన చార్జీలను యధాతథంగా అమలు చేయాలా? లేక తాజాగా ఎల్ అండ్ టి సంస్థ చార్జీలను స్వల్పంగా పెంచాలని చేసిన ప్రతిపాదన మేరకు ఖరారు చేయాలా?

Pages