S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/07/2017 - 02:47

హైదరాబాద్, ఆగస్టు 6:‘‘ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం ఒక ఆపూర్వం ప్రాజెక్టు నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది డ్యాకుమెంట్ చేయడం ద్వారా స్ఫూర్ది దాయకంగా ఉంటుంది.’’కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పలువురు ఐఎఎస్‌లు వెలిబుచ్చిన అభిప్రాయమిది. ఐఎఎస్‌లు జిల్లా కలెక్టర్లుగా పని చేసేప్పుడు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తారు.

08/06/2017 - 01:52

హైదరాబాద్, ఆగస్టు 5: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ మైక్ కమింగాను శనివారం సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు చంచల్‌గూడ జైల్లో ఉన్న కమింగాను సిట్ అధికారులు మూడు రోజులపాటు విచారించనున్నారు. కమింగా కాల్ లిస్ట్‌లో వెయ్యికి పైగా ఫోన్ నెంబర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

08/06/2017 - 01:51

హైదరాబాద్, ఆగస్టు 5: ఎన్నికల్లో మంత్రులు ప్రచారం చేసుకోవచ్చని, అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడనంత వరకు ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరం లేదని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భన్వర్‌లాల్ పేర్కొన్నారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మంత్రులు కూడా రాజకీయ నాయకులేనని, ప్రజాప్రతినిధులేనని, అందువల్ల ఎన్నికల్లో ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.

08/06/2017 - 01:51

హైదరాబాద్, ఆగస్టు 5: చట్టపరంగా చెల్లించాల్సిన పన్నులు అన్నీ చెల్లిస్తానని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. పన్ను చెల్లింపుపై జూనియర్‌ను కాగ్ తప్పు పట్టిందని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. 2015లో నాన్నకు ప్రేమతో అనే సినిమాలో నటించాను, ఇది లండన్‌లో నిర్మించిన చిత్రం అని తెలిపారు.

08/06/2017 - 01:40

హైదరాబాద్, ఆగస్టు 5: ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో దొంగ ఏజెంట్లు ప్రచారం చేసుకుంటూ లక్షలు కొల్లగొడుతున్నారు. బోగస్ వెబ్‌సైట్‌లో ఉద్యోగాల ప్రకటన ఇస్తూ, నిరుద్యోగులు ఒక్కొక్కరు నుంచి ఆరు లక్షల చొప్పున కాజేసిన దందా ఒకటి బయటపడింది.

08/06/2017 - 01:40

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ నియోజకవర్గాల అభివృద్ధి ప్రోగ్రాం కింద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ప్రత్యేక అభివృద్ధి నిధికింద మంత్రులకు నిధులు మంజూరీని సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రభుత్వం రెండు పద్దుల కింద దాదాపు రూ.

08/06/2017 - 01:39

హైదరాబాద్, ఆగస్టు 5: జిఎస్‌టి అమలులో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష విధానానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. శనివారం ఢిల్లీలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రికి ఆదివారం లేఖ రాయాలని నిర్ణయించారు.

08/06/2017 - 01:35

విశాఖపట్నం, ఆగస్టు 5: కేంద్రం కొత్తగా అమల్లోకి తీసుకురానున్న రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ(రేరా) చట్టంతో అపార్ట్‌మెంట్ల ధరలు అకాశానికెగసే ప్రమాదం ఉంది. చట్టంలో పొందుపరచిన పలు నిబంధనలు బిల్డర్ల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ క్రెడాయ్ ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. రేరా చట్టాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంటూనే, చట్టంలో నిబంధనలు తమకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు.

08/06/2017 - 01:35

విజయవాడ, ఆగస్టు 5: శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి దోహదపడే వంశధార ప్రాజెక్టు రెండవ దశ పనులు పూర్తిచేసేందుకు స్థానిక ప్రజానీకం సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

08/06/2017 - 01:34

కర్నూలు, ఆగస్టు 5: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పేలుతున్న మాటల తూటాలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. కర్నూలు జిల్లా నంద్యాలలో గురువారం జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైకాపా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం శనివారం నోటీసు జారీ చేసింది.

Pages