S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/05/2017 - 03:08

అమరావతి, ఆగస్టు 4: రైతులకు అడిగిన వెంటనే తక్కువ ఖర్చుతో అందించే ఎలక్ట్రానిక్ పాస్‌బుక్‌ను శుక్రవారం సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 25 రూపాయల ఖర్చుతో పావుగంటలోనే ఈ-పాస్‌బు పొందే వీలుందన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) రాష్టస్థ్రాయి కార్యాలయానికి విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్ అండ్ బి భవన సముదాయంలో స్థలం కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

08/05/2017 - 03:07

న్యూఢిల్లీ, ఆగస్టు 4: విశాఖపట్నంలో పెట్రో వర్సిటీ ఏర్పాటుకు ఉద్దేశించిన భారత పెట్రోలియం, ఇంధన సంస్థ 2017 బిల్లుకు శుక్రవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. పెట్రో వర్సిటీ గత రెండేళ్లుగా తాత్కాలిక వసతుల్లో పని చేయటం తెలిసిందే. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు పొందుపర్చిన బిల్లును లోక్‌సభ ఆమోదించటంతో పెట్రో వర్సిటీ ఏర్పాటుపై మరో అడుగు ముందుకేసినట్టయ్యింది.

08/04/2017 - 01:57

హైదరాబాద్, ఆగస్టు 3: డిఎస్‌సి-1998 ద్వారా నియామకాలైన ఎస్‌జిబిటి (సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల) భర్తీలో అక్రమాలు జరిగాయని, ఈ అంశంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కొంత మంది వేసిన పిటీషన్‌కు స్పందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ జిల్లాకు చెందిన కె. వేణుతో పాటు మరో నలుగురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటీషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.

08/04/2017 - 01:39

పోలవరం, ఆగస్టు 3: ఏటా వరదల ద్వారా వేల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతున్న తరుణంలో 194 టిఎంసిల సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై అపోహలు తగదని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు.

08/04/2017 - 01:18

వెల్జాల చంద్రశేఖర్

08/04/2017 - 01:12

కాకినాడ, ఆగస్టు 3: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను సాయుధ బలగాలు మరోసారి అడ్డుకున్నాయి. గురువారం ఉదయం కిర్లంపూడిలో స్వగృహం నుండి పాదయాత్ర చేసేందుకు కాపు జెఏసి నేతలతో బయటకు వస్తుండగా ఇంటి ప్రధాన ద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. 2009లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి పాదయాత్రకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

08/04/2017 - 01:09

కర్నూలు, ఆగస్టు 3: రాష్ట్రంలో 2019లో జరుగనున్న సాధారణ ఎన్నికల కురుక్షేత్రానికి నంద్యాల ఉప ఎన్నికలే నాంది అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజలు శ్రీకృష్ణుని పాత్ర పోషించి వైసిపిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

08/04/2017 - 03:08

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్రంలోని ఆక్రమిత స్థలాల్లో ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. 2013 బేసిక్ రేటు ఆధారంగా టెలీస్కోపిక్ విధానంలో క్రమబద్ధీకరించనున్నారు. వెలగపూడి సచివాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ గురువారం సమావేశమైంది. మంత్రిమండలి నిర్ణయాలను మంత్రులు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు వివరించారు.

08/03/2017 - 23:30

హైదరాబాద్, ఆగస్టు 3: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎంఫిల్, పిహెచ్‌డి ప్రవేశాలకు గురువారం నాడు నిర్వహించిన ప్రవేశ పరీక్ష పేపర్-1 ముందుగానే లీక్ అయిందనే వార్తలతో నాంపల్లిలోని యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు యూనివర్శిటీలోని వివిధ పిజి, యుజి, ఎంఫిల్, పిహెచ్‌డి కోర్సులకు 1221 దరఖాస్తులు వచ్చాయి.

08/03/2017 - 23:29

హైదరాబాద్, ఆగస్టు 3: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లించడంపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై ఎకె బజాజ్ కమిటీ ఈ నెలాఖరులోపాల ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. ఈ విషయమై కృష్ణా బోర్డు సభ్యులతో బజాజ్ కమిటీ సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంది.

Pages