S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/02/2017 - 01:38

చౌటుప్పల్, ఆగస్టు 1: వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు సరఫరా వద్దేవద్దంటూ అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం విద్యుత్ సమస్య ఎదుర్కొన్న రైతాంగం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత ఏడు నుంచి తొమ్మిది గంటల విద్యుత్ అందుకుంటున్నారు.

08/02/2017 - 01:35

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం (రెరా)కు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (రెరా) చట్టానికి అనుగుణంగా రెగ్యులేటరీ అథారిటీని ప్రభుత్వం రూపొందించింది.

08/02/2017 - 01:29

చింతూరు, ఆగస్టు 1: పోలవరం ప్రాజెక్టుతో సర్వం కోల్పోనున్న విలీన మండలాల నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం అంతర్రాష్ట్ర దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు. చింతూరు మండలం చట్టి వద్ద 30వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆంధ్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమానికి అఖిలపక్షం మద్దతు పలికింది.

08/02/2017 - 01:26

హైదరాబాద్, ఆగస్టు 1: సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పిఎం భార్గవ మంగళవారం సాయంత్రం ఉప్పల్‌లోని నివాస గృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు.

08/02/2017 - 01:23

విశాఖపట్నం, ఆగస్టు 1: అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సిఎం చంద్రబాబు నిర్ణయించారని రోడ్లు, భవనాల మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడుతూ 393 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 27 వేల కోట్లమేర ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం అంగీకరించిందని, భూసేకరణ జరగాల్సి ఉందన్నారు.

08/02/2017 - 01:21

విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్రంలో ఈ డిసెంబర్ చివరికి 10 వేల కిలోమీటర్లమేర భూగర్భ డ్రైనేజీ నిర్మించనున్నట్టు రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో పంచాయితీరాజ్, ఉపాధిహామీ పథకం అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు వేలకంటే ఎక్కువ జనాభావున్న గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై చర్చించారు.

08/02/2017 - 01:16

అమరావతి, ఆగస్టు 1: కనిపించాల్సింది ప్రభుత్వం కాదని, పాలన మాత్రమేనని సిఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ దిశగానే పాలనా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ఈ ఏడాదిని ఈ-ప్రగతి సంవత్సరంగా ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు.

08/02/2017 - 01:14

హైదరాబాద్, ఆగస్టు1: భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ అత్యద్భుతంగా ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ కితాబిచ్చారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని ‘టెంపుల్ సిటీ’గా మార్చేందుకు రూపొందించిన ‘నమూనా’ను రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నజీయర్‌కు చూపించారు. హైదరాబాద్ సమీపంలోని శ్రీరాంనగర్‌లో జీయర్‌ను తుమ్మల కలిశారు.

08/02/2017 - 00:14

హైదరాబాద్, ఆగస్టు 1: కృష్ణా జలాలను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ విధానాన్ని అమలు చేసే ఫార్ములా, నీటి వినియోగం ప్రోటోకాల్‌ను ఖరారు చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన బజాజ్ కమిటీ బుధవారం ఢిల్లీలో కృష్ణా జలాల బోర్డుతో సమావేశమవుతోంది.

08/01/2017 - 02:57

సిరిసిల్ల, జూలై 31: నేరెళ్ళలో ఇసుక మాఫియా ఆగడాలకు బలైన బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని మీరాకుమార్ భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై చలించిపోయన ఆమె బాధిత దళిత కుటుంబాలను పరామర్శించారు. వారిని ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టారు. లారీ ప్రమాదంలో మృతి చెందిన బదనపురం భూమయ్య కుటుంబానికి రూ.50 వేల రూపాయల చెక్కును అందజేశారు.

Pages