S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/29/2017 - 04:15

హైదరాబాద్, నవంబర్ 28: భవిష్యత్‌లో తాను అతి పెద్ద పారిశ్రామిక వేత్తను కావాలనేదే తన ఆశయమని ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొన్న అతి పిన్నవయస్కుడు ఫినే్లసన్ పేర్కొన్నాడు. ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఇప్పటికే తాను ఆరు యాప్‌లను రూపొందించినట్టు చెప్పాడు. 13 ఏళ్ల ఫినే్లసన్ ఆస్ట్రేలియా దేశంలో టౌన్స్ విల్లేకు చెందిన వాడు.

11/29/2017 - 00:59

హైదరాబాద్, నవంబర్ 28: మహిళల సాధికారతే లక్ష్యంగా జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు, హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రహ్మణి స్పందించారు. వ్యాపారవేత్త అయిన బ్రహ్మణి మంగళవారం నాడు పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఉపాసనతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ జీఈఎస్ మహిళా పారిశ్రామిక వేత్తల్లో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు.

11/29/2017 - 02:42

హైదరాబాద్, నవంబర్ 28: నగరంలో మంగళవారం ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారు. పాతబస్తీ నుంచి ఫలక్‌నుమా, హెచ్‌ఐసీసీ హోటల్ మార్గంలో దుకాణాలు మూసివేయించారు. నగరమంతా సీసీ కెమెరాల నిఘాలో ఉంది. నగరంలోని 1.5 లక్షల సీసీ కెమెరాలు పోలీస్ కంట్రోల్ కమాండ్ రూంకు అనుసంధానం చేశారు.

11/29/2017 - 00:30

హైదరాబాద్, నవంబర్ 28: ప్రపంచంలో మహిళలు చేయలేని ఉద్యోగం లేదు అని లాక్‌హీడ్ మార్టిన్ రోటరీ అండ్ మిషన్ సిస్టమ్స్ డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లారిన్ ఎం మార్టిన్ వ్యాఖ్యానించారు. తమ సంస్థలో వివిధ ఉత్పత్తుల రూపకల్పనలో మహిళలు పాలుపంచుకున్నారని వారంతా పురుషులతో సమానంగా వారి పక్కనే పనిచేస్తున్నారని ఇది మహిళా శక్తికి ప్రతీక అని ఆమె వ్యాఖ్యానించారు.

11/29/2017 - 00:05

తిరుపతి, నవంబర్ 28: సర్వదర్శనం భక్తులకు టైమ్‌స్లాట్ విధానం ద్వారా నిర్ణీత వ్యవధిలో శ్రీవారి దర్శనం చేయించేందుకు తొలివిడతగా 107 కౌంటర్ల ద్వారా టోకెన్లు కేటాయిస్తామని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు.

11/28/2017 - 03:59

హైదరాబాద్, నవంబర్ 27: భాగ్యనగరవాసుల దశాబ్దం నాటి కల నేడు సాకారం కాబోతోంది. ఎప్పుడెప్పుడా అని చారిత్రక హైదరాబాద్ నగర ప్రజలు ఎదురు చూస్తోన్న మెట్రోరైలు సౌకర్యం అందుబాటులోకి రాబోతున్న తరుణం ఆసన్నమైంది.

11/28/2017 - 03:54

హైదరాబాద్, నవంబర్ 27: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ పారిశ్రామికత సదస్సు మంగళవారం నాడు హైటెక్స్‌లోని నోవాటెల్‌లో ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు.

11/28/2017 - 03:52

హైదరాబాద్, నవంబర్ 27: చిన్న చిన్న ఆలోచనల నుండి ఆవిర్భవించిన అబ్బురపరిచే వ్యాపార ఆవిష్కరణలకు జీఈఎస్ సదస్సు వేదిక కాబోతోంది. సదస్సులో మూడు రోజుల పాటు 500 అంకురాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా వారు తమ ఆలోచనలు, అమలులో ఎదురైన ఇబ్బందులు, దానిని పారిశ్రామిక అంశంగా మార్చిన తీరు, మిగిలిన వారికి ఆదర్శం ఎలా అవుతుందో కూడా వివరిస్తారు. మనసులో పుట్టిన చిన్న చిన్న ఆలోచనలకు ఈ సదస్సు పెద్ద పీట వేయనుంది.

11/28/2017 - 03:50

హైదరాబాద్, నవంబర్ 27: ప్రపంచ మహిళ అభివృద్ధికి జీఈఎస్ సదస్సు ముఖద్వారం వంటిదని, మహిళల గెలుపే అందరి గెలుపు అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసిందని ఆయన కొనియాడారు.

11/28/2017 - 02:37

హైదరాబాద్, నవంబర్ 27: నాందేడ్- లింబ్‌గాన్-చుడ్వా-పూర్ణ సెక్షన్‌లో మెషిన్ ట్యాంపింగ్ పనుల కారణంగా లైన్ బ్లాక్ చేస్తున్నందున ఆ రూట్లో నడిచే ఒక ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 28, 29, డిసెబంర్ 1, 2, 3, 5,6 తేదీల్లో రైళ్ల రద్దు, పాక్షిక రద్దు ఉంటుందని పేర్కొంది.

Pages