S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/21/2016 - 02:22

భద్రాచలం, ఆగస్టు 20: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. స్వామివారి నిత్య కల్యాణానికి వినియోగించే ఆభరణాలు కొన్ని మాయమైనట్లుగా శనివారం అధికారులు గుర్తించారని సమాచారం. దీనిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో తాళ్ళూరి రమేష్‌బాబు విచారణ నిమిత్తం కొందరిని ఖమ్మం పిలిపించినట్లుగా సమాచారం.

08/21/2016 - 02:22

హైదరాబాద్, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఏదో ఒకటి చేయాలని ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఏప్రిల్ 30న ఇదే అంశంపై ట్వీట్ చేసిన పవన్‌కళ్యాణ్ తాజాగా ఆ అంశంపై మాట్లాడారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచడి కుమారస్వామి శనివారం ఉదయం పవన్‌కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు గంటకుపైగా సంభాషించుకున్నారు.

08/21/2016 - 02:14

సింధు సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఆమెకు ప్రభుత్వం తరఫున ఘనంగా స్వాగతం పలుకనున్నట్టు టి.సిఎం కెసిఆర్ చెప్పారు. కుటుంబీకులు, సన్నిహితులతోపాటు క్రీడాకారులు, అధికారులు, అభిమానులు కూడా ఆమె రాకకోసం ఎదురుచూస్తున్నారు. సింధును సన్మానించేందుకు జిహెచ్‌ఎంసి సమాయత్తమవుతోంది.

08/21/2016 - 02:12

గతంలో నేను సిఎంగా ఉన్నప్పుడు పుల్లెల గోపీచంద్‌కు బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించేందుకు ఐదెకరాల స్థలాన్ని ఇచ్చాను. వౌలిక సదుపాయాలు కల్పిస్తే, క్రీడాకారులు రాణిస్తారని నమ్మి, గోపీచంద్‌కు ఆనాడు స్థలం కేటాయించాను. ఈ అకాడమీలో చాలామంది అంతర్జాతీయ క్రీడాకారులు తయారయ్యారు. అప్పట్లోనే ఐఎంజి తీసుకువచ్చేందుకు కృషి చేసినా, అనివార్య పరిస్థితుల్లో రాలేదు.

08/21/2016 - 02:09

పివి సింధు దేశం గర్వించదగిన క్రీడాకారిణి. ఆమెను చూసి తెలంగాణ గర్విస్తోంది. బ్యాడ్మింటన్‌లో రాణించేందుకు గతంలో రెండుసార్లు ఆమెకు ఆర్థికసహాయం అందించాం. అదే విధంగా గోపీచంద్‌కు 50 లక్షలు అందజేశాం. ఒలింపిక్స్‌లో దేశం నుంచి పతకాలు సాధించిన ఇద్దరూ మహిళలే కావడం విశేషం. సింధు హైదరాబాద్ బిడ్డ. తెలంగాణ బిడ్డ కావడం సంతోషంగా ఉంది.

08/21/2016 - 02:07

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద అసెంబ్లీ భవన నిర్మాణం ప్రారంభమై మూడు నెలలైంది. భవన నిర్మాణంలో ఎటువంటి ప్రగతి కనిపించడం లేదు. దీంతో శీతాకాల సమావేశాలను తిరిగి హైదరాబాద్‌లోనే నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

08/21/2016 - 02:07

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డిఎ మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. శనివారం విజయవాడ సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వివరించారు. డిఏ పెంపు వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 1178.76 కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు.

08/21/2016 - 02:04

హైదరాబాద్, ఆగస్టు 20: అమెరికా గడ్డపై తొలి తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యరంగం సిద్ధమైంది. అమెరికాలోని ప్రవాస తెలుగు ప్రజలకు సంబంధించిన ప్రముఖ సంస్థ సిలికానాంధ్ర ఈ వర్శిటీని ఏర్పాటు చేయబోతోంది. జనవరిలో ఈ వర్శిటీ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. సిలికాన్ వ్యాలీలోని మిల్‌పిటాస్‌లో ఈ వర్శిటీ కోసం సిలికానాంధ్ర ఒక విశాల భవంతిని కొనుగోలుచేసింది.

08/21/2016 - 02:03

కర్నూలు, ఆగస్టు 20: చైనాకు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ కెఎ దావూద్ జాగీర్ అలియాస్ జాకీర్‌ను కడప పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు రాయలసీమ రీజియన్ ఐజి శ్రీ్ధర్‌రావు తెలిపారు. దావూద్‌తోపాటు అతని ప్రధాన అనుచరుడు ఫిరోజ్ దస్తగిరిని కడప జిల్లా రాజంపేట-రాయచోటి రహదారిలో ఆకేపాడుక్రాసు వద్ద శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు తెలిపారు.

08/21/2016 - 01:59

విశాఖపట్నం, ఆగస్టు 20: కేరళ తరహాలో రహదారి భద్రతా సంస్థను ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్టు ఏపి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. త్వరలో 9చోట్ల పూర్తి ఆటోమేటిక్ టెస్టింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. విశాఖలో రెండు రోజుల పాటు రహదారి భద్రతపై జరిగిన జాతీయ వర్కుషాపు శనివారం ముగిసింది.

Pages