S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/06/2017 - 01:34

మదనపల్లె, ఆగస్టు 5: భారతదేశంలో సామాజిక సేవలందించేందుకు అధ్యయనం చేయడంతో పాటు తమవంతు ఆర్థిక సహకారాలు అందించేందుకు మనదేశ పర్యటనకు వచ్చిన స్పెయిన్ దేశస్థులు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

08/05/2017 - 03:19

హైదరాబాద్, ఆగస్టు 4: ప్రాజెక్టులు, నియామకా ల నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లి విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి క్రమంగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. ప్రాజెక్టులను అడ్డుకోవ డానికి కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందంటూ బహిరంగంగా విమర్శలకు దిగిన సిఎం కెసిఆర్, కాంగ్రెస్ వైఖరిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పర్యటనా వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్టు కనిపిస్తోం ది.

08/05/2017 - 03:18

హైదరాబాద్/ కీసర, ఆగస్టు 4: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర రైతు సమాఖ్యకు 500 కోట్లు కేటాయిస్తున్నట్లు సిఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సమై క్య రాష్ట్రంలో అడవులు నాశనమయ్యాయని, అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టిందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అటవీ సంపద నశించి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు.

08/05/2017 - 03:17

హైదరాబాద్, ఆగస్టు 4: జాతీయస్థాయలో వివిధ రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అమలులోకి వచ్చిన 18 శాతం వస్తు సేవా పన్నును 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను కేంద్రం చురుకుగా పరిశీలిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఐదు శాతానికి కుదించాలని కోరుతున్నాయి. తెలంగాణలో మిషన్ భగీరథ, రెండు బెడ్‌రూం హౌసింగ్ స్కీం, సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు రూ.19వేల కోట్ల వరకు జిఎస్‌టి భారంపడింది.

08/05/2017 - 03:17

హైదరాబాద్, ఆగస్టు 4: ట్యాప్ కనెక్షన్, డ్రైనేజీ పైప్, కేబుల్ కనెక్షన్ అవసరాల కోసం అడ్డదిడ్డంగా రోడ్లు కటింగ్ చేయడం ఇక కుదరదు. ఏ రోడ్ ఎంతమేరకు కట్ చేస్తారో, అంతమేర తవ్వకాలకు ఇక ప్రభుత్వం నుంచి అనుమతి పొందడం తప్పనిసరి. అనుమతి పత్రం పొందడం ప్రజలకు మాత్రమే కాదు, ప్రభుత్వ శాఖలు ఏవైనా రోడ్ కటింగ్ చేయాలంటే రోడ్లు, భవనాల శాఖ నుంచి ‘రైట్ ఆఫ్ వే’ అనుమతి పత్రాన్ని తప్పనిసరిగా పొందాల్సిందే.

08/05/2017 - 03:17

హైదరాబాద్, ఆగస్టు 4: చెరువుల్లో, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసేప్పుడు తప్పనిసరిగా వీడియో చిత్రీక రించాలని పశు సంవర్థక మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. సీడ్ విడుదల సమయంలో సొసైటీల సభ్యులు ఉండాలని, వీడియో చిత్రీకరించాలని సూచించారు. ఉదయం ఆరునుంచి 11 గంటల మధ్యలోనే చేప పిల్లలను విడుదల చేయాలన్నారు.

08/05/2017 - 03:11

విజయవాడ, ఆగస్టు 4: పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత నివ్వాలని, పట్టణాల్లో ప్రజలు సేద తీరేందుకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పర్చాలని సిఎం చంద్రబాబు కోరారు. శుక్రవారం రాత్రి వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంత హరిత, సుందరీకరణ సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యక్రమాలను సమీక్షించారు.

08/05/2017 - 03:11

విజయవాడ, ఆగస్టు 4: చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిఎ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను సిఎం చంద్ర బాబు మెప్పించారు. సర్వీస్ నిబంధనల సవరణ ముసాయిదా పేరుతో దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిఎ విడుదల ద్వారా తెరదించి, ఉద్యోగుల్లో నమ్మకాన్ని పాదుకొల్పేయత్నం చేశారు. 2016 నుంచి డిఎ చెల్లించకపోవడంపై ఎన్జీవో సంఘాల నేతలు సిఎంపై ఒత్తిడి తేవడం తెలిసిందే.

08/05/2017 - 03:10

మార్తి సుబ్రహ్మణ్యం

08/05/2017 - 03:09

విశాఖపట్నం, ఆగస్టు 4: వేసవిని తలపిస్తున్న ఎండలు. ఎక్కడో ఒకట్రెండు చోట్ల వర్షాలు. జూలైలోనూ ఇదే పరిస్థితి. రుతుపవనాల ప్రభావం పెద్దగా కన్పించకపోవడంతో రైతాంగం దిగాలు పడిపోతోంది. దీనంతటికీ ప్రధాన కారణం పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడమే. గత రెండు నెలలుగా ఎదుర్కొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై పర్యావరణవేత్త భానుకుమార్ స్పందిస్తూ, వచ్చే రెండు నెలల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

Pages