S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/03/2017 - 02:15

న్యూఢిల్లీ, ఆగస్టు 2:రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్,ప్రధాని నరేంద్రమోదీలతో ఉమ్మడి రాష్ట్రా ల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం సమావేశమాయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నరసింహన్ రాష్టప్రతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి మర్యాదపూర్యకంగా ఆయనతో సమావేశం అయ్యారు. అలాగే గవర్నర్ ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యవహారాల శాఖమంత్రి జితేంద్రసింగ్‌తోకూడా ఆయ న సమావేశం అయ్యారు.

08/03/2017 - 01:58

హైదరాబాద్, ఆగస్టు 2: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల మిస్టరీ వీడింది. పథకం ప్రకారమే సుపారి ఇచ్చి తనపై కాల్పులు జరుపించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసులో ఐదుగురు నిందితులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి దేశీవాళీ పిస్తోలు, రూ.5.3 లక్షలు నగదు, ఒక స్కార్పియో, ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

08/03/2017 - 01:57

హైదరాబాద్, ఆగస్టు 2: రాష్ట్రంలో ప్రజలపాలిట కాంగ్రెస్ పిశాచిలా మారిందని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ మాదిరే కమ్యూనిస్టులూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని, మూర్ఖులకు అపాయింట్‌మెంట్ ఇవ్వనని తీవ్ర ఆగ్రహంతో అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఫలాలు ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుంటే, దుష్టరాజకీయాలతో ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకుల్లా తయారయ్యారని దుయ్యబట్టారు.

08/03/2017 - 01:55

హైదరాబాద్, ఆగస్టు 2: విద్యుత్ శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ (రెగ్యులరైజ్) సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ నియామకాలు ఆపాలంటూ ఆదేశించింది. కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.

08/03/2017 - 01:54

హైదరాబాద్, ఆగస్టు 2: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవద్దని సుప్రీం, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీరి సర్వీసులను రెగ్యులరైజ్ చేయలేమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అయితే వీరి సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఇతర ఉద్యోగులతో సమానంగా మాత్రం వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బుధవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/03/2017 - 01:53

అమరావతి, ఆగస్టు 2: ‘బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలి. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే లైసెన్స్‌లు రద్దుచేయండి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. అధిక ధరలకు ఇసుక అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోండి’ అని సిఎం చంద్రబాబు హెచ్చరించారు.

08/03/2017 - 01:53

రాజమహేంద్రవరం, ఆగస్టు 2: గోదావరి నీటి కోసం ఏలేరు జలాశయం తహతహలాడుతోంది. ప్రస్తుతం ఏలేరు డెడ్ స్టోరేజితోనే నెట్టుకొస్తోంది. అతి పెద్ద నీటి నిల్వ సామర్థ్యం కలిగి, ఏలేరు నుంచి అవసరాలకు నికరంగా జలాలను పంపిణీ చేసే అవకాశం ఉండటంతో అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది.

08/03/2017 - 01:52

నంద్యాల/ హైదరాబాద్, ఆగస్టు 2: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఉదయం తన సోదరుడు, వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం కార్యకర్తల మనోభావాలు, వారి అభిప్రాయాలను తెలుసుకుని వైకాపాలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.

08/03/2017 - 01:52

అమరావతి, ఆగస్టు 2: అమరావతిలో వౌలిక వసతులు, అభివృద్ధి పనులకు మూడేళ్లలో రూ.30 వేల కోట్లు అవసరం. ఇందులో లోటుగా కనిపిస్తున్న రూ.7,300 కోట్ల నిధులను వివిధ మార్గాల్లో సమకూర్చుకోవడానికి సన్నద్ధం అవుతున్నాం’ అని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఏ) సిఎం చంద్రబాబుకు నివేదించింది. బుధవారం ఉదయం సిఎం చంద్రబాబు నిర్వహించిన సిఆర్‌డిఎ వారాంతపు సమీక్షలో అధికారులు ఈ వివరాలను నివేదించారు.

08/02/2017 - 01:40

హైదరాబాద్, ఆగస్టు 1: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పురుజ్జీవన పథకానికి ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందని భారీ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. తెరాస ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ఆధునీకరణ పనులకు కూడా ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.

Pages