S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/29/2016 - 02:55

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చెప్పారు. తగినంత బలం లేనందున తాము ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు నివారణ చర్యలను చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

04/29/2016 - 02:54

విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (ఎపిసెట్) నిర్వహణకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి యుజిసి అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆచార్య ఇ.ఎ.నారాయణ మీడియా సమావేశంలో ఇక్కడ గురువారం వెల్లడించారు. గత నెలలో యుజిసి నిపుణుల బృందం వర్సిటీని సందర్శించిందని, వివిధ అంశాలను పరిశీలించిందన్నారు.

04/29/2016 - 02:53

విజయవాడ, ఏప్రిల్ 28: భవిష్యత్‌లో కూడా ఏ ఒక్కరూ వేలెత్తి చూపనంతగా తన జీవితాంతం నీతి నిజాయితీతో ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తనలో ఏ మాత్రం స్వార్థం లేదని, బలహీనతలు అంతకంటే లేవని, అయితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే తన బలహీనత అని ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మినహా ఏ ఒక్కరూ మిగలరన్నారు.

04/29/2016 - 02:34

హైదరాబాద్, ఏప్రిల్ 28: సచివాలయానికి వచ్చే సందర్శకులు, ఉద్యోగులు వడ దెబ్బకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యగా మూడు కౌంటర్లను వైద్య ఆరోగ్యశాఖ గురువారం ప్రారంభించింది. ఈ కేంద్రాలను ఓఆర్‌ఎస్ పాకెట్లను పంచడం ద్వారా సిఎస్ రాజీవ్ శర్మ ప్రారంభించారు.

చిత్రం సచివాలయంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న సిఎస్ రాజీవ్‌శర్మ

04/29/2016 - 02:32

హైదరాబాద్, ఏప్రిల్ 28:తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేటు విద్యా సంస్థల బెదిరింపులకు లొంగేది లేదని, తనిఖీలను ఆపేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. మే 1న జరగాల్సిన టెట్, మే 2వ తేదీన జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

04/29/2016 - 02:30

కాకినాడ/ఏలూరు, ఏప్రిల్ 28: ఉభయ గోదావరి జిల్లా ల్లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) తనిఖీల్లో దొరికిపోయారు. వీరిద్దరూ కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, ఆభరణాలతో అపర కుబేరులుగా వెలిగిపోతున్నట్టు గురువారం జరిపిన తనిఖీల్లో వెల్లడయ్యింది.

04/29/2016 - 02:25

హైదరాబాద్, ఏప్రిల్ 28:ఏళ్ల తరబడి కొరకరాని కొయ్యగా మారిన రాజోలిబండ డైవర్ష్‌న్ స్కీమ్ (ఆర్డిఎస్) సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఆర్డిఎస్ పనులను 50 రోజుల్లో పూర్తి చేస్తామని కర్నాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది.

04/28/2016 - 04:47

హైదరాబాద్, ఏప్రిల్ 27:పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ ఖరారయిందని, ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 12లక్షల 30వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ తెలిపింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు, నల్లగొండలో 30వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది.

04/28/2016 - 04:43

గన్నవరం, ఏప్రిల్ 27: కృష్ణా జిల్లా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం వింతశిశువు జన్మించింది. గన్నవరం మండలం వీరపనేనిగూతెం గ్రామానికి చెందిన షేక్ బాషా, హసీనా దంపతులకు రెండో సంతానంగా మూడు కాళ్లతో మగబిడ్డ జన్మించింది. మధ్యాహ్నం 3.45 గంటలకు గైనకాలజిస్టు డాక్టర్ అరుణ కాత్యాయిని హసినాకు డెలివరీ నిర్వహించారు.

04/28/2016 - 04:42

గాజువాక, ఏప్రిల్ 27: విశాఖ జిల్లా దువ్వాడ సెజ్‌లోని బయోమ్యాక్స్ ఫ్యూయల్స్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంగళవారం విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు అలా ఎగసిపడుతూనే ఉన్నాయి. మూడు జిల్లాలకు చెందిన అగ్నిమాపక కేంద్రాల నుంచి వాహనాలు, ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు.

Pages